Monday, 30 July 2018

615 Jobs Approved In Hyderabad Water Board

జలమండలిలో 615 ఉద్యోగాలు : త్వరలో నోటిఫికేషన్




హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్‌బోర్డు(వాటర్‌బోర్డు)లో వివిధ విభాగాల్లో 615 కొత్తపోస్టులను త్వరలో భర్తీచేయనున్నారు. నీటి సరఫరా విభాగంలో జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయీస్) 200, సీవరేజీ విభాగంలో 200, మేనేజర్లు 80, అసిస్టెంట్ పీ అండ్ ఏలో 20, అసిస్టెంట్ ఎఫ్ అండ్ ఏలో 15, టెక్నికల్ గ్రేడ్ అసిస్టెంట్లు 100 పోస్టులను భర్తీ చేయనుంది జలమండలి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి జలమండలికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నేరుగా జరపుకోవచ్చని పేర్కొన్నది. ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ, వాటర్‌బోర్డు పరిధి 688 చదరపు కిలోమీటర్ల నుంచి 1456 చదరపు కిలోమీటర్ల మేరకు పెరగడంతో ఖాళీలను తక్షణమే భర్తీచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ, ఎంపికకు సంబంధించిన పూర్తివివరాలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు జలమండలి అధికారులు.

Panchayat Secretary Recruitment is On Permanent Basis Only

పంచాయతీ కార్యదర్శులవి శాశ్వత ఉద్యోగాలే
అవి ఒప్పంద నియామకాలు కావు 

భగీరథతో పంచాయతీల ఖర్చులు తగ్గుదల

పండగ వాతావరణంలో 4,383  పంచాయతీల అవతరణ

ఒకేసారి ఇన్ని ఏర్పాటు దేశంలోనే ప్రథమం
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా నియమించనున్న 9,200 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికనే ఉంటాయని, ఒప్పంద ఉద్యోగాలు కావని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. నిరంతర విద్యుత్తు, భగీరథ ద్వారా మంచినీళ్ల సరఫరా వల్ల గ్రామ పంచాయతీ ఖర్చులు సగానికి తగ్గబోతున్నాయని, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.1,132 కోట్లను ఇవ్వనున్నందున వాటికి నిధులు బాగా అందుబాటులోకి వస్తాయన్నారు. కొన్ని పంచాయతీల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టదలచామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆగస్టు2న 4,383 పంచాయతీలు ఒకేసారి బ్యానర్లు, బోర్డులు, మామిడి తోరణాలు, టాంటాం, మంగళ వాయిద్యాల నడుమ పండగ వాతావరణంలో ఆవిర్భవించబోతున్నాయన్నారు. ఒకే సారి భారీ సంఖ్యలో పంచాయతీలు అవతరించటం దేశంలో ఇదే ప్రథమమని మంత్రి పేర్కొన్నారు. కొత్త పంచాయతీలు అవతరిస్తున్న సందర్భంగా మంత్రి సోమవారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ పద్ధతిలోనే నియమిస్తామని, అర్హులు ఉద్యోగాల్లోకి వచ్చాక మూడేళ్ల పాటు ప్రొబేషన్‌ వ్యవధి ఉంటుందని మంత్రి తెలిపారు. ఎంపిక విధానాలపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని పంచాయతీల్లోనూ త్వరలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పాత పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోయినందున సర్పంచులను పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా కొనసాగించటం సాధ్యంకాదని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న మీదటనే.. పదవీకాలం పూర్తికాని 18 తప్ప మిగతా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామన్నారు. బీసీ గణన చేపట్టి.. ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు న్యాయపరంగా పోరాడతామన్నారు.
కొత్త పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన నిధులు
ఆర్థిక సంఘం తదితరాల ద్వారా వచ్చే నిధులను  కొత్తపంచాయతీలకు అక్కడి జనాభా ప్రాతిపదికన పంచి ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలతో ఆయన గురువారం ఇక్కడి నుంచి దూరదృశ్య సదస్సును నిర్వహించారు. పంచాయతీల అవతరణ దినోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు.

Recruitment For Newly Launching Website

*Immediately Hiring People to Work For a Newly Launching Website*

*Job Role :- Need to Write Political News in Both English and Telugu Languages*

*Recruitment Type :- Permanent Job*

*Qualification :- Degree with Computer Typing Skills*

*Salary :- 25000 for English and 20000 for Telugu*

*Work Place : - Hyderabad*

*Last Date :- August 5 2018*

*Preference will be given to Those have Experience in Media and Typing Fields*

If Interested Send Your Resume and Contact Details to the below email id

Srinivastcinema@gmail.com

*You will be contacted Soon once we receive your email*

నూతనంగా మొదలైయ్యే website లో రాజకీయ వార్తలు తెలుగు మరియు English లో  వ్రాయడానికి  యువతీ యువకులు కావలెను

అర్హత : డిగ్రీ మరియు కంప్యూటర్ టైపింగ్ (తెలుగు లేదా english )వచ్చి ఉండాలి

జాబ్ టైప్ :- పెర్మనెంట్

జీతం :- 25000 /- For English & 20000 ఫర్ తెలుగు

పనిచేయు స్థలం : హైదరాబాద్

చివరి తేదీ : August 5 2018

ఇదివరకే వార్తా సంస్థల్లో పనిచేసిన వారికి మరియు Typing  అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును

ఆసక్తి కలవారు ఈ క్రింది mail
Id కి  తమ రెస్యూమ్ , Contact Details పంపగలరు

Srinivastcinema@gmail.com


Sunday, 29 July 2018

Apprenticeship Notification Released For ITI candidates In NTPC

రామగుండం NTPC లో 2018-2019 సంవత్సరానికి
అప్పరేంటిషిప్ కొరకు ప్రకటన విడుదల చేశారు

 1)ఎలక్ట్రికల్ -Electrical 
2)Fitter - ఫిట్టర్
3)Welder - వెల్డర్
4)Copa - కోఫ ట్రేడ్స్ లో గత 3 సంవత్సరాలలో ITI లో పాస్  ఐనవారే అర్హులు

అభ్యర్థులు తప్పనిసరిగా Regional Directorate Of Apprenticeship Training (RDAT) Portal నందు నమోదు చేసుకున్న వాళ్లై ఉండాలి

ఆగస్టు 1 2018 నుంచి ఆగస్ట్ 25 2018 మధ్య నేరుగా రామగుండం వద్ద కల Employment Development Centre నందు తమ దరఖాస్తులు సమర్పించాలి




How A Woman From Mancherial Became First Tribal Pilot of Telangana

మంచిర్యాల అమ్మాయి మిగతా అమ్మాయిలకు భిన్నంగా పైలట్ కావాలని ఎందుకు అనుకుంది? తన కలను ఎలా సాకారం చేసుకుంది? తెలంగాణ గిరిజన తొలి మహిళా పైలట్‌ అజ్మీరా బాబీ బీబీసీకి చెప్పిన విశేషాలు మీకోసం.


HOW TO GET JOB IN RAILWAYS

రైల్వేలో ఉద్యోగం పొందడం ఎలా?



ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వే. బ్యాంక్ ఉద్యోగాలకు యువతలో ఎంత క్రేజ్ ఉంటుందో రైల్వేలో ఉద్యోగాలకూ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. పోటీ కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమనో, జీతభత్యాలు బాగుంటాయనో, మరే ఇతర కారణాల వల్లనో... రైల్వే ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి స్పందన ఎప్పుడూ ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే రైల్వేల్లో ఎన్ని రకాల ఉద్యోగాలుంటాయి, వాటికి అర్హతలేమిటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ప్రవేశ పరీక్షలెలా ఉంటాయి...

రైల్వేలో ఉద్యోగాలు ప్రధానంగా నాలుగు విభాగాలుగా ఉంటాయి. అవి... గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ, గ్రూప్ డీ.

గ్రూప్ ఏ కేటగిరీ ఉద్యోగాలు:ఇవి యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే సివిల్స్ పరీక్షల ద్వారా భర్తీ అవుతాయి. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్... ఈ రెండింటికీ అర్హతలు సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించినవే. మరొకటి ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్. దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే అర్హులు. ఇంకొకటి ఇండియన్ మెడికల్ సర్వీసెస్. ఈ నాలుగు కేటగిరీల ఉద్యోగాల భర్తీని యూపీఎస్సీ నిర్వహిస్తుంది.

గ్రూప్ బీ... ఇవి పూర్తిగా డిపార్ట్‌మెంటల్ ఉద్యోగాలు. అంటే... గ్రూప్ సీలో పనిచేసేవాళ్లు తగినంత అనుభవం పొందిన తర్వాత డిపార్ట్‌మెంటల్ టెస్టులు రాసి ఉత్తీర్ణులైతే గ్రూప్ బీ కేటగిరీకి పదోన్నతి పొందవచ్చు.

గ్రూప్ సీ... స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్, క్లర్క్, కమర్షియల్ అప్రెంటీస్, సేఫ్టీ స్టాఫ్, ట్రాఫిక్ అప్రెంటీస్, ఇంకొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సంవత్సరం 26000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 2.6 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకున్న డిమాండ్ ఎలాంటిదో.

వీటికి కనీస విద్యార్హత పదో తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత. 18 నుంచి 32 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. వీటితోపాటు సాధారణ రిజర్వేషన్లన్నీ వర్తిస్తాయి.

గ్రూప్ డీ ఉద్యోగాలు: ఇవి ప్రాథమిక స్థాయి లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు అని చెప్పవచ్చు. ట్రాక్ మెన్, హెల్పర్, పాయింట్స్ మెన్, సఫాయివాలా, ప్యూన్... ఇలా ప్రతి రైల్వే స్టేషన్లోనూ అవసరమైన సాధారణ సిబ్బంది అందరూ గ్రూప్ డీ కిందికి వస్తారు. దీనికి కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

ఈ విభాగంలో ప్రతి సంవత్సరం దాదాపు 62000 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ప్రత్యేకించి ఓ సమయమంటూ ఏమీ ఉండదు. రైల్వే శాఖ ఎప్పుడు ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే అప్పుడు ప్రకటన విడుదల చేస్తుంది.

