Showing posts with label CLASSES. Show all posts
Showing posts with label CLASSES. Show all posts

Monday, 16 July 2018

VRO / GROUP 4 ONLINE CLASS 9

WORLD GEOGRAPHY - 5

AGRICULTURE / వ్యవసాయం


ప్రముఖ ఆర్థిక భౌగోళిక శాస్త్రజ్ఞుడు విట్లిసీ కింద సూచించిన వ్యవసాయ వ్యవస్థలను గుర్తించాడు.
సాంద్ర జీవనాధార వ్యవసాయం
విస్తార వాణిజ్య వ్యవసాయం
మిశ్రమ వ్యవసాయం
వాణిజ్య పండ్ల తోటల సాగు
మార్కెట్ గార్డెనింగ్/ట్రక్ ఫార్మింగ్
ఉద్యానవన తోటలు/ఎస్టేట్ ఫార్మింగ్
వాణిజ్య పాడి మండలం
వాణిజ్య పశుమాంస ఉత్పత్తి మండలం (రాంచింగ్)
పోడు వ్యవసాయం
సంచార పశు పోషణ

సాంద్ర జీవనాధారవ్యవసాయం
ఆయనరేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాలకు చెందిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జీవనాధార సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది. ఇండియా, చైనా, బ్రెజిల్, థాయ్‌లాండ్, మెక్సికో, ఈజిప్ట్ లాంటి వ్యవసాయ ప్రధాన దేశాల్లోని వ్యవసాయ వ్యవస్థలు ఈ కోవకు చెందినవి. సాంద్ర వ్యవసాయంలో పంటల తీవ్రత అధికం. పెద్ద మొత్తాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు నీటిని వాడతారు. వ్యవసాయ భూకమతాల సగటు పరిమాణం చాలా తక్కువ. జనాభాలో అధిక శాతం ప్రత్యక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. కాబట్టి వ్యవసాయ భూమిపై ఒత్తిడి అధికం. ప్రధానంగా ఆహార పంటలను పండిస్తారు. జనాభా, జనసాంద్రతలు అధికంగా ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా దేశీయంగానే వినియోగిస్తారు. మిగులు లేకపోవడంతో ఎగుమతులు అత్యల్పం. వ్యవసాయంలో శ్రామిక శక్తిని అధికంగా వినియోగిస్తారు. సగటు వ్యవసాయ భూమికి దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ, తలసరి దిగుబడులు కనిష్టంగా ఉంటాయి. వ్యవసాయ జనాభా ప్రధానంగా సన్న, చిన్నకారు రైతుల రూపంలో ఉంటుంది. ఈ వ్యవసాయ మండలంలో రైతుల ఆదాయాలు స్వల్పంగా ఉంటాయి. రైతులు తమ గృహ అవసరాల ఆధారంగా పంటలను ఎంచుకుంటారు.

విస్తార వాణిజ్య వ్యవసాయం
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉంది. వ్యవసాయంపై ఆధారపడే శ్రామిక జనాభా శాతం చాలా తక్కువ. వ్యవసాయంలో యాంత్రీకరణ స్థాయి అధికం. వ్యవసాయ భూకమతాలు చాలా పెద్దవి. ఉదాహరణకు యూఎస్‌ఏలో సగటు భూకమతాల పరిమాణం 1000-1400 హెక్టార్లు. పంటల తీవ్రత సాంద్ర వ్యవసాయ మండలంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవసాయ మండలంలో పంటలు పండిస్తారు. జనాభా, జనసాంద్రత తక్కువగా ఉండటం వల్ల స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం తక్కువ. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పెద్ద మొత్తాల్లో ఎగుమతి చేస్తారు. విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉండే యూఎస్‌ఏ, కెనడా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాలు ప్రపంచంలో ప్రధాన వ్యవసాయ ఎగుమతిదారులు. ఈ మండలాన్ని ప్రపంచ ధాన్యాగారంగా అభివర్ణిస్తారు. ఈ తరహా వ్యవసాయం విస్తారంగా పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉంది.

మిశ్రమ వ్యవసాయం
పంటలతోపాటు పశుపోషణ కోసం కూడా వ్యవసాయ భూమిపై ఆధారపడటాన్ని మిశ్రమ వ్యవసాయంగా వ్యవహరిస్తారు. ఈ తరహా వ్యవసాయంలో పంటల నుంచి వచ్చిన రొట్టను, వ్యవసాయ ఉత్పత్తులను పశుగ్రాసంగా వాడతారు. పశువుల మేతకోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లు ఉండవు. అయితే జీవనాధార వ్యవసాయంలా కాకుండా, ఈ మండలంలో వ్యవసాయ పంటలు, పశుపోషణ వాణిజ్య తరహాలో జరుగుతుంది. పశ్చిమ, మధ్య ఐరోపాల్లో వ్యవసాయం ఈ కోవకు చెందింది. ఈ మండలంలో సగటు వ్యవసాయ భూకమతాల పరిమాణం మధ్యస్థంగా (100-200 హెక్టార్లు) ఉంటుంది.

వాణిజ్య పండ్ల తోటల సాగు
మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు అనుకూలం. కవోష్ణ వాతావరణం వల్ల ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల తోటలు ఇక్కడ సాగవుతాయి. మధ్యధరా తీరంలోని ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాలు, దక్షిణాఫ్రికాలోని కేప్ ప్రాంతం, యూఎస్‌ఏలోని కాలిఫోర్నియా తీరం, మధ్య చిలీ, ఇజ్రాయెల్ తీర ప్రాంతాలు ఈ వ్యవసాయ మండలం కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, నారింజ, దానిమ్మ లాంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను వాణిజ్య పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది పెట్టుబడితో కూడుకున్న వ్యవసాయం. పండ్ల రసాలు, జామ్‌లు, జెల్లీలు, సాస్‌లు, ఎండు పళ్లను ఈ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. ద్రాక్ష సారాయి తయారీ కూడా పెద్ద పరిశ్రమగా రూపొందింది. ఫ్రాన్స్‌లోని రైన్ లోయ, ఇటలీలోని గెరొన్ బేసిన్ వీటికి ప్రసిద్ధి.

మార్కెట్ గార్డెనింగ్/ట్రక్ ఫార్మింగ్
పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపా, ఉత్తర అమెరికాల్లో విస్తృత నగరీకరణ జరిగింది. విస్తరిస్తున్న మెట్రోపాలిటన్ నగరాల్లో తాజా కూరగాయలు, పండ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాయవ్య ఐరోపా, ఉత్తర అమెరికాల్లోని పెద్ద పెద్ద నగరాల సమీపంలో పండ్లు, కూరగాయల సాగు వాణిజ్య పద్ధతిలో ప్రారంభమైంది. రోజూ ఉదయాన్నే ఈ వ్యవసాయ ప్రాంతాల నుంచి నగరాలకు భారీ ట్రక్కుల ద్వారా తాజా పండ్లు, కూరగాయల రవాణా జరుగుతుంది. అందువల్ల దీన్ని ట్రక్ ఫార్మింగ్ (మార్కెట్ గార్డెనింగ్) అని పిలుస్తారు. ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని నగర జనాభాకు కావాల్సిన తాజా పండ్లు, కూరగాయలను టాస్మానియా దీవి నుంచి బాన్ జలసంధి ద్వారా మర పడవలపై సరఫరా చేస్తారు. అందువల్ల టాస్మానియా దీవిని ‘గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు.

ఉద్యానవన తోటలు/ఎస్టేట్ ఫార్మింగ్
ఎస్టేట్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఉద్యానవన తోటల పెంపకాన్ని వలస పాలనా కాలంలో వలస రాజ్యాలు ప్రారంభించాయి. ఉష్ణమండల ఆయన రేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాల్లోని దేశాల్లో వలస పాలకులు కాఫీ, తేయాకు, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, చెరకు, అరటి పంటలను ఎస్టేట్‌ల రూపంలో సాగు చేయడం ప్రారంభించారు. ఈ రకమైన సాగులో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా నడిపిస్తారు. ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే యాజమాన్యం కేవలం విధాన నిర్ణయాలను మాత్రమే తీసుకుంటుంది. సాగు నిర్వహణ కోసం సుశిక్షుతులైన, సాంకేతిక అర్హతలు ఉన్న వారిని ‘మేనేజర్లు’గా వేతన ప్రాతిపదికన నియమిస్తారు. శ్రామికులను దినసరి లేదా రోజువారీ కూలీ ప్రాతిపదికన వినియోగిస్తారు. లాభాలను ఆశించి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. ఇప్పటికీ ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు కన్పిస్తాయి.




వాణిజ్య పాడి మండలం
వాయవ్య ఐరోపాలోని సమశీతోష్ణ వాతావరణంలో పచ్చిక బయళ్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ పరిస్థితులు పశుపోషణకు అనుకూలం, జెర్సీ, ఆరిషైర్, స్విస్‌బ్రౌన్, ఆబర్డన్, హార్ట్‌ఫోర్డ్, ఫ్లెచ్‌విక్ లాంటి మేలి రకం పాడి పశువుల జాతులకు ఈ ప్రాంతాలు నిలయాలు. పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుతూ పాడి పశువులను పెంచుతారు. పశువుల మేత కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోని యూకే, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్ దేశాల నుంచి పెద్ద మొత్తాల్లో పాడి వస్తువులు ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. డెన్మార్క్‌ను Butter House of Europe గా అభివర్ణిస్తారు. కొపెన్‌హెగెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ విమానాల ద్వారా వెన్నను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేస్తారు.

వాణిజ్య పశుమాంస ఉత్పత్తి మండలం (రాంచింగ్)
పశ్చిమ యూఎస్‌ఏలోని రాకీ పర్వత ప్రాంతం, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే దేశాలు రాంచింగ్ (Ranching) మండలం కిందకు వస్తాయి. ఈ మండలంలో మాంసం ఉత్పత్తి కోసం పశువులను పెంచుతారు. పశుపోషణ కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను నిర్వహిస్తారు. పశువుల మేత కోసం ప్రత్యేకంగా మొక్కజొన్నను పండిస్తారు. బాగా లావెక్కిన పశువులను యాంత్రిక వధ శాలల్లో సంహరించి, మాంసాన్ని యంత్రాల సహాయంతో శుద్ధి చేసి ప్యాక్ చేస్తారు. మాంసం శుద్ధి, ప్యాకింగ్ ఒక పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది. అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వేల నుంచి శుద్ధి చేసిన మాంసాన్ని యూఎస్‌ఏకు ఎగుమతి చేస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా రాంచింగ్ అమల్లో ఉంది.