Saturday, 28 July 2018

CAT EXAM SCHEDULE RELEASED

ఆగస్టు 8 నుంచి ‘క్యాట్‌’ దరఖాస్తుల స్వీకరణ 

నవంబర్‌ 25న పరీక్ష

దిల్లీ: ఐఐఎమ్‌లు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్‌ పరీక్ష.. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 8న మొదలవుతుంది. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రుసుమును కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే చెల్లించాలి. సెప్టెంబర్‌ 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అక్టోబర్‌ 24 నుంచి అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులకు అందుబాటులో పెడతారు. నవంబర్‌ 25న రెండు విడతల్లో పరీక్షను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 147 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్‌ 17 నుంచి ‘క్యాట్‌’ వెబ్‌సైట్‌లో.. నమూనా పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు వివరాలను పరీక్ష సంచాలకుడు, ఐఐఎమ్‌-కలకత్తా ఆచార్యుడు సుమంత బసు వెల్లడించారు.



x

281 Junior Lecturer Post's in TS Gurukulam

గురుకులాల్లో 281 జేఎల్‌ పోస్టులు

హైదరాబాద్
గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 281 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను తెలంగాణ గురుకుల నియామక బోర్డు భర్తీ చేయనుంది. ఈనెల 31న అధికారికంగా ప్రకటన వెలువరించేందుకు సమాయత్తమైంది. వీటికి ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 8 వరకూ ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. అత్యధికంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 149 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పేపర్‌-1,2,3తో పాటు డెమో ఉంటుంది. గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 600 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల ప్రకటన వెంట‌నే వెలువరించాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతోంది. త్వరలోనే యూజీసీ నెట్‌ ఫలితాలు వెల్లడవ్వనున్న నేపథ్యంలో మరికొందరికి పరీక్ష రాసేందుకు అవకాశమివ్వాలని భావిస్తోంది. ప్రకటన ఇప్పుడే వెలువరిస్తే.. తాజాగా నిర్వహించే పరీక్షలో అర్హత పొందే అవకాశాలున్న అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో అందరికీ అవకాశమిచ్చేందుకు డిగ్రీ లెక్చరర్‌ ప్రకటన తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపింది. గురుకుల బోర్డు ఇప్పటికే పీజీటీ, టీజీటీ పోస్టులకు రెండు ప్రకటనలు జారీ చేసింది. వీటికి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గురుకుల బోర్డుకు అప్పగించిన నియామకాలు అక్టోబరు నాటికి పూర్తిచేయాలని బోర్డు వర్గాలు లక్ష్యంతో ఉన్నాయి.


MID-DAY MEALS Program Extended to College's In Telangana

కాలేజీ పిల్లలకు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ తదితర అన్ని కళాశాలల్లో..
5 లక్షల మందికి ప్రయోజనం
సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ


హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక  భాగస్వామ్యంతో పాఠశాలల్లో అమలు చేస్తుండగా.. ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్ర నిధులతో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, బీఈడీ, డీఈడీ కళాశాలల్లో, ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనివల్ల మొత్తం అయిదు లక్షల మందికి లబ్ధి చేకూరనుందని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన రెండేళ్లుగా ఉంది. పథకం అమలుపై శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సచివాలయంలో సమావేశమై చర్చించారు.
‘అక్షయపాత్ర’ ద్వారా అమలు..
పాఠశాలల్లో వంట ఏజెన్సీ మహిళలు భోజనాన్ని వండుతున్నారు. కళాశాలల్లో వారికి అప్పగిస్తే మళ్లీ వంట గదులు నిర్మించాలి. పర్యవేక్షణ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలును ‘అక్షయపాత్ర’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. కళాశాలల్లో అమలు బాధ్యతనూ ఆ సంస్థకే అప్పగించాలని భావిస్తున్నారు. సమావేశానికి ఆ సంస్థ ప్రతినిధులనూ ఆహ్వానించారు. ఒకవేళ ఆ సంస్థకు ఎక్కడైనా సరఫరా చేసే వీలు లేకపోతే సమీపంలోని మెస్సులు, హోటళ్ల ద్వారా సరఫరా చేయాలని ఉప సంఘం సభ్యులు చర్చించారు. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా, పౌష్టిక విలువలతో అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులను మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిటీ అడిగింది. అయిదు లక్షల మంది విద్యార్థులకు కావాల్సిన సరకులన్నీ ఫౌండేషనే సమకూర్చుకొని అందించడం, పులిహోర, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి పలు రకాల తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఉపసంఘం సూచించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కళాశాలలకు భోజనం అందేవిధంగా కావాల్సిన కిచెన్లను ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆగస్టు 3న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ జేడీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖర్చు ఏటా రూ.150 కోట్లు: ప్రభుత్వం 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పినా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 3.50 లక్షలే. వారందరికీ పథకం అమలు చేయాలంటే రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అదే 5 లక్షల మంది అయితే రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి.

Open School Fee Schedule Released

ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల


హైదరాబాద్ : ఓపెన్ స్కూల్ విధానంలో అడ్మిషన్ పొంది అక్టోబర్ 2018లో నిర్వహించబోయే పదోతరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజును మీ సేవ, టీఎస్‌ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో అడ్మిషన్ పొంది పరీక్షలకు హాజరుకాని వారు, పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన వారు కూడా ఈ పరీక్షలు రాయడానికి అర్హులని అన్నారు. పదోతరగతిలో ప్రతి సబ్జెక్టుకు రూ.100(థియరీ), రూ.50(ప్రాక్టికల్), ఇంటర్మీడియేట్‌లో ప్రతి సబ్జెక్టుకు రూ.150(థియరీ), రూ.100(ప్రాక్టికల్)కు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చెల్లించాలని తెలిపారు. ఆగస్టు 14 నుంచి 20వ తేదీ వరకు రూ.25 చొప్పున అపరాద రుసుంతో, ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రూ.50చొప్పున అపరాద రుసుంతో చెల్లించాలని తెలిపారు. కావున అధ్యాయన కేంద్రాల కో ఆర్డినేటర్లు, సిబ్బంది ఈ విషయమై విస్తృత ప్రచారం చేసి ఎక్కువ మంది విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Friday, 27 July 2018

TSPSC APPROVED 93 NEW POSTS

93 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన

హైదరాబాద్: పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీచేసింది. పురపాలకశాఖలో 35 శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 50 హెల్త్ అసిస్టెంట్ల భర్తీకి అదేవిధంగా పాడి అభివృద్ధి సహకార సమాఖ్యలో 8 ఫీల్డ్ అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. హెల్త్ ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులకు ఆగస్టు 3 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు


FREE CIVILS COACHING IN TELANGANA

500 మందికి సివిల్స్‌ శిక్షణ

ఈ నెల జులై 30 2018 నుంచి దరఖాస్తులు

ఆగస్టు 12 2018 చివరి తేదీ

 రాష్ట్రంలో 500 మంది నిరుద్యోగ యువతకు సివిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి ఆగస్టు 12 వరకు వెబ్‌సైట్‌   http://tsbcstudycircles.cgg.gov.in   ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్స్‌ శిక్షణకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ జి.సుజాత తెలిపారు. ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించి 500 మందిని ఎంపిక చేస్తామని, వీరికి హైదరాబాద్‌, వరంగల్‌ జిల్ల్లాల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ ప్రారంభమైన రెండునెలల తరువాత మరోసారి పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభచూపిన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కు శిక్షణ ఇస్తామని, ఉపకారవేతనం చెల్లిస్తామని వివరించారు. మిగతా 400 మందికి ప్రిలిమ్స్‌ శిక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు.

Notification: https://drive.google.com/file/d/1wTYKRJ89m39qddjeiLhQoRXRt7UoygnO/view?usp=drivesdk

Bare Foot Technician Jobs In Mancherial District with Civil Polytechnic as Qualification

Bare Foot Technician Jobs In Mancherial District with Civil Polytechnic as Qualification
మంచేరియల్ జిల్లాలో  బేర్ ఫుట్ టెక్నీషియన్ జాబ్స్ కొరకు సివిల్ పాలిటెక్నిక్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
Application Type Offline Mode

Last Date : 2nd August 2018




Tuesday, 24 July 2018

Good Chance For Youth of Telugu States


DUTIES OF PANCHAYAT SECRETARY

కార్యదర్శి ముఖ్య విధులు ఇలా ఉంటాయి 


* పంచాయతీ తీర్మానాలను కార్యదర్శి అమలు చేయాలి. గ్రామంలో రోజూ ఉదయాన్నే పర్యటిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది హాజరును తీసుకొని వారికి పనులు చూపించాలి. మురుగు కాలువల్లోని పూడికను తీయించాలి. చెత్తను తడి,పొడిగా డంపింగ్‌ యార్డుల వరకు తరలించేలా.. వీధిదీపాలు 90 శాతం వెలిగేలా చూడాలి. తాగునీటి సరఫరాకు భగీరథ అధికారులకు సహకరించాలి. అతను పంచాయతీకి అధీనుడు (సబార్డినేట్‌)గా ఉంటారు.

* కార్యదర్శి కొత్త పన్నులను ప్రతిపాదించవచ్చు. విధుల్లో విఫలమైన కార్యదర్శి తన ఉద్యోగాన్ని కోల్పోక తప్పదు. గ్రామంలో మొక్కలను నాటడం, వాటిలో కనీసం 85 శాతం బతికేలా చర్యలు చేపట్టి వివరాల నమోదుకు రిజిస్టర్‌ను నిర్వహించాలి. ప్రతి రాబడి, ఖర్చును లెక్కల పుస్తకంలో నమోదు చేయాలి. సర్పంచి పర్యవేక్షణ, నియంత్రణ కింద పంచాయతీ సిబ్బందిపై పాలనాపరమైన, వారికి జీతాల చెల్లింపు అధికారాలు కార్యదర్శికి ఉంటాయి.

* కార్యదర్శి తాను నిర్వర్తించిన పనులపై ప్రతినెలా నివేదికలను బహిర్గతపరచాలి. ఇందులో తప్పిదాలు బయటపడితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. పంచాయతీ అనుమతించే ఏదైనా అనుమతి లేదా ఉత్తర్వును మరుసటిరోజే కార్యదర్శి జారీ చేయాలి. సర్కారు ఎప్పటికప్పుడు ఇచ్చే ఉత్తర్వులను అమలు చేస్తుండాలి. కార్యదర్శులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవచ్చు.

Monday, 23 July 2018

316 News Posts Approved in Revenue Department by Government

316 New Posts are AppriApp in Revenue Department by Government

CAPF EXAM SCHEDULE/PATTERN/SYLLABUS EXPLANATION

CAPF EXAM SCHEDULE/ PATTERN/ SYLLABUS EXPLANATION




కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో 54,953 ఖాళీలు

బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) త‌దిత‌ర కేంద్ర సాయుధ పోలీసు బ‌ల‌గాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మ‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వివ‌రాలు......
1) కానిస్టేబుల్ (జీడీ)
2) రైఫిల్‌మ‌న్ (జీడీ)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 54,953 (పురుషుల‌కు 47,307; మ‌హిళ‌ల‌కు 7,646)
విభాగాల‌వారీ ఖాళీలు: బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)-16984, సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)-200, సెంట్ర‌ల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)-21566, స‌శ‌స్త్ర సీమబ‌ల్ (ఎస్ఎస్‌బీ)-8546, ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ)-4126, అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)-3076, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08, సెక్ర‌టేరియ‌ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్‌)-447.
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.
వ‌య‌సు: 2018 ఆగ‌స్టు 1 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామ్ ద్వారా.
ప‌రీక్షా విధానం: జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, ఎలిమెంట‌రీ మ్యాథ‌మేటిక్స్‌, ఇంగ్లిష్/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున మొత్తం వంద‌ ప్ర‌శ్న‌లు ఇస్తారు. మొత్తం మార్కులు వంద‌. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మాల్లో ఉంటుంది. గంట‌న్న‌ర స‌మ‌యంలో స‌మ‌ధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 21.07.2018

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.08.2018

ExAM SCHEDULE/ PATTERN/ SYLLABUS EXPLANATION

దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాలు... పైగా ఆకర్షణీయ వేతనాలు! యువతకు ఇప్పుడో చక్కని అవకాశం వచ్చింది. కష్టపడి సిద్ధమైతే పదోతరగతితోనే కేంద్ర కొలువులకు ఎంపిక కావొచ్చు! కేంద్రప్రభుత్వ అధీనంలోని వివిధ రక్షణ సంస్థలైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లలోని కానిస్టేబుల్‌, రైఫిల్‌మన్‌ కొలువుల భర్తీ జరగబోతోంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా 54,953 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ప్రతి విభాగంలోనూ మహిళల కోసం కొన్ని పోస్టులు కేటాయించటం విశేషం!
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లోని పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పదో తరగతి (లేదా) సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో ఉండటం తప్పనిసరి. రాష్ట్రాల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. రాష్ట్రాలవారీగా పోస్టుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఎన్ని పోస్టులున్నాయో తెలుసుకోవడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ వెబ్‌సైట్‌ను గమనిస్తుండాలి.
18 - 23 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు పోటీపడవచ్చు. అయితే..
* ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల మినహాయింపు ఉంది.
* ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల మినహాయింపు ఉంది.
* అంగవైకల్యం కలిగిన అభ్యర్థులకు అర్హత లేదు.
అర్హత కల్గిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పంపుకోవచ్చు. మహిళా అభ్యర్థులు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించే అవసరం లేదు. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా ఈ పరీక్షకు దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఆరంభం : 24.7.2018
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ముగింపు: 24.8.2018
పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌: విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌.
ఎంపిక ప్రక్రియ నాలుగంచెల్లో ఉంటుంది. 1) ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ 2) ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ 3) రాత పరీక్ష 4) మెడికల్‌ పరీక్ష.
ఫిజికల్‌ పరీక్షల్లో అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్ష ప్రశ్నలు ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషలో వస్తాయి. ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందితే మెడికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. అన్ని అంచెల్లో అర్హత పొందినవారికి మెరిట్‌ ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు.
ఫిజికల్‌ స్టాండర్డ్‌, ఎఫిషియన్సీ టెస్ట్‌ కోసం, 5 కిలోమీటర్లు, 1.6 కిలోమీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, హై జంప్‌ ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ చేయాలి. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో/పర్యవేక్షణలో సాధన చేస్తే మంచిది.
రిఫరెన్స్‌ పుస్తకాలు: అరిహంత్‌ పబ్లికేషన్‌, కిరణ్‌ ప్రకాషన్‌ పబ్లికేషన్‌, విద్యా పబ్లికేషన్‌, ఎస్‌.చంద్‌ పబ్లికేషన్‌, రేమండ్‌ మర్ఫీ గ్రామర్‌ బుక్‌, మాదిరి ప్రశ్నపత్రాలు.
ఏ విభాగం ఎలా?

జనరల్‌ ఇంటెలిజెన్స్‌:
నంబర్స్‌, లెటర్స్‌, బొమ్మల మీద ప్రశ్నలు వస్తాయి. వెన్‌ డయాగ్రామ్‌, అడ్రస్‌ మ్యాచింగ్‌, రోల్‌నంబర్‌ మ్యాచింగ్‌, బొమ్మలను పూర్తిచేయడం, పజిల్స్‌, రక్తసంబంధాలు, గడియారాలు, క్యాలండర్‌, సిల్లాజిజమ్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ అంశాల నుంచి 25 ప్రశ్నలు వస్తాయి.
వీటికి సరైన జవాబు గుర్తించాలంటే.. అభ్యర్థులు సృజనాత్మకత చూపాలి. బొమ్మల మీద వచ్చే ప్రశ్నల్లో ఒక చిన్న లాజిక్‌ ఆధారంగా ప్రశ్నకు సమాధానం సులువుగా రాబట్టవచ్చు. బొమ్మ పూర్తి చేసినప్పుడు దానిలో వృత్తం కానీ, చతురస్రం (లేదా) దీర్ఘచతురస్రం వంటి ఏదైనా ఒకటి కనపడే అవకాశాలు ఉంటాయి. వాటి ఆధారంగా సమాధానాలు గుర్తించవచ్చు.
నంబర్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌ అంశాల్లో ప్రశ్నలో ఉన్న నంబర్‌ను చూసే పద్ధతిని బట్టి సమాధానం రాకపోతే, సమయం వృథా చేయకూడదు. ఒక లాజిక్‌ ఆధారంగా సమాధానం రాకపోతే, సమయం వృథా చేయకుండా లాజిక్‌ మార్చి వేరే విధంగా ప్రయత్నించాలి.

ఈ విధంగా ఒక నంబర్‌ను చేసే విధానాన్ని మార్చుకుంటూ లాజిక్‌ పసిగట్టడం నేర్చుకోవాలి.
అడ్రస్‌ మ్యాచింగ్‌ ప్రశ్నల్లో నంబర్‌ 0ను లెటర్‌ ‘ఓ’కు తేడా గుర్తించాలి. చిన్న అక్షరాలు, పెద్ద అక్షరాల మధ్య వ్యత్యాసం, కామాలు, ఫుల్‌స్టాప్‌ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
హైలెవల్‌ రీజనింగ్‌లో సిల్లాజిజమ్స్‌ ప్రశ్నలు వెన్‌-డయాగ్రామ్‌ ఆధారంగా నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌ భాషపై పట్టుంటే హైలెవల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు సులువుగా చేయవచ్చు. అందుబాటులో ఉన్న పుస్తకాల నుంచి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌:
అభ్యర్థులు మొదటగా షార్ట్‌కట్‌ విధానంలో X, +, -, ÷ చేయడం నేర్చుకోవాలి. సాంప్రదాయిక పద్ధతి నుంచి బయటకు వచ్చి, పెన్‌ ఉపయోగించకుండా సింప్లిఫికేషన్‌ చేయడం అలవాటు చేసుకోవాలి.
అరిథ్‌మెటిక్‌ అంశాల్లో సమాధానం తీసుకురావడానికి కనీసం 4 రకాల విధానాలు ఉంటాయి. ప్రతి ప్రశ్నని 4 విధానాలుగా చేసి, దేనికి తక్కువ సమయం పడుతుందో తెలుసుకోవాలి. ఇచ్చిన ప్రశ్నకి తక్కువ సమయంలో సమాధానం గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి అభ్యర్థుల దృష్టి .. సమాధానం మీద కాకుండా ఏ విధానంలో చేస్తే తక్కువ సమయం పడుతుందో తెలుసుకోవడం మీద ఉండాలి. చాప్టర్‌ వేరైనప్పటికీ లాజిక్‌ ఒకటే ఉంటుంది. అలా చాప్టర్ల మధ్య పోలికలు, తేడాలు గుర్తిస్తూ ప్రిపేర్‌ అవ్వాలి.
అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలను రోజువారీ దినచర్యలో భాగంగా ఉండే అంశాలతో ముడిపెడుతూ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అలా చేస్తే ఫార్ములాల అవసరం లేకుండా సమాధానాలు గుర్తించవచ్చు. పెన్‌ ఉపయోగించకుండా కొన్ని రోజులు సాధన చేస్తే అద్భుతమైన మెరుగుదల ఉంటుంది.
మేథమేటిక్స్‌ అంశాల్లో ఆల్జీబ్రా, త్రికోణమితి అంశాల ప్రశ్నలను సబ్సిట్యూషన్‌ విధానం ఉపయోగిస్తే సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు.
అన్ని అంశాలకు సంబంధించిన ఫార్ములాలను పట్టికగా తయారు చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువసార్లు చదివి వాటిని గుర్తుంచుకోవాలి.
జనరల్‌ ఎవేర్‌నెస్‌:
నోటిఫికేషన్‌ సమయం దగ్గర నుంచి పరీక్ష తేదీ ముందురోజు వరకూ ప్రతిరోజూ దినపత్రిక చదువుతుండాలి. వాటిలో కరెంట్‌ అపైర్స్‌ అంశాల్లోని ముఖ్యమైనవి నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఆయా అంశాల నుంచి ఏ విధంగా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుందో ఆలోచిస్తూ సొంతగా ప్రశ్నలు తయారుచేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
8, 9, 10 తరగతుల పాఠ్యాంశాలలోని జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ అంశాలు చదువుకోవాలి. వాటికి సంబంధించిన నోట్్స తయారు చేసుకోవాలి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌:
ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ కాదు. భాష. దీని మీద పట్టు సాధించాలంటే మాట్లాడటం, చదవడం, ఇంగ్లిష్‌ వార్తలు వినడం చేయాలి. ఇందుకోసం రోజుకు కనీసం గంట సమయం కేటాయించాలి. ఇంగ్లిష్‌ గ్రామర్‌లోని నియమాలు నేర్చుకోవాలి. పదాలకు అర్థం తెలుసుకోవాలి. వాటిని ఉపయోగిస్తూ ఇంగ్లిష్‌లో మాట్లాడటం మొదలుపెట్టాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్ట్‌ ప్రశ్నలు సమాధానాలు గుర్తించాలంటే ప్రశ్నల్లో ఇచ్చిన సమాచారం తక్కువ సమయంలో చదివి అర్థం చేసుకోవాలి. అంటే రీడింగ్‌ స్కిల్‌ పెంపొందించుకోవాలి.
రేమండ్‌ మర్ఫీ గ్రామర్‌ పుస్తకాన్ని చదివితే ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించవచ్చు. చేసిన తప్పులు సరిచేసుకుంటూ, తిరిగి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.