సంచార పశు పోషణ
దట్టమైన అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి కొన్ని ఆదిమ తెగల సమాజాల్లో ఇప్పటికీ సంచార పశుపోషణ, సంచార వ్యవసాయం అమల్లో ఉంది. ఈశాన్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ‘జూమింగ్’గా పిలుస్తారు. మధ్య భారతదేశంలో ‘బేవార్’ అని, కేరళలో ‘పొనమ్’ అని పిలుస్తున్నారు. సంచార వ్యవసాయం బ్రెజిల్ (రోకా), మలేషియా (లడాంగ్)లలో కూడా అమల్లో ఉంది.

ముఖ్యాంశాలు
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జీవనాధార సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది.
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉంది
వ్యవసాయ భూమిపై పంటలే కాక పశుపోషణ కూడా ఆధారపడటాన్ని మిశ్రమ వ్యవసాయంగా వ్యవహరిస్తారు.
మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు అనుకూలం.
ద్రాక్ష సారాయి తయారీకి ఫ్రాన్స్‌లోని రైన్ లోయ, ఇటలీలోని గెరొన్ బేసిన్ ప్రసిద్ధి.

VRO / GROUP 4 ONLINE CLASS 8

WORLD GEOGRAPHY - 4

భూపటలం - శిలలు

సగటున సుమారు 30 కిలోమీటర్ల మందం కలిగిన భూగోళం బాహ్య పొరను ‘పటలం’ అంటారు. పటలం వివిధ రకాల శిలలతో కూడిన దృఢమైన పొర. ఈ శిలలు అనేక ఖనిజాలతో ఇమిడి ఉంటాయి. పటలంలో ప్రధానంగా తేలికైన సిలికాన్, అల్యూమినియం మూలకాలు కేంద్రీకృతమై ఉంటాయి. అందువల్ల పటలాన్ని ‘సియాలిక్’ పొరగా కూడా పిలుస్తారు. పటలం సాంద్రత సుమారుగా 2.7. ఇది భూగోళ సగటు సాంద్రత (5.5) కంటే చాలా తక్కువ. పటలం దృఢంగా ఉన్నప్పటికీ.. అవిచ్ఛిన్న పొర మాత్రం కాదు. పటలం అనేక చిన్నాపెద్ద ముక్కలుగా విభజించి ఉంటుంది. ఈ ముక్కలను అస్మావరణ పలకలుగా వ్యవహరిస్తారు. అస్మావరణ పలకలు ఖండాలు, సముద్రాలను కలిగి ఉన్నాయి. పటలానికి చెందిన ఈ అస్మావరణ పలకలు కింద ఉన్న ఆస్థినో ఆవరణ పాక్షిక శిలా ద్రవంలో తేలియాడుతూ వివిధ దశల్లో చలిస్తున్నాయి. అంటే.. ఖండాలు, సముద్రాలు వివిధ దశల్లో చలిస్తున్నాయన్నమాట! ఈ పలకల చలనం వల్ల పలకల మధ్య అపసరణ, అభిసరణ లేదా సమాంతర సరిహద్దులు ఏర్పడతాయి. ఈ పలకల సరిహద్దు మండలాల వద్దనే పర్వతోద్భవనం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ కేంద్రీకృతమై ఉంటుంది.
పటల శిలలు మూడు రకాలు
 పటల శిలలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి..
 1. అగ్ని శిలలు
 2. రూపాంతర శిలలు
 3. అవక్షేప శిలలు

పర్వతోద్భవనం, అగ్నిపర్వత, క్రమక్షయ ప్రక్రియల కారణంగా శిలల స్వభావం మారిపోయి కొత్త శిలలు ఏర్పడుతుంటాయి. శిలా చక్రంలో భాగంగా ఒక తరగతికి చెందిన శిలలు క్రమేపీ మరో రకానికి చెందిన శిలలుగా మార్పు చెందే అవకాశం ఉంది.

పటలంలో మొట్టమొదటగా ఏర్పడే అగ్ని శిలలను ‘ప్రాథమిక శిలలు’గా పిలుస్తారు. పటల అంతర్భాగాల్లో అధిక ఉష్ణోగ్రత, పీడనాల వల్ల శిలలు పాక్షిక ద్రవ రూపంలో ఉంటాయి. ఈ పాక్షిక శిలా ద్రవాన్ని ‘మాగ్మా’ అంటాం. భూ ఉపరితలం పైకి ఉబికి వచ్చిన తర్వాత మాగ్మాను ‘లావా’గా పిలుస్తారు. మాగ్మా లేదా లావా చల్లబడి క్రమంగా ఘనీభవించి అగ్ని శిలలు ఏర్పడతాయి. పటలం అంతర్భాగంలో అధిక  లోతుల్లో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడే అగ్ని శిలలను ‘ప్లుటానిక్ అగ్ని శిలలు’గా వ్యవహరిస్తారు. ఉపరితలానికి చేరే క్రమంలో మార్గ మధ్యంలోనే మాగ్మా ఘనీభవం చెందగా ఏర్పడే శిలలను ‘హైప ర్ బేసల్ అగ్ని శిలలు’గా పిలుస్తారు. భూ ఉపరితలం పైకి లావా ఉద్భేదించిన తర్వాత ఘనీభవించగా ఏర్పడే శిలలను ‘లావా శిలలు’గా అభివర్ణిస్తారు. గ్రానైట్, బసాల్ట్, గాబ్రో, డయరైట్, ఆండెసైట్ మొదలైనవి ప్రధాన అగ్ని శిలలు. అగ్నిశిలలు కఠినంగా, దృఢంగా ఉంటాయి. సచ్ఛిద్రంగా ఉండవు. వీటిలో శిలాజాలు ఏర్పడవు. అగ్ని శిలల్లో ప్రధానంగా ఫై జాతికి చెందిన లోహ ఖనిజాలు కేంద్రీకృతమై ఉంటాయి. పటల అంత ర్భాగంలోని శిలలు ప్రధానంగా అగ్ని శిలల తరగతికి చెందుతాయి.
భూ ఉపరితలం పైన పని చేసే బాహ్య బలాలు కఠిన పటల శిలలను శిథిలం చేస్తాయి. ఈ ప్రక్రియనే శిలా శైథిల్యం/ క్రమక్ష యంగా పిలుస్తారు. ప్రవహించే నదులు, హిమానీనదాలు, పవనాలు, సముద్ర వేలాతరంగాలు, భూగర్భ జల ప్రవాహాలు ప్రధానమైన బాహ్య బలాలు లేదా క్రమక్షయ కారకాలు. శిథిల శిలా పదార్థాలు నదీ హరివాణాలు, లోయలు, మైదానాలు, సముద్ర భూతలంపై నిక్షేపమై కాలక్రమేణ శిలలుగా రూపొందుతాయి. పై పొరల సంపీడనం వల్ల కింది పొరల్లోని శిలా శిథిలాలు క్రమంగా సంఘటితమై ఏర్పడే ఈ శిలలను అవక్షేప శిలలుగా పరిగణిస్తారు. ఇసుకరాయి, షేల్, సున్నపురాయి, కాంగ్లో మేరేట్ ప్రధాన అవక్షేప శిలల రకాలు. అవక్షేప శిలలు స్తరిత శిలల తరగతికి చెందుతాయి. ఇవి సచ్ఛిద్ర శిలలు. అవక్షేప శిలల్లో శిలాజాలు ఏర్పడతాయి. శిలాజాల వల్ల పురాభౌమ్య యుగంలో శీతోష్ణ స్థితి, సహజ ఉద్భిజ సంపద, జీవజాతుల సమాచారం లభ్యమ వుతుంది. అవక్షేప శిలలు కఠినంగా కానీ లేక మృదువుగా కానీ ఉండవచ్చు. అవక్షేప శిలల్లో సాధారణంగానే అనేక పగుళ్లు ఉంటాయి. వివిధ తరగతులకు చెందిన శిలలు అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాలు లేదా రెండిటికీ లోనైనప్పుడు వాటి భౌతిక, రసాయనిక ధర్మాలు పూర్తిగా మార్పు చెంది ఏర్పడే సరికొత్త శిలలనే రూపాంతర శిలలుగా పిలుస్తారు. రూపాంతర శిలల మాతృక శిలలు అవక్షేప లేదా అగ్ని లేదా రూపాంతర శిలలుగా ఉండవచ్చు. అగ్ని పర్వత ప్రక్రియ లేదా పర్వతోద్భవన ప్రక్రియ సందర్భంగా ప్రధానంగా రూపాంతర శిలలు ఏర్పడతాయి. పటలంలో మాగ్మా ప్రవహిస్తున్నప్పుడు సమీపంలో శిలలు రూపాంతరం చెందుతాయి. పర్వతోద్భవన మండలంలో అధిక ఉష్ణోగ్రతలు, పీడనం కారణంగా రూపాంతర ప్రక్రియ సంభవిస్తుంది. అందువల్లే పలకల సరిహద్దుల వద్ద రూపాంతర ప్రక్రియ సర్వ సాధారణం. అవక్షేప శిలలైన షేల్, ఇసుకరాయి, సున్నపురాయి రూపాంతరం చెందడం వల్ల వరుసగా స్లేట్, క్వార్ట్జైట్, పాలరాయి వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. గ్రానైట్, గాబ్రొ వంటి అగ్ని శిలల రూపాంతరం వల్ల వరుసగా నీస్, ఫిల్లైట్ వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. స్లేట్, క్వార్ట్జైట్‌లు మర లా రూపాంతర ప్రక్రియకు లోనవడం వల్ల సిస్ట్, ఫిల్లైట్ వంటి రూపాంతర శిలలు ఏర్పడతాయి. అవక్షేప శిలల్లో శిలాజ ఇంధన వనరులైన బొగ్గు, చమురు, సహజవాయువులు విస్తారంగా లభిస్తాయి. రూపాంతర శిలల్లో నాన్ ఫై జాతికి చెంది లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాల వనరులు ఉంటాయి. రూపాంతర శిలలు కఠినంగా, దృఢంగా ఉండటం వల్ల భవన నిర్మాణ రంగంలో విశేషంగా ఉపకరిస్తాయి. భూ ఉపరితలం మీద ఉన్న శిలలు ప్రధానంగా అవక్షేప శిలల తరగతికి చెందుతాయి.

VRO / GROUP 4 ONLINE CLASS 7

WORLD GEOGRAPHY - 3


సౌర కుటుంబం - భూమి

సౌర కుటుంబంలో సూర్యుడు, నవగ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు ఉంటాయి. సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం. నవగ్రహాల్లో భూమి ఒకటి. సూర్యగోళం భూమి కంటే 1.3 మిలియన్ రెట్లు పెద్దది.
నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘పాలపుంత’ అంటారు. దీన్నే ‘పాలవెల్లి’, ‘ఆకాశగంగ’ అని కూడా అంటారు.
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. అవి:
సిద్ధాంతకర్త సిద్ధాంతం
చాంబర్లీన్, మౌల్టన్ గ్రహాల పరికల్పన సిద్ధాంతం
కాంట్ గ్యాసియస్ మాస్ థియరీ
లాప్లాస్ నెబ్యులార్ థియరీ
జీన్స్, జెఫ్రీ టెడల్ సిద్ధాంతం
రస్సెల్, లిటిల్ టన్ బైనరీ స్టార్ హైపోథిసిస్

సూర్యుడి ఉపరితలంపై 6000°C, కేంద్రంలో 10,00,000 °C ఉష్ణోగ్రత ఉంటుంది.
గ్రహాలను రెండు భాగాలుగా విభజించారు. అవి...
అంతర గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు.
బాహ్య గ్రహాలు: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
గమనిక: 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫ్ (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.
భూమి సూర్యుడి నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. భూమి ఉపగ్రహం చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారు 3,84,365 కి.మీ.
అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. ఇవి అధిక సాంద్రత, ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు.

1. బుధుడు
ఇది అతి చిన్న గ్రహం. సూర్యుడికి అతి దగ్గరగా (58 మి.కి.మీ.) ఉన్న గ్రహం.
సూర్యుడి చుట్టూ అత్యధిక వేగంతో తిరిగే గ్రహం (47.9 కి.మీ./సె).
దీనికి ఉపగ్రహాలు లేవు. దీన్ని ‘అపోలో’ అని కూడా పిలుస్తారు.

2. శుక్రుడు
దీన్ని ‘ఉదయ తార’ లేదా ‘సంధ్య తార’ అని పిలుస్తారు.
శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులు, తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది.
సౌర కుటుంబంలో అత్యధిక వేడి (ఉష్ణోగ్రత) ఉన్న గ్రహం శుక్రుడు. దీని వాతావరణంలో 95 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉండటమే దీనికి కారణం.
సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైంది కాబట్టి దీన్ని ‘వేగుచుక్క’ అని కూడా పిలుస్తారు.
ద్రవ్యం, పరిమాణం, సాంద్రతల్లో భూమిని పోలి ఉండటం వల్ల దీన్ని ‘భూమికి కవల గ్రహం’గా పేర్కొంటారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
ఇది సూర్యుడి నుంచి రెండో గ్రహం.

3. భూమి
ఇది జీవం ఉన్న గ్రహం.
భూమికి ఒకే ఒక్క సహజ ఉపగ్రహం చంద్రుడు.
భూమిని ‘నీలి గ్రహం’ అంటారు.
ఇది సూర్యుడి నుంచి దూరంలో మూడో గ్రహం. పరిమాణంలో అయిదో గ్రహం.
గ్రహాలన్నింటిలో సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రహం భూమి. దీని వైశాల్యం 510 మి.చ.కి.మీ.
భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య పొడవు 965 మి.కి.మీ.

4. అంగారకుడు (కుజుడు)
దీన్నే అరుణ గ్రహం అంటారు.
దీనికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. అవి.. ఫోబస్, డెమోస్.
రోమన్లు దీన్ని ‘గాడ్ ఆఫ్ వార్’గా పేర్కొంటారు.
ఇది సూర్యుడి నుంచి నాలుగో గ్రహం.
అంగారక గ్రహ అధ్యయనానికి భారతదేశం 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ-సి-25 రాకెట్ ద్వారా ‘మంగళయాన్’ అనే ఆర్బిటర్‌ను పంపింది.
బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ బాహ్య గ్రహాలు. ఇవి పరిమాణంలో పెద్ద గ్రహాలు. హైడ్రోజన్, హీలియం ఘనీభవించడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. వీటికి ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి.

5. బృహస్పతి
దీన్ని ‘గ్రహాల రాజు’ అని పిలుస్తారు.
గ్రహాలన్నింటి కంటే పెద్దది. భూమి కంటే 11 రెట్లు పెద్దది. అత్యధిక ఉపగ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి 5వ గ్రహం.
దీనికి తక్కువ ఆత్మభ్రమణ కాలం ఉంది.
దీనికి సౌర వ్యవస్థలో కెల్లా అతిపెద్ద ఉపగ్రహం ‘గానిమైడ్’ ఉంది.
ఇది షూమేకర్ లేవీ తోకచుక్కను ఢీకొన్న గ్రహం. అందువల్ల దీన్ని రెడ్ రింగ్డ్ ప్లానెట్‌గా పిలుస్తారు.

6. శని
పరిమాణంలో రెండో అతి పెద్ద గ్రహం.
దీనికి ‘టైటాన్’ అనే ఉపగ్రహం ఉంది. ఇది సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద ఉపగ్రహం.
దీనికి అతి తక్కువ సాంద్రత ఉంది.
సూర్యుడి నుంచి ఆరో గ్రహం.

7. యురేనస్
ఇది పరిమాణంలో మూడోది. ఈ గ్రహ ఉపరితలంపై మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
ఇది తూర్పు నుంచి పడమరకు భ్రమిస్తుంది.
దీనికి మిరండా, ఏరియల్, ఒబెరాన్, టిటానియా, ఉమ్‌బ్రియల్ మొదలైన ఉపగ్రహాలున్నాయి.
సూర్యుడి నుంచి ఏడో గ్రహం.

8. నెప్ట్యూన్
ఇది అతి చల్లని గ్రహం.
దీని పరిభ్రమణ కాలం - 165 ఏళ్లు.
సూర్యుడి నుంచి అత్యధిక దూరంలో ఉన్న గ్రహం ఇది.
ఇది విష వాయువులైన మీథేన్, అమ్మోనియాలను కలిగి ఉంది.
సూర్యుడి నుంచి 8వ గ్రహం. పరిమాణంలో నాలుగోది.

VRO / GROUP 4 ONLINE CLASS 6

WORLD GEOGRAPHY - 2

వాతావరణ పీడనం - ప్రభావాలు

Clima అనే గ్రీకు పదం నుంచి Climate అనే ఇంగ్లిష్ పదం ఆవిర్భవించింది. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని అర్థం.
వాతావరణ స్థితి: ఒక ప్రదేశ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతాల సంయుక్త స్థితిని వాతావరణ స్థితి అంటారు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మెటీరియాలజీ.

శీతోష్ణస్థితి: ఒక ప్రదేశానికి సంబంధించిన దీర్ఘకాల (కనీసం 30 ఏళ్ల) వాతావరణ స్థితుల సరాసరిని శీతోష్ణస్థితి అంటారు.

వాతావరణ పీడనం: ఒక ప్రదేశంలోని వాయువుల పొర బరువును వాతావరణ పీడనం అంటారు.
గాలికి బరువు ఉందని గెలీలియో నిరూపించాడు.
వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరంభారమితి (బారోమీటర్)
భారమితిని కనిపెట్టింది టారిసెల్లి (ఇటలీ, క్రీ.శ.1643). ఇతను గెలీలియో శిష్యుడు.
సామాన్య వాతావరణ పీడనం అంటే భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీ మీటర్లు.
760 మి.మీ. = 76 సెంటీమీటర్లు = 29 అంగుళాలు = 1013.2 మిల్లీ బార్లు.
గొట్టంలో పాదరసం ఎత్తు 3 మిల్లీ మీటర్లు అయితే 4 మిల్లీ బార్లకు సమానం.
1 మి.మీ. = 1.33 మి.బార్లు.
ఒక చదరపు సెం.మీ వైశాల్యంలో 1 గ్రా. బరువును మిల్లీబార్ అంటారు.

వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు
1. ఎత్తు: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున పీడనం తగ్గుతుంది. ప్రతి 300 మీటర్ల ఎత్తుకు 25.4 మిల్లీబార్ల పీడనం తగ్గుతుంది.
6 కి.మీ ఎత్తులో 506 మిల్లీబార్లు లేదా 308 మి.మీ. వాతావరణ పీడనం తగ్గుతుంది.

2. ఉష్ణోగ్రత: ఇది పెరిగితే గాలి సాంద్రత తగ్గి, పీడనం కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం విలోమానుపాతంలో ఉంటాయి.

3. నీటి ఆవిరి: పొడి గాలి కంటే నీటి ఆవిరి బరువు తక్కువ కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పెరిగితే పీడనం తగ్గుతుంది.

4. వాయు ప్రవాహాలు: అధిక ఉష్ణోగ్రత వల్ల అల్పపీడనం గల ప్రాంతాల్లో పైకి తేలిపోయే వాయు ప్రవాహాలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి పవనాలు వీస్తాయి.
అల్ప ఉష్ణోగ్రత వల్ల అధిక పీడనం గల ప్రాంతాల్లో కిందకు దిగే వాయు ప్రవాహాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పవనాలు వీస్తాయి.
సముద్ర మట్టం వద్ద సరాసరి వాతావరణ పీడనం 900-1030 మిల్లీబార్లు ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత వాతావరణ పీడనం గల ప్రాంతం సైబీరియాలోని అగాటా. ఇక్కడ 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది (1963, డిసెంబర్ 31).
ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం గల ప్రాంతం టిప్ అని పిలిచే చక్రవాతం (మరియాన ద్వీపం). ఇక్కడ 870 మిల్లీబార్లు నమోదైంది (1979 అక్టోబర్ 12).