వెబ్‌సైట్‌: www.ssc.nic.in

గుర్తుంచుకోండి!
* ప్రతీ విభాగంలోని ప్రశ్నలు చదివి, అందులో సులభమైనవాటిని ముందు ఎంచుకోవాలి.
* ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు.
* జవాబు రాకపోయినా, ప్రశ్న అర్థం కాకపోయినా ప్రశ్నను విడిచిపెట్టాలి.
* పట్టు ఉన్న అంశాల నుంచి వచ్చిన ప్రశ్నలను ముందు ఎంచుకోవాలి.
* అంశాలవారీగా పట్టు సాధించాలి. ముఖ్యవిషయాలు, ఫార్ములాలను పట్టిక రూపంలో రాసుకోవటం మేలు..
* కరెంట్‌ అఫైర్స్‌ నోట్స్‌ తయారు చేసుకోవాలి.
* తప్పులు సరిచేసుకోవాలి.
* రోజువారీ వ్యాయామంతోపాటు, ఫిజికల్‌ పరీక్షలో ఉన్న పరుగుపందెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.
సాధన.. సాధన..!
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జీడీ కానిస్టేబుల్‌ పరుగుపందెం కోసం రోజూ కనీసం 3 కిలోమీటర్ల్లు, వారానికి ఒకసారి 5 కి.మీ. పరుగు సాధన చేశాను. లాంగ్‌ జంప్‌, హైజంప్‌లైతే జాగ్రత్తగా ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేశాను.
ఇక రాతపరీక్ష అయిన కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ కొంచెం సులభంగా, మ్యాథమేటిక్స్‌ కొంచెం కఠినంగా ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం పూర్వ ప్రశ్నపత్రాలు, వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ (ఎస్‌.చంద్‌) అభ్యసించాను. జీకేలో అన్ని సబ్జెక్టులూ, సమకాలీన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. సబ్జెక్టుల్లోని ప్రశ్నల కోసం ల్యూసెంట్‌ జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాన్నీ, సమకాలీన అంశాల కోసం ప్రతిరోజూ వార్తాపత్రికనూ చదివాను. క్వికర్‌ మ్యాథ్‌్్సను అరిథ్‌మెటిక్‌ కోసం, కిరణ్‌ ప్రకాశన్‌ పుస్తకాన్ని ప్యూర్‌ మ్యాథ్స్‌ కోసం చదివా. పూర్వప్రశ్నపత్రాలు కూడా అభ్యాసం చేశా. ఇంగ్లిష్‌ ప్రశ్నలు గ్రామర్‌పై ఆధారపడివుంటాయి.‘ప్లింత్‌ టు పారమౌంట్‌ బై నీతూసింగ్‌’, ఒకాబ్యులరీ కోసం ‘వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ’ చదివాను.

- హరి కారాని
2015 సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌, 2016
ఎఫ్‌సీఐ ఏజీ-3 డిపో నోటిఫికేషన్ల విజేత

Website :- http://ssc.nic.in/

Notification :- https://drive.google.com/file/d/1rc9jc1RoXCYQL3hpG3_BpxSneOR0ot7C/view?usp=drivesdk


Sunday, 22 July 2018

9200 Panchayat Posts got Approved By CM


9200 Panchayat Secretary Posts Approved by Cm KCR Notification Will be Released Soon...

త్వరలో 9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. త్వరలో 9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనుంది. వారం రోజుల్లోగా ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లోపు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి కచ్చితంగా ఉండాలని, పల్లె సీమల అభివృద్ధిలో కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలని సీఎం అన్నారు.

రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు. కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని, విధులు నిర్వహించలేని వారిని క్రమబద్దీకరించకుండా ఉండే విధంగా విధానం రూపొందించాలని సీఎం చెప్పారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇవ్వాలని ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్ లో కార్యదర్శుల నియామకాలు జరపాలని చెప్పాలి. 

రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయితీలకు కార్యదర్శులున్నారు. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. పాత గ్రామ పంచాయితీల్లో కూడ ఖాళీలున్నాయి. అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయితీ కార్యదర్శులుండాలని, ఒక కార్యదర్శి మరో పంచాయితీకి ఇన్ చార్జిగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా కొత్తగా 9,200 మందిని పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పారు. నియామక ప్రక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించాల్సిందిగా పంచాయిత్ రాజ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, కమిషనర్ శ్రీమతి నీతూ ప్రసాద్ లను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు ప్రకటించారు.

‘‘గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని నమ్ముతున్నది. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరిపాలన సౌలభ్యం కోసం, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో కొత్త పంచాయితీలను కూడా ఏర్పాటు చేసింది. పంచాయితీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలు చేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాలువల నిర్మాణం-నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడడం, దోమల నివారణ, స్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు లాంటి ఎన్నో బాధ్యతలు గ్రామ పంచాయితీకున్నాయి. గ్రామ పంచాయితీ పాలక వర్గంతో కలిసి గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శి విధిగా ఉండాలి. అందుకే 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే రెండు మూడేళ్లలోనే ఎంతో మార్పు వస్తుంది. తెలంగాణ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతాయి. దేశ వ్యాప్తంగా ఆదర్శ గ్రామాలెక్కడున్నాయంటే తెలంగాణలోనే అనే పేరు వస్తుంది’’  అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

LINK.  


Source :Telangana CMO Facebook Release & Eenadu 





Friday, 20 July 2018

JOBS IN CENTRAL ARMED FORCES

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 54,953 ఖాళీలు...



కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఎన్‌ఐఏ & ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఎగ్జామినేషన్-2018కు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.

-మొత్తం పోస్టుల సంఖ్య: 54,953 (పురుషులు-47,307, మహిళలు-7,646)
-విభాగాలవారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్-16,984, సీఐఎస్‌ఎఫ్-200, సీఆర్‌పీఎఫ్-21,566, ఎస్‌ఎస్‌బీ-8,546, ఐటీబీపీ-4,126, అస్సాం రైఫిల్స్-3,076, ఎన్‌ఐఏ-8, ఎస్‌ఎస్‌ఎఫ్-447
-పే స్కేల్: రూ. 21,700-69,100
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ
-5 కిలోమీటర్ల పరుగు పందెంను పురుషులు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి
-1.6 కిలోమీటర్ల పరుగు పందెం మహిళలు 6 1/2 నిమిషాల్లో పూర్తి చేయాలి
-శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు - 170 సెం.మీ., ఛాతీ: 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ.ల ఎత్తు ఉండాలి.
-ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ అంశాల్లో నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి విభాగం నుంచి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 25 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తు రుసుం: రూ.100/-
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.ssconline.nic.in

Wednesday, 18 July 2018

నేడు మరో రెండు నోటిఫికేషన్లు....

నేడు మరో రెండు నోటిఫికేషన్లు...

    -జీహెచ్‌ఎంసీలో 124 బిల్‌కలెక్టర్ పోస్టులు
    -బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీలు
    -గ్రూప్ 4తో కలిపి పరీక్ష నిర్వహించనున్న టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గురువారం మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నది. జీహెచ్‌ఎంసీలో 124 బిల్‌కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీచేయనున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్‌లోని ఖాళీల్లో 56 అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, 13 అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్ -2, 9 డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించనున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4తో కలిపి పరీక్ష నిర్వహించనున్నది.

డీఈవోలకు ఎస్‌ఏ అభ్యర్థుల వెరిఫికేషన్ జాబితా
టీచర్ కొలువుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అన్ని జిల్లాల డీఈవోలకు వెరిఫికేషన్ జాబితాను పంపించినట్టు పేర్కొన్నది.

JOBS IN INDIAN POST PAYMENTS BANK

పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఖాళీలు ....

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ స్కేల్ II, III, IV&V పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.