భూగోళంలో పీడన మేఖలలు
1. భూమధ్యరేఖ అల్పపీడన మేఖల: 100 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతాన్ని డోల్‌డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం, నిశ్చలవాత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతంలో సగటున 1013 మిల్లీబార్ల్ల వాతావరణ పీడనం ఉంటుంది.

2. ఉప ఆయనరేఖా అధిక పీడన మేఖల: భూమధ్యరేఖకు ఇరువైపులా 250-300 అక్షాంశాల మధ్య ఉంటుంది. వీటినే గాలి కిందకి దిగే ప్రాంతాలు అంటారు. పీడన మండలాలు సూర్య గమనాన్ని బట్టి ఉత్తర, దక్షిణాలుగా కొద్దిగా జరుగుతాయి.

3. ఉప ధ్రువ అల్పపీడన మేఖల: భూమధ్యరేఖకు ఇరువైపులా 450-650 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యలో ఉంటుంది. దీన్నే సమశీతోష్ణ అల్పపీడన మేఖల అంటారు.

4. ధ్రువ అధిక పీడన మేఖల: 750-900 అక్షాంశాల మధ్యగల అతి శీతల ప్రాంతాన్ని ధ్రువ అధిక పీడన ప్రాంతం అంటారు.
పవనాలు
గాలి ఎప్పుడూ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపునకు ప్రయాణిస్తుంది.
భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనం అంటారు.
భూమి ఉపరితలంపై నిటారుగా పైకి కదిలే గాలిని గాలి ప్రవాహం అంటారు.
రెండు ప్రదేశాల మధ్య వీచే గాలి.. పీడన మార్పుపై ఆధారపడి ఉంటుంది.
సమాన పీడనం గల ప్రదేశాలను కలిపే రేఖలు.. సమభార రేఖలు (ఐసోబార్‌‌స).
రెండు ప్రదేశాల మధ్య పీడన భేదాన్ని పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత ఎక్కువైతే గాలి వేగం పెరుగుతుంది.
గాలి వేగాన్ని కొలిచే పరికరం అనిమోమీటర్ (పవనవేగమాపకం) / బ్యూఫోర్టు స్కేల్.
సమాన పవన వేగం గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలుఐసోకైనటిక్స్.
గాలి వీచే దిశను సూచించేది పవన సూచిక
భూ భ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు.
కొరియాలిస్ బలం భూమధ్యరేఖ వద్ద తక్కువగా, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది.
కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఫ్సై సూత్రం ప్రకారం ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు కుడి వైపునకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు నెట్టబడతాయి.

పవనాలు రకాలు
పవనాలు మూడు రకాలు అవి..
1) ప్రపంచ పవనాలు
2) కాలాన్ని బట్టి వీచే పవనాలు
3) స్థానిక పవనాలు

1. ప్రపంచ పవనాలు
ఈ పవనాలు ఏడాది పొడవునా నిరంతరం ఒకే దిశలో, స్థిరంగా వీస్తాయి. అందుకే వీటిని స్థిర పవనాలు అని కూడా అంటారు.
ప్రపంచ పవనాలు 3 రకాలు
ఎ.వ్యాపార పవనాలు: ఇవి ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖా అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. ఇవి 80-300 అక్షాంశాల మధ్య వీస్తాయి.
వీటిని ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అని అంటారు.
వీటి వేగం గంటకు 15-20 కిలోమీటర్లు. ఈ పవనాల వల్ల ఖండాల తూర్పు తీరాల్లో వర్షం సంభవిస్తుంది.
బి. పశ్చిమ పవనాలు: ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి.
ఇవి 350-600 అక్షాంశాల మధ్య వీస్తాయి. వీటిని ప్రతి వ్యాపార పవనాలు అంటారు.
వీటి వేగం గంటకు 45-75 కిలోమీటర్లు.
ఉత్తరార్ధ గోళంలో నైరుతి దిశ నుంచి, దక్షిణార్ధ గోళంలో వాయవ్య దిశ నుంచి వీస్తాయి.
400 అక్షాంశాల వద్ద వీటిని గర్జించే నలభైలు (దక్షిణార్ధ గోళంలో) అంటారు.
500 అక్షాంశాల వద్ద వీచే వీటిని భయపెట్టే యాభైలు, కోపోద్రిక్త యాభైలు అంటారు.
600 అక్షాంశాల వద్ద వీచే వీటిని వణికించే అరవైలు అంటారు.
ఇవి బయలుదేరే ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలు (300 అక్షాంశాలు) అంటారు.
సి. ధ్రువ తూర్పు పవనాలు: అధిక పీడన ధ్రువ ప్రాంతాల నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. వేగం తక్కువ, స్థిరత్వం ఉండదు.
ఇవి 600-800 అక్షాంశాల మధ్య వీస్తాయి.

2. కాలాన్ని బట్టి వీచే పవనాలు
వీటినే రుతుపవనాలు అంటారు. ఒక రుతువులో ఒక దిశలో, మరొక రుతువులో దానికి వ్యతిరేక దిశలో వీస్తాయి.
భూ పవనాలు: తీరం నుంచి సముద్రం వైపునకు వీస్తాయి.
సముద్ర పవనాలు: సముద్రం నుంచి తీరం వైపునకు వీస్తాయి.
లోయ పవనాలు: పగటి సమయంలో పర్వతాల మీదకు వీస్తాయి.
పర్వత పవనాలు: రాత్రి సమయాల్లో పర్వతాల నుంచి లోయలోకి వీస్తాయి.

3. స్థానిక పవనాలు
- ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో స్థానికంగా సంభవించే మార్పు వల్ల ఇవి ఏర్పడతాయి.
ఇవి రెండు రకాలు
1. వెచ్చని పవనాలు
2. శీతల పవనాలు.

వెచ్చని పవనాలు

ఫోన్ : ఆల్ఫ్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ మీదకు వీస్తాయి.
చినూక్: అమెరికా, కెనడాల్లో వీస్తాయి (హిమభక్షకి).
శాంట అనా: కాలిఫోర్నియాలో వీస్తాయి.
సిరోకో: మధ్యధరా సముద్రం నుంచి ఐరోపాకు వీస్తాయి.
లూ: రాజస్థాన్, ఉత్తర భారత దేశంలో వీస్తాయి.
బెర్‌‌గ్స: దక్షిణాఫ్రికాలో వీస్తాయి.
నార్వెస్టర్: న్యూజిలాండ్‌లో వీస్తాయి.
హార్మాటాన్: పశ్చిమ ఆఫ్రికాలో వీస్తాయి.
సలానో: స్పెయిన్‌లో వీస్తాయి.
ఖమ్సిన్: ఈజిప్టులో వీస్తాయి.
గిబ్లీ: లిబియాలో వీస్తాయి.
గర్బీ: ఏజివ్, ఏడ్రియాటిక్ సముద్రం మీదుగా వీస్తాయి.
సిమ్మన్: అరేబియా ఎడారి ప్రాంతంలో వీస్తాయి.
బ్రిక్ ఫెల్లర్: ఆస్ట్రేలియాలో వీస్తాయి.
జోండా: అర్జంటీనాలో వీస్తాయి.

శీతల పవనాలు

మిస్ట్రల్: ఐరోపాలో ఫ్రాన్స్ నుంచి మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి.
బోరా: ఐరోపా (యుగోస్లావియా)లో వీస్తాయి.
పాంపిరో: అర్జంటీనాలో వీస్తాయి.
బురాన్: రష్యా, సైబీరియాలో వీస్తాయి.
నెవడాస్: గ్రీన్‌లాండ్‌లో వీస్తాయి.
పుర్గా: రష్యాలో వీస్తాయి.
కెటబాటిక్: అంటార్కిటికా ఖండంలో వీస్తాయి.
బైస్: ఫ్రాన్‌‌సలో వీస్తాయి.
ప్యూనా: ఆండీస్ పర్వతాల్లో వీస్తాయి.
నార్టె: మెక్సికోలో వీస్తాయి.

Tuesday, 10 July 2018

VRO / GROUP 4 ONLINE CLASS - 5

WORLD GEOGRAPHY - 1


భూగోళశాస్త్రం - శాస్త్రవేత్తలు

భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జాగ్రఫీ అంటారు. జియో అంటే భూమి అని, గ్రఫీ అంటే వర్ణన లేక అధ్యయనం అని అర్థం.

ఎరిటోస్తనీస్: కీ.పూ.296-194లో జాగ్రఫీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. జాగ్రఫియా అనే గ్రంథం రాశాడు. భూమి చుట్టుకొలతను తొలిసారి శాస్త్రబద్ధంగా లెక్కించాడు. ఇతణ్ని భూగోళశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు.

హెకటేవియస్ (క్రీ.పూ.550): గ్రీకు చరిత్రకారుడు. ఇతను కూడా భూగోళ శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి పొందాడు. ప్రపంచ పటాలను రూపొందించడానికి నోమస్ అనే పరికరాన్ని ఉపయోగించాడు.

రిచర్డ్‌ హార్ట్షోర్న్‌: ఇతడు అమెరికన్ భూగోళ శాస్త్రవేత్త. 1959లో పర్‌స్పెక్టివ్ నేచర్ ఆఫ్ జియోగ్రఫీ అనే గ్రంథం రాశాడు. ఇతని నిర్వచనం ప్రకారం అస్తిర స్వభావం, లక్షణం గల భూ తలానికి కచ్చితమైన, క్రమబద్ధమైన వర్ణన, వివరణలను సమకూర్చడమే భూగోళ శాస్త్రజ్ఞుల ఉద్దేశం.

ఆధునిక భూగోళశాస్త్ర పితామహులు
అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్ (1769-1859): కాస్మోస్ అనే గ్రంథాన్ని రాశాడు. జర్మనీ శాస్త్రవేత్త. అలాగే కార్‌‌ల రిట్టర్ కూడా జర్మనీకి చెందిన శాస్త్రవేత్త.

ఫ్రెడరిక్ రట్జెల్ (జర్మనీ): ఆధునిక మానవ భూగోళ శాస్త్ర పితామహుడు. ఈయన నిర్వచనం ప్రకారం భూతలానికి, మానవ సంఘాలకు మధ్య ఉన్న అనుబంధం గురిం చిన అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం.

హంటింగ్‌టన్: ఇతని నిర్వచనం ప్రకారం భౌతిక పరిస్థితులకు, పర్యావరణానికి మానవ ప్రతిస్పందనలను అధ్యయనం చేసేదే మానవ భూగోళశాస్త్రం.

డబ్ల్యు.ఎం.డేవిస్: భూస్వరూపశాస్త్ర పితామహుడు. భూమిపై వివిధ స్వరూపాలను వివరించాడు. నదులకు బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలు ఉంటాయని పేర్కొన్నాడు.

పాట్రిక్ గడెజ్ (స్కాట్లాండ్): సర్వ శాస్త్రాల సమ్మేళనమే భూగోళమని పేర్కొన్నాడు. 

ఇమ్మాన్యుయేల్ కాంట్ (జర్మనీ): చరిత్రకు ఆధారం భూగోళం అని పేర్కొన్నాడు.

విశ్వం
విశ్వం గురించి అధ్యయనం చేసేదే ఖగోళ శాస్త్రం. దీన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అని అంటారు.
విశ్వం అంటే వివిధ నక్షత్ర మండలాలు, అందులోని సౌర కుటుంబాలు, ఇతర నక్షత్రాల సమూహం.

టాలమి: గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త (క్రీ.పూ.140). విశ్వం అంతటికీ భూమి కేంద్రం అనే భూకేంద్ర సిద్ధాంతాన్ని (Geocentric Theory) ప్రతిపాదించాడు. ఆల్మాగెస్ట్ అనే గ్రంథం రాశాడు. 

కోపర్నికస్ (1473-1543): పోలెండ్ దేశస్తుడు. విశ్వానికి సూర్యుడు కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని(Heliocentric Theory)ప్రతిపాదించాడు. On the Revolutions of the Celestial Spheres అనే గ్రంథం రాశాడు. 

జోహన్నెస్ కెప్లర్ (జర్మనీ): గ్రహాల వృత్తాకార కక్ష్య గురించి తెలిపిన శాస్త్రవేత్త. 

న్యూటన్ (1642-1726): Philosophiæ Naturalis Principia Mathematica అనే గ్రంథాన్ని రాశాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది ఖగోళశాస్త్రంలోనే గొప్ప మలుపు.

ఎడ్విన్ హబుల్: అమెరికా శాస్త్రవేత్త. విశ్వాన్ని టెలిస్కోప్ సాయంతో శోధించి, విశ్లేషించాడు. నక్షత్ర వీధులన్నీ వేటికవే దూరంగా విహరిస్తున్నాయని, సూర్యుడు పాలపుంత అనే నక్షత్ర వీధిలో ఓ నక్షత్రమని 1929లో ప్రతిపాదించాడు.

విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు
1.బిగ్ బ్యాంగ్ థియరీ: 
1370 కోట్ల ఏళ్ల కిందట ఒక హైడ్రోజన్ మేఘం ఉండేది (అంతరిక్ష పదార్థం ఒక ముద్ద లాగ). ఉష్ణోగ్రతలు పెరగడం, సంపీడనం వల్ల విస్ఫోటనం జరగడంతో ఆ పదార్థమంతా ముక్కలుగా విశ్వాంతరాళం లోకి విస్తరించింది. అలా విడివడిన పదార్థ భాగాలు విశ్వాంతరాళంలో నిరంతరం వేగంగా సంచరిస్తూ నక్షత్ర మండలంగా ఏర్పడి, నిర్ణీత కక్ష్యలో కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి.
ఈ సిద్ధాంతాన్ని బెల్జియం శాస్త్రవేత్త జార్జెస్ అబె లెమిటియర్ (1927) ప్రతిపాదించాడు. 
ఈ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాన్ని 2008, సెప్టెంబర్ 10న ఫ్రాన్‌‌స-స్విట్జర్లాండ్ సరిహద్దులోని తోరా-బోరా పర్వతాల్లో చేశారు.

2. నిరంతర సృష్టి సిద్ధాంతం
పదార్థం నిరంతరం ఉత్పత్తవుతూ విశ్వం విస్తరిస్తుందని థామస్ గోల్డ్, హెర్మాన్ బాండీ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

3. డోలనా సిద్ధాంతం
విశ్వం కొన్ని కోట్ల ఏళ్లు సంకోచించి, కొన్ని కోట్ల ఏళ్లు వ్యాకోచిస్తుందని డోలనా సిద్ధాంతం తెలుపుతుంది. దీన్ని బ్రిటన్ శాస్త్రవేత్త అలెన్ శాండజ్ ప్రతిపాదించాడు.
నక్షత్రాలు వేడి వాయువులతో కూడిన ఖగోళ వస్తువుల (నీహారిక) నుంచి ఆవిర్భవించాయని హ్యూజెన్‌‌స అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు.

నక్షత్ర వీధులు: కేంద్రకం ఆకర్షణలో పరిభ్రమిస్తూ (పెద్ద సమూహాలుగా) ఏర్పడిన కొన్ని కోట్ల నక్షత్ర సముదాయాలను నక్షత్ర మండలం అంటారు. నక్షత్ర వీధులు మూడు భాగాలు.
1. సర్పిలాకార నక్షత్ర వీధి (స్పైరల్) - 80%
2. దీర్ఘవృత్తాకార నక్షత్ర వీధి (ఎలప్టికల్) - 17%
3. అసంఘటిత నక్షత్ర వీధి - (ఇర్రిలవెంట్)- 3%
రెండు గెలాక్సీల మధ్య దూరం సుమారు 20 వేల కాంతి సంవత్సరాలు.

పాలపుంత
గెలా అనేది గ్రీకు పదం. దీనికి సమానార్థం పాలు.
కొన్ని గెలాక్సీల సముదాయాన్ని క్లస్టర్ అంటారు.
సూర్యుడు, గ్రహాలు ఉన్న గెలాక్సీ పాలపుంత (పాలవెల్లి). ఇది సర్పిలాకార నక్షత్ర వీధి. సూర్యుడు ఈ నక్షత్ర వీధిలోనే ఉన్నాడు.
అంతరిక్ష నక్షత్ర మండల సమూహంలో పాలపుంత ఒకటి. ఇది కేంద్రకం నుంచి 32 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
పాలపుంత అనే గెలాక్సీకి దగ్గరలో గల గెలాక్సీ ఆండ్రోమెడ. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా.
గ్రీకులు పాలపుంతను స్వర్గానికి దారిగా భావించారు. భారతీయులు ఆకాశ గంగ అన్నారు.
పాలపుంతను తెల్లని బూడిద మార్గం అని ఎస్కిమోలు పేర్కొన్నారు.
పాలపుంతను చైనీయులు ఖగోళ నదులు అని, హిబ్రూలు కాంతి నదులు అని అన్నారు. 
విశ్వంలో ఎక్కువగా ఉన్న మూలకం హైడ్రోజన్. భూమిపై అధికంగా ఉన్నది నైట్రోజన్. 

నక్షత్రాలు
స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ఇవి ఏర్పడటానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్.
నక్షత్రాల్లో ఉష్ణం, కాంతి, శక్తి జనించడానికి కారణం కేంద్రక సంలీనం.

నక్షత్ర దశలు
ఎ. న్యూట్రాన్ నక్షత్రాలు: నాడి కొట్టుకునే రీతిలో విద్యుదయస్కాంత శక్తిని విడుదలచేసే నక్షత్రాలు. 
బి. అర్ధ నక్షత్రాలు: పూర్తిస్థాయి నక్షత్ర దశను పొందకముందే శక్తి జనక ప్రక్రియ ప్రారంభమయ్యే నక్షత్రాలు.
సి. అస్థిర నక్షత్రాలు: ఇంధనం అయిపోయిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధిలో కాంతి ప్రకాశతలో మార్పునకు లోనయ్యే నక్షత్రాలు. వీటినే చంచల నక్షత్రాలు అంటారు.
డి. స్థిర నక్షత్రాలు: కేంద్రక సంలీనం ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే విధంగా ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రాలు. 
ఇ. తాత్కాలిక నక్షత్రాలు: బాహ్య పొర పేలినట్లు కనిపించే నక్షత్రాలు. వీటి పేర్లు.. నోవా, సూపర్ నోవా.

అరుణ మహాతార 
హైడ్రోజన్ వాయువు బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో, ప్రకాశతలో పూర్తిస్థాయి వృద్ధి పొందిన నక్షత్ర దశను అరుణ మహాతార (రెడ్ జెయింట్) అంటారు.
ప్రస్తుతం సూర్యుడు రెడ్ జెయింట్ దశలో ఉన్నాడు.

నోవా, సూపర్ నోవా
హైడ్రోజన్ వల్ల ఎక్కువ శక్తి (20 రెట్లు) ఉత్పత్తి అయి, దాని ప్రభావానికి నక్షత్ర బాహ్య ప్రదేశం లోనైతే దాన్ని నోవా అంటారు. నక్షత్రం మొత్తం ఆ ప్రభావానికి లోనైతే సూపర్ నోవా అంటారు.

బ్లాక్ హోల్స్
వీటి గురించి ఊహించింది ఐన్‌స్టీన్. 
బ్లాక్‌హోల్స్ అనే పదాన్ని అమెరికాకు చెందిన జాన్ వీలర్ 1967లో ఉపయోగించాడు.
బ్లాక్‌హోల్స్ గురించి 1974లో స్టీఫెన్ హాకింగ్ వివరించాడు. వీటిపై పరిశోధనకు భారతీయ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్ 1983లో నోబెల్ బహుమతి పొందారు. 
సూర్యుడి కంటే 1.4 రెట్లు అధిక ద్రవ్యరాశి గల నక్షత్రమే బ్లాక్‌హోల్‌గా మారుతుంది.

కాంతి సంవత్సరం
ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
కాంతి సంవత్సరం = 9.46073×1012 కి.మీ. 
కాంతి వేగం సెకన్‌కు 2,99,793 కి.మీ. (3 లక్షల కి.మీ.) పార్సెక్ అంటే 3.26 కాంతి సంవత్సరాలు. దీన్ని కనుగొన్నది హెర్బర్ట్ హాల్‌టర్నర్
ఖగోళంలో దూరాలను కొలిచే పెద్ద ప్రమాణం పార్సెక్.