-పోస్టులు - ఖాళీలు:
మేనేజర్ (టాక్సేషన్)-1,
సీనియర్ మేనేజర్ (ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్)-1,
చీఫ్ మేనేజర్-1,
మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)-1,
మేనేజర్ (హెచ్‌ఆర్)-1,
సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1,
ఏజీఎం (హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్)-1,
మేనేజర్ (రిస్క్ బేస్డ్ ఆడిట్)-1,
మేనేజర్ (కాంకరంట్ ఆడిట్)-1,
సీనియర్ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)-1,
మేనేజర్ (వెండర్ పర్‌ఫార్మెన్స్)-2,
సీనియర్ మేనేజర్ (రికాన్సిలేషన్)-10,
సీనియర్ మేనేజర్ (బ్రాంచీ ఆపరేషన్స్)-1,
సీనియర్ మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్)-3,
చీఫ్ మేనేజర్ (ఫ్రాడ్ మానిటరింగ్)-2,
మేనేజర్ (వెండర్ మేనేజ్‌మెంట్)-2,
సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్)-5 తదితర పోస్టులు ఉన్నాయి.

-వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 24 నుంచి ప్రారంభం

-చివరితేదీ: ఆగస్టు 7

-వెబ్‌సైట్: www.ippbonline.net

Monday, 16 July 2018

700 Post's in LIC with Degree

ఎల్‌ఐసీలో 700 ఏఏవోలు...

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోసు పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- మొత్తం ఖాళీల సంఖ్య - 700
- (జనరల్-349, ఓబీసీ-192, ఎస్సీ-106, ఎస్టీ-53)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 25 నుంచి
- చివరితేదీ: ఆగస్టు 15
- కాల్‌లెటర్స్ డౌన్‌లోడ్: అక్టోబర్ మొదటివారంలో
- ఆన్‌లైన్ ఎగ్జామ్‌తేదీ: అక్టోబర్ 27, 28

- వెబ్‌సైట్: https://www.licindia.in

VRO / GROUP 4 ONLINE CLASS 9

WORLD GEOGRAPHY - 5

AGRICULTURE / వ్యవసాయం


ప్రముఖ ఆర్థిక భౌగోళిక శాస్త్రజ్ఞుడు విట్లిసీ కింద సూచించిన వ్యవసాయ వ్యవస్థలను గుర్తించాడు.
సాంద్ర జీవనాధార వ్యవసాయం
విస్తార వాణిజ్య వ్యవసాయం
మిశ్రమ వ్యవసాయం
వాణిజ్య పండ్ల తోటల సాగు
మార్కెట్ గార్డెనింగ్/ట్రక్ ఫార్మింగ్
ఉద్యానవన తోటలు/ఎస్టేట్ ఫార్మింగ్
వాణిజ్య పాడి మండలం
వాణిజ్య పశుమాంస ఉత్పత్తి మండలం (రాంచింగ్)
పోడు వ్యవసాయం
సంచార పశు పోషణ

సాంద్ర జీవనాధారవ్యవసాయం
ఆయనరేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాలకు చెందిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జీవనాధార సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది. ఇండియా, చైనా, బ్రెజిల్, థాయ్‌లాండ్, మెక్సికో, ఈజిప్ట్ లాంటి వ్యవసాయ ప్రధాన దేశాల్లోని వ్యవసాయ వ్యవస్థలు ఈ కోవకు చెందినవి. సాంద్ర వ్యవసాయంలో పంటల తీవ్రత అధికం. పెద్ద మొత్తాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు నీటిని వాడతారు. వ్యవసాయ భూకమతాల సగటు పరిమాణం చాలా తక్కువ. జనాభాలో అధిక శాతం ప్రత్యక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. కాబట్టి వ్యవసాయ భూమిపై ఒత్తిడి అధికం. ప్రధానంగా ఆహార పంటలను పండిస్తారు. జనాభా, జనసాంద్రతలు అధికంగా ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా దేశీయంగానే వినియోగిస్తారు. మిగులు లేకపోవడంతో ఎగుమతులు అత్యల్పం. వ్యవసాయంలో శ్రామిక శక్తిని అధికంగా వినియోగిస్తారు. సగటు వ్యవసాయ భూమికి దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ, తలసరి దిగుబడులు కనిష్టంగా ఉంటాయి. వ్యవసాయ జనాభా ప్రధానంగా సన్న, చిన్నకారు రైతుల రూపంలో ఉంటుంది. ఈ వ్యవసాయ మండలంలో రైతుల ఆదాయాలు స్వల్పంగా ఉంటాయి. రైతులు తమ గృహ అవసరాల ఆధారంగా పంటలను ఎంచుకుంటారు.

విస్తార వాణిజ్య వ్యవసాయం
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉంది. వ్యవసాయంపై ఆధారపడే శ్రామిక జనాభా శాతం చాలా తక్కువ. వ్యవసాయంలో యాంత్రీకరణ స్థాయి అధికం. వ్యవసాయ భూకమతాలు చాలా పెద్దవి. ఉదాహరణకు యూఎస్‌ఏలో సగటు భూకమతాల పరిమాణం 1000-1400 హెక్టార్లు. పంటల తీవ్రత సాంద్ర వ్యవసాయ మండలంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవసాయ మండలంలో పంటలు పండిస్తారు. జనాభా, జనసాంద్రత తక్కువగా ఉండటం వల్ల స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం తక్కువ. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పెద్ద మొత్తాల్లో ఎగుమతి చేస్తారు. విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉండే యూఎస్‌ఏ, కెనడా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాలు ప్రపంచంలో ప్రధాన వ్యవసాయ ఎగుమతిదారులు. ఈ మండలాన్ని ప్రపంచ ధాన్యాగారంగా అభివర్ణిస్తారు. ఈ తరహా వ్యవసాయం విస్తారంగా పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉంది.

మిశ్రమ వ్యవసాయం
పంటలతోపాటు పశుపోషణ కోసం కూడా వ్యవసాయ భూమిపై ఆధారపడటాన్ని మిశ్రమ వ్యవసాయంగా వ్యవహరిస్తారు. ఈ తరహా వ్యవసాయంలో పంటల నుంచి వచ్చిన రొట్టను, వ్యవసాయ ఉత్పత్తులను పశుగ్రాసంగా వాడతారు. పశువుల మేతకోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లు ఉండవు. అయితే జీవనాధార వ్యవసాయంలా కాకుండా, ఈ మండలంలో వ్యవసాయ పంటలు, పశుపోషణ వాణిజ్య తరహాలో జరుగుతుంది. పశ్చిమ, మధ్య ఐరోపాల్లో వ్యవసాయం ఈ కోవకు చెందింది. ఈ మండలంలో సగటు వ్యవసాయ భూకమతాల పరిమాణం మధ్యస్థంగా (100-200 హెక్టార్లు) ఉంటుంది.

వాణిజ్య పండ్ల తోటల సాగు
మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు అనుకూలం. కవోష్ణ వాతావరణం వల్ల ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల తోటలు ఇక్కడ సాగవుతాయి. మధ్యధరా తీరంలోని ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాలు, దక్షిణాఫ్రికాలోని కేప్ ప్రాంతం, యూఎస్‌ఏలోని కాలిఫోర్నియా తీరం, మధ్య చిలీ, ఇజ్రాయెల్ తీర ప్రాంతాలు ఈ వ్యవసాయ మండలం కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, నారింజ, దానిమ్మ లాంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను వాణిజ్య పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది పెట్టుబడితో కూడుకున్న వ్యవసాయం. పండ్ల రసాలు, జామ్‌లు, జెల్లీలు, సాస్‌లు, ఎండు పళ్లను ఈ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. ద్రాక్ష సారాయి తయారీ కూడా పెద్ద పరిశ్రమగా రూపొందింది. ఫ్రాన్స్‌లోని రైన్ లోయ, ఇటలీలోని గెరొన్ బేసిన్ వీటికి ప్రసిద్ధి.

మార్కెట్ గార్డెనింగ్/ట్రక్ ఫార్మింగ్
పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపా, ఉత్తర అమెరికాల్లో విస్తృత నగరీకరణ జరిగింది. విస్తరిస్తున్న మెట్రోపాలిటన్ నగరాల్లో తాజా కూరగాయలు, పండ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాయవ్య ఐరోపా, ఉత్తర అమెరికాల్లోని పెద్ద పెద్ద నగరాల సమీపంలో పండ్లు, కూరగాయల సాగు వాణిజ్య పద్ధతిలో ప్రారంభమైంది. రోజూ ఉదయాన్నే ఈ వ్యవసాయ ప్రాంతాల నుంచి నగరాలకు భారీ ట్రక్కుల ద్వారా తాజా పండ్లు, కూరగాయల రవాణా జరుగుతుంది. అందువల్ల దీన్ని ట్రక్ ఫార్మింగ్ (మార్కెట్ గార్డెనింగ్) అని పిలుస్తారు. ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని నగర జనాభాకు కావాల్సిన తాజా పండ్లు, కూరగాయలను టాస్మానియా దీవి నుంచి బాన్ జలసంధి ద్వారా మర పడవలపై సరఫరా చేస్తారు. అందువల్ల టాస్మానియా దీవిని ‘గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు.

ఉద్యానవన తోటలు/ఎస్టేట్ ఫార్మింగ్
ఎస్టేట్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఉద్యానవన తోటల పెంపకాన్ని వలస పాలనా కాలంలో వలస రాజ్యాలు ప్రారంభించాయి. ఉష్ణమండల ఆయన రేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాల్లోని దేశాల్లో వలస పాలకులు కాఫీ, తేయాకు, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, చెరకు, అరటి పంటలను ఎస్టేట్‌ల రూపంలో సాగు చేయడం ప్రారంభించారు. ఈ రకమైన సాగులో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా నడిపిస్తారు. ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే యాజమాన్యం కేవలం విధాన నిర్ణయాలను మాత్రమే తీసుకుంటుంది. సాగు నిర్వహణ కోసం సుశిక్షుతులైన, సాంకేతిక అర్హతలు ఉన్న వారిని ‘మేనేజర్లు’గా వేతన ప్రాతిపదికన నియమిస్తారు. శ్రామికులను దినసరి లేదా రోజువారీ కూలీ ప్రాతిపదికన వినియోగిస్తారు. లాభాలను ఆశించి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. ఇప్పటికీ ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు కన్పిస్తాయి.




వాణిజ్య పాడి మండలం
వాయవ్య ఐరోపాలోని సమశీతోష్ణ వాతావరణంలో పచ్చిక బయళ్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ పరిస్థితులు పశుపోషణకు అనుకూలం, జెర్సీ, ఆరిషైర్, స్విస్‌బ్రౌన్, ఆబర్డన్, హార్ట్‌ఫోర్డ్, ఫ్లెచ్‌విక్ లాంటి మేలి రకం పాడి పశువుల జాతులకు ఈ ప్రాంతాలు నిలయాలు. పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుతూ పాడి పశువులను పెంచుతారు. పశువుల మేత కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోని యూకే, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్ దేశాల నుంచి పెద్ద మొత్తాల్లో పాడి వస్తువులు ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. డెన్మార్క్‌ను Butter House of Europe గా అభివర్ణిస్తారు. కొపెన్‌హెగెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ విమానాల ద్వారా వెన్నను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేస్తారు.

వాణిజ్య పశుమాంస ఉత్పత్తి మండలం (రాంచింగ్)
పశ్చిమ యూఎస్‌ఏలోని రాకీ పర్వత ప్రాంతం, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే దేశాలు రాంచింగ్ (Ranching) మండలం కిందకు వస్తాయి. ఈ మండలంలో మాంసం ఉత్పత్తి కోసం పశువులను పెంచుతారు. పశుపోషణ కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను నిర్వహిస్తారు. పశువుల మేత కోసం ప్రత్యేకంగా మొక్కజొన్నను పండిస్తారు. బాగా లావెక్కిన పశువులను యాంత్రిక వధ శాలల్లో సంహరించి, మాంసాన్ని యంత్రాల సహాయంతో శుద్ధి చేసి ప్యాక్ చేస్తారు. మాంసం శుద్ధి, ప్యాకింగ్ ఒక పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది. అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వేల నుంచి శుద్ధి చేసిన మాంసాన్ని యూఎస్‌ఏకు ఎగుమతి చేస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా రాంచింగ్ అమల్లో ఉంది.

సంచార పశు పోషణ
దట్టమైన అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి కొన్ని ఆదిమ తెగల సమాజాల్లో ఇప్పటికీ సంచార పశుపోషణ, సంచార వ్యవసాయం అమల్లో ఉంది. ఈశాన్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ‘జూమింగ్’గా పిలుస్తారు. మధ్య భారతదేశంలో ‘బేవార్’ అని, కేరళలో ‘పొనమ్’ అని పిలుస్తున్నారు. సంచార వ్యవసాయం బ్రెజిల్ (రోకా), మలేషియా (లడాంగ్)లలో కూడా అమల్లో ఉంది.

ముఖ్యాంశాలు
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జీవనాధార సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది.
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉంది
వ్యవసాయ భూమిపై పంటలే కాక పశుపోషణ కూడా ఆధారపడటాన్ని మిశ్రమ వ్యవసాయంగా వ్యవహరిస్తారు.
మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు అనుకూలం.
ద్రాక్ష సారాయి తయారీకి ఫ్రాన్స్‌లోని రైన్ లోయ, ఇటలీలోని గెరొన్ బేసిన్ ప్రసిద్ధి.

VRO / GROUP 4 ONLINE CLASS 8

WORLD GEOGRAPHY - 4

భూపటలం - శిలలు

సగటున సుమారు 30 కిలోమీటర్ల మందం కలిగిన భూగోళం బాహ్య పొరను ‘పటలం’ అంటారు. పటలం వివిధ రకాల శిలలతో కూడిన దృఢమైన పొర. ఈ శిలలు అనేక ఖనిజాలతో ఇమిడి ఉంటాయి. పటలంలో ప్రధానంగా తేలికైన సిలికాన్, అల్యూమినియం మూలకాలు కేంద్రీకృతమై ఉంటాయి. అందువల్ల పటలాన్ని ‘సియాలిక్’ పొరగా కూడా పిలుస్తారు. పటలం సాంద్రత సుమారుగా 2.7. ఇది భూగోళ సగటు సాంద్రత (5.5) కంటే చాలా తక్కువ. పటలం దృఢంగా ఉన్నప్పటికీ.. అవిచ్ఛిన్న పొర మాత్రం కాదు. పటలం అనేక చిన్నాపెద్ద ముక్కలుగా విభజించి ఉంటుంది. ఈ ముక్కలను అస్మావరణ పలకలుగా వ్యవహరిస్తారు. అస్మావరణ పలకలు ఖండాలు, సముద్రాలను కలిగి ఉన్నాయి. పటలానికి చెందిన ఈ అస్మావరణ పలకలు కింద ఉన్న ఆస్థినో ఆవరణ పాక్షిక శిలా ద్రవంలో తేలియాడుతూ వివిధ దశల్లో చలిస్తున్నాయి. అంటే.. ఖండాలు, సముద్రాలు వివిధ దశల్లో చలిస్తున్నాయన్నమాట! ఈ పలకల చలనం వల్ల పలకల మధ్య అపసరణ, అభిసరణ లేదా సమాంతర సరిహద్దులు ఏర్పడతాయి. ఈ పలకల సరిహద్దు మండలాల వద్దనే పర్వతోద్భవనం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ కేంద్రీకృతమై ఉంటుంది.
పటల శిలలు మూడు రకాలు
 పటల శిలలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి..
 1. అగ్ని శిలలు
 2. రూపాంతర శిలలు
 3. అవక్షేప శిలలు

పర్వతోద్భవనం, అగ్నిపర్వత, క్రమక్షయ ప్రక్రియల కారణంగా శిలల స్వభావం మారిపోయి కొత్త శిలలు ఏర్పడుతుంటాయి. శిలా చక్రంలో భాగంగా ఒక తరగతికి చెందిన శిలలు క్రమేపీ మరో రకానికి చెందిన శిలలుగా మార్పు చెందే అవకాశం ఉంది.

పటలంలో మొట్టమొదటగా ఏర్పడే అగ్ని శిలలను ‘ప్రాథమిక శిలలు’గా పిలుస్తారు. పటల అంతర్భాగాల్లో అధిక ఉష్ణోగ్రత, పీడనాల వల్ల శిలలు పాక్షిక ద్రవ రూపంలో ఉంటాయి. ఈ పాక్షిక శిలా ద్రవాన్ని ‘మాగ్మా’ అంటాం. భూ ఉపరితలం పైకి ఉబికి వచ్చిన తర్వాత మాగ్మాను ‘లావా’గా పిలుస్తారు. మాగ్మా లేదా లావా చల్లబడి క్రమంగా ఘనీభవించి అగ్ని శిలలు ఏర్పడతాయి. పటలం అంతర్భాగంలో అధిక  లోతుల్లో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడే అగ్ని శిలలను ‘ప్లుటానిక్ అగ్ని శిలలు’గా వ్యవహరిస్తారు. ఉపరితలానికి చేరే క్రమంలో మార్గ మధ్యంలోనే మాగ్మా ఘనీభవం చెందగా ఏర్పడే శిలలను ‘హైప ర్ బేసల్ అగ్ని శిలలు’గా పిలుస్తారు. భూ ఉపరితలం పైకి లావా ఉద్భేదించిన తర్వాత ఘనీభవించగా ఏర్పడే శిలలను ‘లావా శిలలు’గా అభివర్ణిస్తారు. గ్రానైట్, బసాల్ట్, గాబ్రో, డయరైట్, ఆండెసైట్ మొదలైనవి ప్రధాన అగ్ని శిలలు. అగ్నిశిలలు కఠినంగా, దృఢంగా ఉంటాయి. సచ్ఛిద్రంగా ఉండవు. వీటిలో శిలాజాలు ఏర్పడవు. అగ్ని శిలల్లో ప్రధానంగా ఫై జాతికి చెందిన లోహ ఖనిజాలు కేంద్రీకృతమై ఉంటాయి. పటల అంత ర్భాగంలోని శిలలు ప్రధానంగా అగ్ని శిలల తరగతికి చెందుతాయి.
భూ ఉపరితలం పైన పని చేసే బాహ్య బలాలు కఠిన పటల శిలలను శిథిలం చేస్తాయి. ఈ ప్రక్రియనే శిలా శైథిల్యం/ క్రమక్ష యంగా పిలుస్తారు. ప్రవహించే నదులు, హిమానీనదాలు, పవనాలు, సముద్ర వేలాతరంగాలు, భూగర్భ జల ప్రవాహాలు ప్రధానమైన బాహ్య బలాలు లేదా క్రమక్షయ కారకాలు. శిథిల శిలా పదార్థాలు నదీ హరివాణాలు, లోయలు, మైదానాలు, సముద్ర భూతలంపై నిక్షేపమై కాలక్రమేణ శిలలుగా రూపొందుతాయి. పై పొరల సంపీడనం వల్ల కింది పొరల్లోని శిలా శిథిలాలు క్రమంగా సంఘటితమై ఏర్పడే ఈ శిలలను అవక్షేప శిలలుగా పరిగణిస్తారు. ఇసుకరాయి, షేల్, సున్నపురాయి, కాంగ్లో మేరేట్ ప్రధాన అవక్షేప శిలల రకాలు. అవక్షేప శిలలు స్తరిత శిలల తరగతికి చెందుతాయి. ఇవి సచ్ఛిద్ర శిలలు. అవక్షేప శిలల్లో శిలాజాలు ఏర్పడతాయి. శిలాజాల వల్ల పురాభౌమ్య యుగంలో శీతోష్ణ స్థితి, సహజ ఉద్భిజ సంపద, జీవజాతుల సమాచారం లభ్యమ వుతుంది. అవక్షేప శిలలు కఠినంగా కానీ లేక మృదువుగా కానీ ఉండవచ్చు. అవక్షేప శిలల్లో సాధారణంగానే అనేక పగుళ్లు ఉంటాయి. వివిధ తరగతులకు చెందిన శిలలు అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాలు లేదా రెండిటికీ లోనైనప్పుడు వాటి భౌతిక, రసాయనిక ధర్మాలు పూర్తిగా మార్పు చెంది ఏర్పడే సరికొత్త శిలలనే రూపాంతర శిలలుగా పిలుస్తారు. రూపాంతర శిలల మాతృక శిలలు అవక్షేప లేదా అగ్ని లేదా రూపాంతర శిలలుగా ఉండవచ్చు. అగ్ని పర్వత ప్రక్రియ లేదా పర్వతోద్భవన ప్రక్రియ సందర్భంగా ప్రధానంగా రూపాంతర శిలలు ఏర్పడతాయి. పటలంలో మాగ్మా ప్రవహిస్తున్నప్పుడు సమీపంలో శిలలు రూపాంతరం చెందుతాయి. పర్వతోద్భవన మండలంలో అధిక ఉష్ణోగ్రతలు, పీడనం కారణంగా రూపాంతర ప్రక్రియ సంభవిస్తుంది. అందువల్లే పలకల సరిహద్దుల వద్ద రూపాంతర ప్రక్రియ సర్వ సాధారణం. అవక్షేప శిలలైన షేల్, ఇసుకరాయి, సున్నపురాయి రూపాంతరం చెందడం వల్ల వరుసగా స్లేట్, క్వార్ట్జైట్, పాలరాయి వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. గ్రానైట్, గాబ్రొ వంటి అగ్ని శిలల రూపాంతరం వల్ల వరుసగా నీస్, ఫిల్లైట్ వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. స్లేట్, క్వార్ట్జైట్‌లు మర లా రూపాంతర ప్రక్రియకు లోనవడం వల్ల సిస్ట్, ఫిల్లైట్ వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. అవక్షేప శిలల్లో శిలాజ ఇంధన వనరులైన బొగ్గు, చమురు, సహజవాయువులు విస్తారంగా లభిస్తాయి. రూపాంతర శిలల్లో నాన్ ఫై జాతికి చెంది లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాల వనరులు ఉంటాయి. రూపాంతర శిలలు కఠినంగా, దృఢంగా ఉండటం వల్ల భవన నిర్మాణ రంగంలో విశేషంగా ఉపకరిస్తాయి. భూ ఉపరితలం మీద ఉన్న శిలలు ప్రధానంగా అవక్షేప శిలల తరగతికి చెందుతాయి.