Thursday, 28 June 2018

VRO ONLINE CLASS 4

1.  వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.

DAY 4

వర్తమానాంశాలు - ప్రాంతీయం  -  4

దిల్లీలో తెలంగాణ బోనాల శకటం
* 2015, జనవరి 26న జరిగిన 66వ గణతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు తమ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని చాటుకునే రీతిలో శకటాలను రూపొందించి ప్రదర్శించాయి.
* తెలంగాణ ప్రభుత్వం 'బోనాల పండగ'కు ప్రతీకగా శకటాన్ని ప్రదర్శించింది.
సాలెపురుగుకు తెలంగాణ పేరు
* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లా నాగ్నూర్ గ్రామంలో కొత్తగా గుర్తించిన సాలెపురుగుకు 'తెలంగాణ క్రాబ్ స్పైడర్' గా పేరు పెట్టినట్లు సాలెపురుగును కనుక్కున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం పేర్కొంది.
* రాష్ట్రం ఏర్పడ్డాక గుర్తించిన తొలి జీవరాశి కావడంతో ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రుల సదస్సు
* దక్షిణాది రాష్ట్రాల కార్మిక మంత్రులు, కార్యదర్శుల మూడో ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో 2015, జూన్ 27న జరిగింది.
* ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్రకార్మిక శాఖామంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
'ఉనికి' పుస్తకావిష్కరణ
* తెలంగాణకు చెందిన మహారాష్ట్ర గవర్నరు సీహెచ్ విద్యాసాగర్‌రావు రాసిన 'ఉనికి పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015, జులై 3న ఆవిష్కరించారు.
* విద్యాసాగరరావు గతంలో వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను 'ఉనికి పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు.
సోలార్ నగరంగా మహబూబ్‌నగర్
* కేంద్ర నూతన, పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఎంపిక చేసిన మొత్తం 55 సోలార్ నగరాల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చోటు లభించింది.
* 2015 ఆగస్టులో సోలార్ నగరాల జాబితాను ప్రకటించారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో నగరానికి జనాభా ఆధారంగా 50 లక్షల రూపాయల వరకు ఆర్థికసాయం లభిస్తుంది.
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండోసారి స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటలో 2015, ఆగస్టు 15న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
* గోల్కొండ కోటలో జరిగిన 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరయ్యారు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రసంగించారు.
అవినీతిలో 'రెవెన్యూ'
* ప్రభుత్వ శాఖల్లో అవినీతి, ఇతర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరుకు 6 నెలల కాలంలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలించగా రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉంది. పోలీసు శాఖ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో నిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు జరిపే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య శాఖలు ఉన్నాయి.
* వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా, ఆదిలాబాద్ జిల్లా నుంచి అతి తక్కువగా ఫిర్యాదులొచ్చాయి.
కృష్ణారెడ్డి మృతి
* తెలంగాణ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మేల్యే (కాంగ్రెస్) పట్టోళ్ల కృష్ణారెడ్డి(73) 2015, ఆగస్టు 25న గుండెపోటుతో మరణించారు.
* కృష్ణారెడ్డి 1989, 1999, 2004, 2014లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
* గతంలో రెండుసార్లు పీఏసీ ఛైర్మన్‌గా పనిచేశారు. తిరిగి గత 6 నెలలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.
స్మార్ట్ నగరాలు
* దేశంలో 100 నగరాలను ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్ సిటీలు)గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 98 నగరాల జాబితాను కేంద్రం 2015, ఆగస్టు 27న ప్రకటించింది. (ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, జమ్మూకశ్మీర్‌లో ఒకటి పెండింగ్‌లో ఉన్నాయి)
* తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపికయ్యాయి.
* అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, తమిళనాడులో 12, మహారాష్ట్రలో 10 నగరాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 నగరాలు ఎంపికయ్యాయి.
* తెలంగాణ నుంచి ఎంపికైన రెండు గ్రేటర్ నగరాలు... రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి, రెండు నగరాలు కూడా ఇవే.
* ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.48 వేల కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రాలు, పురపాలక సంస్థలు అంతే మొత్తాన్ని సమకూర్చవలసి ఉంటుంది.
హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్
* గూగుల్ సంస్థ ఆసియాలోనే తన తొలి క్యాంపస్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
* ఇది అమెరికా వెలుపల ఉన్న గూగుల్ క్యాంపస్‌లలో అతిపెద్దది కానుంది.
* 2016లో దీని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. రూ.1000 కోట్లుతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
'అందరికీ ఇళ్లు' పథకం
* పట్టణ ప్రాంత పేదల కోసం దేశ వ్యాప్తంగా 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'అందరికీ ఇళ్లు' (హౌసింగ్ ఫర్ ఆల్ అర్బన్) పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలో 9 రాష్ట్రాల నుంచి 305 నగరాలు, పట్టణాలను ఎంపిక చేసింది.
* వీటిలో తెలంగాణ నుంచి 34 నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయి. పథకం అమలు బాధ్యతను నోడల్ ఏజెన్సీ అయిన పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ తీసుకుంది.
* ఈ కార్యక్రమం కింద కేంద్రం 2015-2022 మధ్య రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.
* పథకం ముఖ్య ఉద్దేశం 'మురికివాడల నిర్మూలన'.
కేసీఆర్ చైనా పర్యటన
* రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెబరు 7 - 16 తేదీల మధ్య చైనాలో పర్యటించారు.
పర్యటన ముఖ్యాంశాలు:
* నూతన రాష్ట్ర ఉనికి, పురోగతిని విశ్వవ్యాప్తం చేయడం.
* పారిశ్రామిక విధాన విశిష్టతలను తెలియజెప్పడం.
* రూ.50 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్
* హైదరాబాద్ - న్యూదిల్లీల మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ (నెం.12723/12724) రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
* 2015, నవంబరు 15 నుంచి కొత్తపేరు అమల్లో వస్తుంది.
* హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ పేరును ఇదివరకే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.
పాలకుర్తి మార్కెట్‌కి ఐలమ్మ పేరు
* వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును వరంగల్ జిల్లా పాలకుర్తి ఉప మార్కెట్‌యార్డుకు పెడుతూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* ఇదివరకు తెలంగాణ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని 2015, జూన్ 2 నుంచి వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ధారావాహిక (సీరియల్)గా ప్రారంభించారు.
మోదీతో సంభాషణకు ఇద్దరి ఎంపిక
* ఉపాధ్యాయ దినోత్సవానికి ముందు రోజు దేశవ్యాప్తంగా విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖికి (ఆన్‌లైన్ ద్వారా) తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు.
* ఎవరెస్ట్ పర్వతారోహణ చేసిన పూర్ణ, ఏషియన్ యోగా ఛాంఫియన్ షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన సుందర్ రాజ్‌లు ఎంపికయ్యారు.
* వీరిద్దరూ సెప్టెంబరు 4న ప్రధానితో సంభాషణలో నేరుగా మాట్లాడారు.