VRO / GROUP 4 ONLINE CLASS 7

WORLD GEOGRAPHY - 3


సౌర కుటుంబం - భూమి

సౌర కుటుంబంలో సూర్యుడు, నవగ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అవి:
సిద్ధాంతకర్త సిద్ధాంతం
చాంబర్లీన్, మౌల్టన్ గ్రహాల పరికల్పన సిద్ధాంతం
కాంట్ గ్యాసియస్ మాస్ థియరీ
లాప్లాస్ నెబ్యులార్ థియరీ
జీన్స్, జెఫ్రీ టెడల్ సిద్ధాంతం
రస్సెల్, లిటిల్ టన్ బైనరీ స్టార్ హైపోథిసిస్

సూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.
గ్రహాలను రెండు భాగాలుగా విభజించారు. అవి...
అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు.
బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.
భూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.
అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు.

1. బుధుడు
ఇది అతి చిన్న గ్రహం. సూర్యుడికి అతి దగ్గరగా (58 మి.కి.మీ.) ఉన్న గ్రహం.
సూర్యుడి చుట్టూ అత్యధిక వేగంతో తిరిగే గ్రహం (47.9 కి.మీ./సె).
దీనికి ఉపగ్రహాలు లేవు. దీన్ని ‘అపోలో’ అని కూడా పిలుస్తారు.

2. శుక్రుడు
దీన్ని ‘ఉదయ తార’ లేదా ‘సంధ్య తార’ అని పిలుస్తారు.
శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది.
సౌర కుటుంబంలో అత్యధిక వేడి (ఉష్ణోగ్రత) ఉన్న గ్రహం శుక్రుడు. దీని వాతావరణంలో 95 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉండటమే దీనికి కారణం.
సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైంది కాబట్టి దీన్ని ‘వేగుచుక్క’ అని కూడా పిలుస్తారు.
ద్రవ్యం, పరిమాణం, సాంద్రతల్లో భూమిని పోలి ఉండటం వల్ల దీన్ని ‘భూమికి కవల గ్రహం’గా పేర్కొంటారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
ఇది సూర్యుడి నుంచి రెండో గ్రహం.

3. భూమి
ఇది జీవం ఉన్న గ్రహం.
భూమికి ఒకే ఒక్క సహజ ఉపగ్రహం చంద్రుడు.
భూమిని ‘నీలి గ్రహం’ అంటారు.
ఇది సూర్యుడి నుంచి దూరంలో మూడో గ్రహం. పరిమాణంలో అయిదో గ్రహం.
గ్రహాలన్నింటిలో సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రహం భూమి. దీని వైశాల్యం 510 మి.చ.కి.మీ.
భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య పొడవు 965 మి.కి.మీ.

4. అంగారకుడు (కుజుడు)
దీన్నే అరుణ గ్రహం అంటారు.
దీనికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. అవి.. ఫోబస్, డెమోస్.
రోమన్లు దీన్ని ‘గాడ్ ఆఫ్ వార్’గా పేర్కొంటారు.
ఇది సూర్యుడి నుంచి నాలుగో గ్రహం.
అంగారక గ్రహ అధ్యయనానికి భారతదేశం 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ-సి-25 రాకెట్ ద్వారా ‘మంగళయాన్’ అనే ఆర్బిటర్‌ను పంపింది.
బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ బాహ్య గ్రహాలు. ఇవి పరిమాణంలో పెద్ద గ్రహాలు. హైడ్రోజన్, హీలియం ఘనీభవించడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. వీటికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి.

5. బృహస్పతి
దీన్ని ‘గ్రహాల రాజు’ అని పిలుస్తారు.
గ్రహాలన్నింటి కంటే పెద్దది. భూమి కంటే 11 రెట్లు పెద్దది. అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి 5వ గ్రహం.
దీనికి తక్కువ ఆత్మభ్రమణ కాలం ఉంది.
దీనికి సౌర వ్యవస్థలో కెల్లా అతిపెద్ద ఉపగ్రహం ‘గానిమైడ్’ ఉంది.
ఇది షూమేకర్ లేవీ తోకచుక్కను ఢీకొన్న గ్రహం. అందువల్ల దీన్ని రెడ్ రింగ్డ్ ప్లానెట్‌గా పిలుస్తారు.

6. శని
పరిమాణంలో రెండో అతి పెద్ద గ్రహం.
దీనికి ‘టైటాన్’ అనే ఉపగ్రహం ఉంది. ఇది సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద ఉపగ్రహం.
దీనికి అతి తక్కువ సాంద్రత ఉంది.
సూర్యుడి నుంచి ఆరో గ్రహం.

7. యురేనస్
ఇది పరిమాణంలో మూడోది. ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

8. నెప్ట్యూన్
ఇది అతి చల్లని గ్రహం.
దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
ఇది విష వాయువులైన మీథేన్, అమ్మోనియాలను కలిగి ఉంది.
సూర్యుడి నుంచి 8వ గ్రహం. పరిమాణంలో నాలుగోది.

VRO / GROUP 4 ONLINE CLASS 6

WORLD GEOGRAPHY - 2

వాతావరణ పీడనం - ప్రభావాలు

Clima అనే గ్రీకు పదం నుంచి Climate అనే ఇంగ్లిష్ పదం ఆవిర్భవించింది. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని అర్థం.
వాతావరణ స్థితి: ఒక ప్రదేశ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతాల సంయుక్త స్థితిని వాతావరణ స్థితి అంటారు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మెటీరియాలజీ.

శీతోష్ణస్థితి: ఒక ప్రదేశానికి సంబంధించిన దీర్ఘకాల (కనీసం 30 ఏళ్ల) వాతావరణ స్థితుల సరాసరిని శీతోష్ణస్థితి అంటారు.

వాతావరణ పీడనం: ఒక ప్రదేశంలోని వాయువుల పొర బరువును వాతావరణ పీడనం అంటారు.
గాలికి బరువు ఉందని గెలీలియో నిరూపించాడు.
వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరంభారమితి (బారోమీటర్)
భారమితిని కనిపెట్టింది టారిసెల్లి (ఇటలీ, క్రీ.శ.1643). ఇతను గెలీలియో శిష్యుడు.
సామాన్య వాతావరణ పీడనం అంటే భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీ మీటర్లు.
760 మి.మీ. = 76 సెంటీమీటర్లు = 29 అంగుళాలు = 1013.2 మిల్లీ బార్లు.
గొట్టంలో పాదరసం ఎత్తు 3 మిల్లీ మీటర్లు అయితే 4 మిల్లీ బార్లకు సమానం.
1 మి.మీ. = 1.33 మి.బార్లు.
ఒక చదరపు సెం.మీ వైశాల్యంలో 1 గ్రా. బరువును మిల్లీబార్ అంటారు.

వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు
1. ఎత్తు: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున పీడనం తగ్గుతుంది. ప్రతి 300 మీటర్ల ఎత్తుకు 25.4 మిల్లీబార్ల పీడనం తగ్గుతుంది.
6 కి.మీ ఎత్తులో 506 మిల్లీబార్లు లేదా 308 మి.మీ. వాతావరణ పీడనం తగ్గుతుంది.

2. ఉష్ణోగ్రత: ఇది పెరిగితే గాలి సాంద్రత తగ్గి, పీడనం కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం విలోమానుపాతంలో ఉంటాయి.

3. నీటి ఆవిరి: పొడి గాలి కంటే నీటి ఆవిరి బరువు తక్కువ కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పెరిగితే పీడనం తగ్గుతుంది.