వర్తమానాంశాలు - జాతీయం   -   4

కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ల గణాంకాలు.. ఆర్థిక సర్వే అంచనాలు.. రాష్ట్రాలకు కేంద్ర వాటాలో పెంపు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయింపులు.. రక్షణ రంగంలో స్పెయిన్‌తో ఒప్పందం.. క్లోనింగ్‌లో భారత పరిశోధకులు సాధించిన ఘనత.. అవార్డులు, రైతు కార్డులు, ప్రవాస భారతీయులకు చేయూత.. పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో జాతీయ విషయ విశేషాలు తెలుసుకుందాం...
14 కోట్ల మంది రైతుల కోసం..
రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో 'భూసార కార్డు పథకం'ను ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఎరువులను సమతౌల్యంగా ఉపయోగించే విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే మూడేళ్లలో 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పంటకు ఏ ఎరువు అవసరమో కార్డులో వివరంగా సిఫార్సు చేస్తారు.
ఆన్‌లైన్ చేయూత
విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు దౌత్య కార్యాలయాల పరంగా ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 'మదత్' (చేయూత) పేరుతో ప్రత్యేక ఈ-పోర్టల్‌ను ప్రారంభించింది. దౌత్య కార్యాలయాల పరంగా ఎదుర్కొనే సమస్యలను ఇకపై ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు. అత్యధిక జవాబుదారీతనంతో ఆయా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు 'మదత్' పోర్టల్ సాయపడుతుంది.
పన్నుల్లో వాటా పెంపు
కేంద్రం నుంచి రాష్ట్రాలకొచ్చే పన్నుల వాటా గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో ఆ వాటాను 10 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గతంలో 32 శాతం ఉండగా 42 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నరు వై.వి.రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించింది. తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం 2015-16లో అదనంగా రూ. 1.78 లక్షల కోట్లు ఇవ్వనుంది. అయితే రాష్ట్రాలకు గ్రాంట్లు సిఫార్సు చేసే విషయంలో 14వ ఆర్థిక సంఘం ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాల మొత్తం ఆదాయ, వ్యయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంది.
* 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులు, ఆదాయ వ్యత్యాసాలు, అటవీ విస్తీర్ణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ 42 శాతం వాటాలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో తెలంగాణకు 2.437 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది. అలాగే సేవాపన్ను (సర్వీస్ ట్యాక్స్)లో తెలంగాణ వాటా 2.499 శాతంగా, ఏపీ వాటా 4.398 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫార్సు చేసింది.
* విభజన కారణంగా ఆదాయలోటు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంటు మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2015 నుంచి 2020 వరకు దక్కే మొత్తం రూ.22,113 కోట్లు. ఆదాయలోటు ఏర్పడిన మరో 10 రాష్ట్రాలకు (జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, పశ్చిమ్‌బంగ, మణిపూర్, కేరళ, త్రిపుర, అసోం, మేఘాలయ) 2015 నుంచి 2020 వరకు రూ.1.94 లక్షల కోట్ల మంజూరుకు సిఫార్సు చేసింది.
కొత్తరైలు లేని బడ్జెట్
2015-16 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2015, ఫిబ్రవరి 26న పార్లమెంటుకు సమర్పించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ బడ్జెట్‌లో ఒక్క కొత్తరైలు, రైలుమార్గాన్ని ప్రకటించలేదు. ఉన్న రైళ్ల సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రసుత్త రైలుమార్గాలను పొడిగించి బలోపేతం చేస్తామని ప్రకటించారు. ప్రణాళికా వ్యయం కింద రూ.1,00,011 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ మొత్తం కంటే ఇది 52 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు స్థూల బడ్జెటరీ మద్దతు కింద రూ.40,000 కోట్లను కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.10,000 కోట్లు అధికం. రైల్వేశాఖను లాభాల బాట పట్టించేందుకు నిర్వహణ నిష్పత్తి (రాబడిలో మొత్తం ఖర్చు)ని ఈ ఆర్థిక సంవత్సరంలో 88.5 శాతానికి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని సురేష్ ప్రభు ప్రకటించారు. రాబడిని రూ.25 వేల కోట్లు పెంచేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ (సవరణ) చట్టం-2015
భారత సంతతి వ్యక్తులకు శాశ్వత వీసా సదుపాయం కల్పించగల 'పౌరసత్వ (సవరణ) చట్టం-2015' బిల్లును కేంద్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీంతో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐవో), ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (వోసీఐ) కార్డు పథకాలు విలీనమయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ రెండింటినీ కలుపుతామంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లో భారతీయులకు ఇచ్చిన హామీని ఈ బిల్లు నెరవేరుస్తుంది.
ఆర్థిక సర్వే 2014-15
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దీన్ని కొనసాగిస్తూ 2015, ఫిబ్రవరి 27న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 2015-16లో 1 శాతానికి పడిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15 ఏడాదికి 257.07 మిలియన్ టన్నులు ఉంటుందన్నది ప్రభుత్వ అంచనా. గత అయిదేళ్ల సగటు కంటే ఇది 8.5 మిలియన్ టన్నులు ఎక్కువ. దేశంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల్లోని పెట్టుబడులు జీడీపీలో 7 శాతానికి సమానమని ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడైంది. బ్యాంకులు, బీమా రంగంలో భారీ సంస్కరణలతో 2013లో బీమా వ్యాప్తి 3.9 శాతానికి చేరిందని, 2000లో ఇది 2.3 శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల్లో మౌలిక, ఇనుము-ఉక్కు, జౌళి, గనులు, విమానయాన రంగాలు మొత్తం 54 శాతం వాటాను కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది. గత కొన్నేళ్లుగా పెట్టుబడుల్లో ఆలస్యం కారణంగా 2014 డిసెంబరు చివరి నాటికి రూ. 8.8 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని సర్వే స్పష్టం చేసింది. మొత్తం ఆగిపోయిన ప్రాజెక్టుల్లో మౌలిక రంగాల కంటే తయారీ రంగానివే ఎక్కువ ఉండటం గమనార్హం. దేశంలో ఆహార, ఇంధన, రైల్వే, ఎరువుల రూపేణా ఏటా రూ. 3.77 లక్షల కోట్ల మేర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇందులో అర్హులకు చేరేది కొంతేనని సర్వే తేల్చింది. 2012-13లో దేశ వాణిజ్య లోటు 190.3 బిలియన్ డాలర్లు (రూ.11,41,800 కోట్లు) కాగా 2013-14లో 135.8 బిలియన్ డాలర్ల (రూ.8,14,800 కోట్లు)కు దిగి వచ్చింది.
కేంద్ర బడ్జెట్ 2015-16
ఉపాధి కల్పన, సామాజిక భద్రత, వృద్ధిరేటు పెంపు ప్రధానాంశాలుగా 2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015, ఫిబ్రవరి 28న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం విలువ రూ.17,77,477 కోట్లు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.4,65,277 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు.

రక్షణ రంగంలో భారత్-స్పెయిన్
రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా భారత్, స్పెయిన్ 2015 మార్చిలో 'పరస్పర రహస్య సమాచార రక్షణ ఒప్పందం'పై సంతకాలు చేశాయి. రక్షణ, పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో సహకార విధి విధానాల రూపకల్పనకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. స్పెయిన్ రక్షణ మంత్రి పెడ్రో మోరెనెస్ భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.
డిజిటల్ జెండర్ అట్లాస్
లింగ వివక్ష నేపథ్యంలో ఏయే పథకాలు ఎలా అమలవుతున్నాయో సులభంగా గుర్తించగలిగేలా డిజిటల్ రూపంలో పటాన్ని (డిజిటల్ జెండర్ అట్లాస్) కేంద్ర ప్రభుత్వం 2015 మార్చిలో రూపొందించింది. ముఖ్యంగా బాలికల విద్యాపథకాలు, కార్యక్రమాల సమర్థ అమలు కోసం దీన్ని రూపొందించారు. అంతర్జాలం ఆధారంగా ఇది పనిచేస్తుంది. యునిసెఫ్ సహకారంతో ఈ అట్లాస్‌ను రూపొందించారు.
క్లోన్డ్ గేదె దూడ 'అపూర్వ'
గేదె మూత్రంలోని సొమాటిక్ కణాలను ఉపయోగించి భారత పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న జాతీయ పాడి పరిశోధన సంస్థ (ఎన్‌డీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ విధానంలో పుట్టిన దూడకు 'అపూర్వ' అని పేరు పెట్టారు. ప్రఖ్యాతిగాంచిన ముర్రా జాతి గేదెకు ఇది క్లోన్డ్ రూపం. ముర్రా జాతి గేదెలు ఎక్కువ పరిమాణంలో పాలు ఇస్తాయి. గేదె మూత్రంలోని ఒక విసర్జిత పదార్థం నుంచి దాత కణాలను వేరుచేశారు. అనంతరం హ్యాండ్ గైడెడ్ క్లోనింగ్ పరిజ్ఞానాన్ని ప్రయోగించారు. ఈ విధానం జీవకణాలు వేగంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.
హర్విందర్ రూపొందించిన వీడియో
నిర్భయ ఉదంతం నేపథ్యంలో బ్రిటన్ వనిత లెస్లీ ఉడ్విన్ చిత్రీకరించిన వివాదాస్పద 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీకి ప్రతిస్పందనగా 'యునైటెడ్ కింగ్‌డమ్స్ డాటర్' అనే డాక్యుమెంటరీని భారత్‌కు చెందిన హర్విందర్ సింగ్ రూపొందించారు. బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లైంగిక వేధింపులనేవి భారత్‌కు సంబంధించినవి మాత్రమే కావని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చాటిచెప్పేందుకే హర్విందర్ ఈ వీడియోను రూపొందించారు.
తొలిసారిగా ఇద్దరికి..
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి మహిళా శాస్త్రవేత్తలు టెస్సీ థామస్, గీతావరదన్‌లకు ప్రదానం చేశారు. తొలిసారిగా ఈ అవార్డును ఇద్దరికి ప్రకటించారు. అగ్ని క్షిపణి ప్రయోగంలో సేవలందించి 'అగ్ని పుత్రిక'గా, 'క్షిపణి మహిళ'గా టెస్సీ థామస్ పేరుగాంచారు. అగ్రశ్రేణి ఉపగ్రహ సమాచార శాస్త్రవేత్తగా గీతావరదన్ ఖ్యాతి పొందారు.



వర్తమానాంశాలు - అంతర్జాతీయం   -  4

విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకుంటే ఎంతో విజ్ఞానం మన సొంతమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత పురస్కారాలు.. అద్భుత ఆవిష్కరణలు.. ప్రపంచ సంస్థలు వెల్లడిస్తున్న జాబితాలు.. భూమండల వాతావరణ రికార్డులు.. ఒకటేమిటి? ఎన్నో సంగతుల సమాహారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం..
రూ. 6 లక్షల కోట్లు మరి!

* 2015 ఫిబ్రవరిలో నల్లకుబేరులకు సంబంధించిన ఓ జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఖాతాదారుల వివరాలు ఇందులో ఉండటం సంచలనం సృష్టించింది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ - ఐసీఐజే) బయటపెట్టింది. దీని ప్రకారం.. లక్షమంది దాచుకున్న మొత్తం సంపద 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 లక్షల కోట్లు).
* ఈ జాబితాలో భారత్‌కు చెందిన 1,195 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మాజీ అధికారుల పేర్లున్నాయి. ప్రస్తుత విదేశీ మారక విలువల ఆధారంగా లెక్కించినప్పుడు ఆ ఖాతాల్లోని నిల్వలు 400 కోట్ల డాలర్ల (రూ. 25,420 కోట్లు)కు పైగా ఉన్నాయి.
గ్రామీ అవార్డులు - 2015

* సంగీత రంగంలో అంతర్జాతీయ స్థాయి పురస్కారంగా పేరొందిన గ్రామీ అవార్డులను (57వ) 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో ప్రదానం చేశారు. మన దేశానికి చెందిన రికీకేజ్, నీలావిశ్వానీలు పురస్కార గ్రహీతల్లో ఉన్నారు. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల రికీకేజ్‌కు 'న్యూఏజ్ ఆల్బమ్' విభాగంలో గ్రామీ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికా కళాకారుడు వౌటర్ కెల్లెర్మాన్‌తో కలిసి రికీకేజ్ మహాత్మాగాంధీ స్ఫూర్తితో 'విండ్స్ ఆఫ్ సంసారా' అనే ఆల్బమ్‌ను రూపొందించారు.
* మరో గ్రామీ అవార్డు పురస్కారాన్ని భారత్‌కు అందించిన నీలా విశ్వానీ వాస్తవానికి రచయిత్రి. ఆమె చిన్నకథల సంపుటాలను వెలువరించారు. పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ జీవిత కథ (ఐ యాం మలాలా)కు నీలావిశ్వానీ ధ్వని రూపం (ఆడియో) కల్పించారు. ఐయాం మలాలా! పేరుతోనే తెచ్చిన ఈ ఆల్బమ్‌లో మలాలా స్వీయచరిత్రను విశ్వానీ వివరించారు. 'ఉత్తమ పిల్లల ఆల్బమ్' విభాగంలో ఇది అవార్డుకు ఎంపికైంది.
ఈ ఏడాది గ్రామీ విజేతలు: ఉత్తమ ఆల్బమ్ - మార్నింగ్ ఫేజ్ (గాయకుడు బెక్), ఉత్తమ రికార్డ్ - స్టే విత్‌మీ (గాయకుడు శాంస్మిత్), ఉత్తమ పాట - స్టే విత్‌మీ (శాంస్మిత్, జిమ్మీ నేప్స్, విలియం ఫిలిప్స్), ఉత్తమ కొత్త కళాకారుడు - శాంస్మిత్, ప్రజాదరణ పొందిన ఓకల్ ఆల్బమ్ - ఇన్ ది లోన్లీ అవర్ (శాంస్మిత్).
వరల్డ్ ప్రెస్‌ఫొటో పురస్కారాలు

* ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో పురస్కారం-2015ను డెన్మార్క్ ఫొటోగ్రాఫర్ మాడ్స్ నిస్సేన్ గెలుచుకున్నారు. ఈయన తీసిన రష్యా స్వలింగ సంపర్క జంట ఫొటోకు ఈ అవార్డు దక్కింది. రష్యాలో స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ఫొటోను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అతడికి సమకాలిన సమస్య విభాగంలో కూడా పురస్కారం దక్కింది.

వేడెక్కిన జనవరి

* ప్రపంచ వ్యాప్తంగా భూమి, సముద్ర ఉపరితలాలపై సగటు ఉష్ణోగ్రత 2015 జనవరిలో రికార్డుస్థాయిలో నమోదైనట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్- ఎన్‌వోఏఏ) పేర్కొంది. ఉష్ణోగ్రతల రికార్డుల్ని 1880 నుంచి నమోదు చేస్తుండగా.. ఆ ఏడాది నుంచి చూస్తే ఇది రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనవరిలో భూమి, సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రత 0.77 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది 20వ శతాబ్దం సగటుకన్నా ఎక్కువే. అంతకుముందు 2007లో 0.86 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక స్థాయి సగటు నమోదైంది.
* 2015 జనవరిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 1.43 డిగ్రీల సెల్సియస్‌తో 20వ శతాబ్దపు సగటుకన్నా ఎక్కువగా నమోదైంది. ఇది కూడా రెండో స్థానంలో ఉండగా, అత్యధికంగా 2007లో 1.84 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2015 జనవరిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.53 డిగ్రీల సెల్సియస్ సగటుతో 20వ శతాబ్దం సగటుకన్నా అధికంగా నమోదైంది. ఇది మూడోస్థానంలో నిలిచింది.
ఆస్కార్ అవార్డులు-2015

* 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని లాస్ఏంజిల్స్‌లో 87వ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. బర్డ్‌మ్యాన్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ - చిత్రాలు నాలుగేసి పురస్కారాలు దక్కించుకున్నాయి.
పురస్కార గ్రహీతలు
ఉత్తమ చిత్రం - బర్డ్‌మ్యాన్
ఉత్తమ నటుడు - ఎడ్డి రెడ్‌మేన్ (ది థిµయరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
ఉత్తమ నటి - జూలియన్ మూర్ (స్టిల్ అలైస్)
ఉత్తమ దర్శకుడు - అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు (బర్డ్‌మ్యాన్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం - ఇడా (పోలెండ్ చిత్రం)
* చలనచిత్ర రంగంలో ప్రపంచ అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డులను 1929 నుంచి ఏటా అమెరికాలో ప్రదానం చేస్తున్నారు. వీటినే 'ది అకాడమీ అవార్డ్స్‌'గా కూడా పిలుస్తారు. 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ - ఏఎంపీఏఎస్' ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.
* ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తొలిసారిగా 1953లో టీవీలో ప్రసారం చేశారు. ఆస్కార్ తొలి ఉత్తమ నటుడిగా ఎమిల్ జెన్నింగ్స్, తొలి ఉత్తమ నటిగా జానెట్ గేనర్‌లు పురస్కారాలు పొందారు.
* భారత దేశానికి తొలి ఆస్కార్ సాధించిన ఘనత భాను అథయాకు దక్కింది. ఆమె 1983లో హాలీవుడ్ సినిమా 'గాంధీ'కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ పురస్కారాన్ని పొందారు. 1992లో సత్యజిత్‌రే ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. 2009లో 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను ఏఆర్ రెహ్మాన్ (ఉత్తమ సంగీతం), రసూల్ పూకుట్టి (ఉత్తమ సౌండ్ మిక్సింగ్), ఏఆర్ రెహ్మాన్, గుల్జార్ (ఉత్తమ ఒరిజినల్ పాట)లు ఆస్కార్ అందుకున్నారు.
* రెండు ఆస్కార్ పురస్కారాలు పొందిన తొలి భారతీయుడిగా ఏఆర్ రెహ్మాన్ వార్తల్లో నిలిచారు. మూడు భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1958), సలాం బాంబే (1989), లగాన్ (2002)లు ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేషన్లు పొందాయి.
'ఎబోలా'కు మందు!

* ఆసియాకు చెందిన టెట్రాండ్రిన్ అనే మూలిక నుంచి సేకరించిన అణువు ఎబోలా నుంచి రక్షణ కల్పిస్తుందని టెక్సాస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వైరస్ ప్రవేశించడానికి, కణాల్ని ఇన్‌ఫెక్షన్‌కు గురిచేయడానికి ఉపయోగించే మార్గాల్ని ఇది మూసివేస్తుందని పరిశోధకులు గుర్తించారు. టెట్రాండ్రిన్ సూక్ష్మ అణువుకు మానవ తెల్ల రక్తకణాల ఇన్ఫెక్షన్‌ను అణచిపెట్టే శక్తి ఉన్నట్లు ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాల్లో తేలింది.
'కీ స్టోన్ ఎక్స్ఎల్‌'ను తిరస్కరించిన ఒబామా

* కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టిన వివాదాస్పద 'కీ స్టోన్ ఎక్స్ఎల్' ముడిచమురు పైప్‌లైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. అధ్యక్షుడిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఉన్న బరాక్ ఒబామా వీటో అధికారాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి.
రికార్డు స్థాయిలో తృణ ధాన్యాలు

* 2014లో ప్రపంచ తృణ ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 2,534 మిలియన్ టన్నులుగా నమోదైనట్లు ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్) ఇటీవల వెల్లడించింది. 2013తో పోలిస్తే ఇది 13 మిలియన్ టన్నులు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 1,104 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఆహార పదార్థాలుగా, 876 మిలియన్ టన్నులు జంతువుల ఆహారం కోసం వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఓ వెల్లడించింది.
* ఎఫ్ఏవో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య గత దశాబ్దకాలంలో 100 మిలియన్లు తగ్గింది. ఇదే కాలంలో తృణ ధాన్యాల ఉత్పత్తి దాదాపుగా 500 మిలియన్ టన్నులు పెరిగింది.
2013-14లో భారత్‌లో 245.5 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి.

Saturday, 23 June 2018

VRO ONLINE CLASS 3

1.  వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
DAY 3



వర్తమానాంశాలు - ప్రాంతీయం  - 3

* తెలంగాణ అభివృద్ధికి పథకాలు
* గోదావరికి మహాపుష్కరాలు
* ప్రజాకవికి ప్రభుత్వ నీరాజనం

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం 2015లో విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఈదిశగా పలు ప్రగతి పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది. అటవీ అభివృద్ధికి పెద్దపీట వేసింది.
మరోవైపు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాలు పండగ.. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వచ్చిన గోదావరి మహాపుష్కరాలు..
వీటిని వైభవంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందించి సత్కరించింది. సినారె, డీఎస్ లాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించింది..
ఇలాంటి ఎన్నో విశేషాల అవలోకనం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..


నియామకాలు 

* తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు (జేఎండీ)గా సి.శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్)కు చెందిన ఆయన గత నాలుగేళ్లుగా డిప్యూటేషన్‌పై సీపీడీసీఎల్ ఆర్థిక విభాగం డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
* డిప్యూటేషన్ ముగిసినా మరో రెండేళ్లు కొనసాగించేందుకు కేంద్ర రైల్వేశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందింది.
* తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా షఫియుల్లా నియమితులయ్యారు.
* ఈయన ప్రస్తుతం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ పద్ధతిలో ఏడాదిపాటు టీఎస్ఎంఎఫ్‌సీ ఎండీగా కొనసాగుతారు.
* మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ 2015 ఆగస్టు 21న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* దీని ప్రకారం కేబినెట్ ర్యాంకుతో 'అంతర్ రాష్ట్ర వ్యవహారాలు' బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుంది.
* నిజామాబాద్‌కు చెందిన డి.శ్రీనివాస్ రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
* తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) 2015 ఆగస్టు 1న ఎంపికయ్యారు.
* సినారెకి 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.
* సినారె ప్రముఖ రచనలు కర్పూర వసంతరాయలు, విశ్వంభర..

హరిత హారం

* రాష్ట్రంలో అడవులను 24 నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని
శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రారంభించారు.
* మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం.

గోదావరి పుష్కరాలు 

* 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన గోదావరి మహా పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
* తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వచ్చిన పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం 2015 జులై 14-25 తేదీల మధ్య నిర్వహించింది.
* ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి వద్ద గోదావరిలో పుణ్యస్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు.


ఒప్పందాలు 

ఇరాన్‌తో: * తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఇరాన్‌ల మధ్య 2015, జులై 14న రవీంద్రభారతిలో సాంస్కృతిక ఒప్పందం కుదిరింది.
* ఇందులో భాగంగా ఒకరి కళారూపాలను ఇంకొకరు గౌరవించాల్సి ఉంటుంది.
* ఇందులో భాగంగా 2015, జులై 26న ఇరాన్ కళాకారులు ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇజ్రాయిల్‌తో : * తెలంగాణ, ఇజ్రాయిల్ మధ్య నృత్యకళా ఒప్పందం జరిగింది.
* హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో 2015, జులై 16న ఇజ్రాయిల్ దేశ సాంస్కృతిక ప్రతినిధి కణా అంజి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి
బీపీ ఆచార్య