4. వాయు ప్రవాహాలు: అధిక ఉష్ణోగ్రత వల్ల అల్పపీడనం గల ప్రాంతాల్లో పైకి తేలిపోయే వాయు ప్రవాహాలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి పవనాలు వీస్తాయి.
అల్ప ఉష్ణోగ్రత వల్ల అధిక పీడనం గల ప్రాంతాల్లో కిందకు దిగే వాయు ప్రవాహాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పవనాలు వీస్తాయి.
సముద్ర మట్టం వద్ద సరాసరి వాతావరణ పీడనం 900-1030 మిల్లీబార్లు ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత వాతావరణ పీడనం గల ప్రాంతం సైబీరియాలోని అగాటా. ఇక్కడ 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది (1963, డిసెంబర్ 31).
ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం గల ప్రాంతం టిప్ అని పిలిచే చక్రవాతం (మరియాన ద్వీపం). ఇక్కడ 870 మిల్లీబార్లు నమోదైంది (1979 అక్టోబర్ 12).

భూగోళంలో పీడన మేఖలలు
1. భూమధ్యరేఖ అల్పపీడన మేఖల: 100 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతాన్ని డోల్‌డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం, నిశ్చలవాత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతంలో సగటున 1013 మిల్లీబార్ల్ల వాతావరణ పీడనం ఉంటుంది.

2. ఉప ఆయనరేఖా అధిక పీడన మేఖల: భూమధ్యరేఖకు ఇరువైపులా 250-300 అక్షాంశాల మధ్య ఉంటుంది. వీటినే గాలి కిందకి దిగే ప్రాంతాలు అంటారు. పీడన మండలాలు సూర్య గమనాన్ని బట్టి ఉత్తర, దక్షిణాలుగా కొద్దిగా జరుగుతాయి.

3. ఉప ధ్రువ అల్పపీడన మేఖల: భూమధ్యరేఖకు ఇరువైపులా 450-650 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యలో ఉంటుంది. దీన్నే సమశీతోష్ణ అల్పపీడన మేఖల అంటారు.

4. ధ్రువ అధిక పీడన మేఖల: 750-900 అక్షాంశాల మధ్యగల అతి శీతల ప్రాంతాన్ని ధ్రువ అధిక పీడన ప్రాంతం అంటారు.
పవనాలు
గాలి ఎప్పుడూ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపునకు ప్రయాణిస్తుంది.
భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనం అంటారు.
భూమి ఉపరితలంపై నిటారుగా పైకి కదిలే గాలిని గాలి ప్రవాహం అంటారు.
రెండు ప్రదేశాల మధ్య వీచే గాలి.. పీడన మార్పుపై ఆధారపడి ఉంటుంది.
సమాన పీడనం గల ప్రదేశాలను కలిపే రేఖలు.. సమభార రేఖలు (ఐసోబార్‌‌స).
రెండు ప్రదేశాల మధ్య పీడన భేదాన్ని పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత ఎక్కువైతే గాలి వేగం పెరుగుతుంది.
గాలి వేగాన్ని కొలిచే పరికరం అనిమోమీటర్ (పవనవేగమాపకం) / బ్యూఫోర్టు స్కేల్.
సమాన పవన వేగం గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలుఐసోకైనటిక్స్.
గాలి వీచే దిశను సూచించేది పవన సూచిక
భూ భ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు.
కొరియాలిస్ బలం భూమధ్యరేఖ వద్ద తక్కువగా, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది.
కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఫ్సై సూత్రం ప్రకారం ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు కుడి వైపునకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు నెట్టబడతాయి.

పవనాలు రకాలు
పవనాలు మూడు రకాలు అవి..
1) ప్రపంచ పవనాలు
2) కాలాన్ని బట్టి వీచే పవనాలు
3) స్థానిక పవనాలు

1. ప్రపంచ పవనాలు
ఈ పవనాలు ఏడాది పొడవునా నిరంతరం ఒకే దిశలో, స్థిరంగా వీస్తాయి. అందుకే వీటిని స్థిర పవనాలు అని కూడా అంటారు.
ప్రపంచ పవనాలు 3 రకాలు
ఎ.వ్యాపార పవనాలు: ఇవి ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖా అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. ఇవి 80-300 అక్షాంశాల మధ్య వీస్తాయి.
వీటిని ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అని అంటారు.
వీటి వేగం గంటకు 15-20 కిలోమీటర్లు. ఈ పవనాల వల్ల ఖండాల తూర్పు తీరాల్లో వర్షం సంభవిస్తుంది.
బి. పశ్చిమ పవనాలు: ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి.
ఇవి 350-600 అక్షాంశాల మధ్య వీస్తాయి. వీటిని ప్రతి వ్యాపార పవనాలు అంటారు.
వీటి వేగం గంటకు 45-75 కిలోమీటర్లు.
ఉత్తరార్ధ గోళంలో నైరుతి దిశ నుంచి, దక్షిణార్ధ గోళంలో వాయవ్య దిశ నుంచి వీస్తాయి.
400 అక్షాంశాల వద్ద వీటిని గర్జించే నలభైలు (దక్షిణార్ధ గోళంలో) అంటారు.
500 అక్షాంశాల వద్ద వీచే వీటిని భయపెట్టే యాభైలు, కోపోద్రిక్త యాభైలు అంటారు.
600 అక్షాంశాల వద్ద వీచే వీటిని వణికించే అరవైలు అంటారు.
ఇవి బయలుదేరే ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలు (300 అక్షాంశాలు) అంటారు.
సి. ధ్రువ తూర్పు పవనాలు: అధిక పీడన ధ్రువ ప్రాంతాల నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. వేగం తక్కువ, స్థిరత్వం ఉండదు.
ఇవి 600-800 అక్షాంశాల మధ్య వీస్తాయి.

2. కాలాన్ని బట్టి వీచే పవనాలు
వీటినే రుతుపవనాలు అంటారు. ఒక రుతువులో ఒక దిశలో, మరొక రుతువులో దానికి వ్యతిరేక దిశలో వీస్తాయి.
భూ పవనాలు: తీరం నుంచి సముద్రం వైపునకు వీస్తాయి.
సముద్ర పవనాలు: సముద్రం నుంచి తీరం వైపునకు వీస్తాయి.
లోయ పవనాలు: పగటి సమయంలో పర్వతాల మీదకు వీస్తాయి.
పర్వత పవనాలు: రాత్రి సమయాల్లో పర్వతాల నుంచి లోయలోకి వీస్తాయి.

3. స్థానిక పవనాలు
- ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో స్థానికంగా సంభవించే మార్పు వల్ల ఇవి ఏర్పడతాయి.
ఇవి రెండు రకాలు
1. వెచ్చని పవనాలు
2. శీతల పవనాలు.

వెచ్చని పవనాలు

ఫోన్ : ఆల్ఫ్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ మీదకు వీస్తాయి.
చినూక్: అమెరికా, కెనడాల్లో వీస్తాయి (హిమభక్షకి).
శాంట అనా: కాలిఫోర్నియాలో వీస్తాయి.
సిరోకో: మధ్యధరా సముద్రం నుంచి ఐరోపాకు వీస్తాయి.
లూ: రాజస్థాన్, ఉత్తర భారత దేశంలో వీస్తాయి.
బెర్‌‌గ్స: దక్షిణాఫ్రికాలో వీస్తాయి.
నార్వెస్టర్: న్యూజిలాండ్‌లో వీస్తాయి.
హార్మాటాన్: పశ్చిమ ఆఫ్రికాలో వీస్తాయి.
సలానో: స్పెయిన్‌లో వీస్తాయి.
ఖమ్సిన్: ఈజిప్టులో వీస్తాయి.
గిబ్లీ: లిబియాలో వీస్తాయి.
గర్బీ: ఏజివ్, ఏడ్రియాటిక్ సముద్రం మీదుగా వీస్తాయి.
సిమ్మన్: అరేబియా ఎడారి ప్రాంతంలో వీస్తాయి.
బ్రిక్ ఫెల్లర్: ఆస్ట్రేలియాలో వీస్తాయి.
జోండా: అర్జంటీనాలో వీస్తాయి.

శీతల పవనాలు

మిస్ట్రల్: ఐరోపాలో ఫ్రాన్స్ నుంచి మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి.
బోరా: ఐరోపా (యుగోస్లావియా)లో వీస్తాయి.
పాంపిరో: అర్జంటీనాలో వీస్తాయి.
బురాన్: రష్యా, సైబీరియాలో వీస్తాయి.
నెవడాస్: గ్రీన్‌లాండ్‌లో వీస్తాయి.
పుర్గా: రష్యాలో వీస్తాయి.
కెటబాటిక్: అంటార్కిటికా ఖండంలో వీస్తాయి.
బైస్: ఫ్రాన్‌‌సలో వీస్తాయి.
ప్యూనా: ఆండీస్ పర్వతాల్లో వీస్తాయి.
నార్టె: మెక్సికోలో వీస్తాయి.

Thursday, 12 July 2018

REFERENCE BOOKS FOR COMPETATIVE EXAMS( GROUP 1,2,3,4 / SI / PC / VRO / BANK / RRB)

ALL THE BOOKS GIVEN HERE ARE SUGGESTED BY EXPERTS IN TEACHING FOR COMPETATIVE EXAMS & STUDENTS...There will be another post on Reference books for Those who prepares on Subject Wise

ఇక్కడ ఇవ్వబడిన రిఫరెన్స్ బుక్స్ పోటి పరిక్షల రంగంలో అనుభవజ్ఞులైన టీచింగ్ ఫ్యాకల్టీ మరియు విద్యర్డులచే సూచించబడినవి ... సబ్జెక్ట్ వారీగా చదివే వారికి త్వరలో మరొక పోస్ట్ చేయబడును



GENERAL STUDIES FOR ALL EXAMS * GROUP 1/2/3/4, SUB INSPECTOR, POLICE CONSTABLE, VRO, BANK EXAMS, RRB






ARITHMATIC ,REASONING & NUMERICAL ABILITY












  SUB-INSPECTOR & POLICE CONSTABLE




GROUP 4











VILLAGE REVENUE OFFICER

             





BANK EXAMS



 



RAILWAY RECRUITMENT BOARD RRB  








JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు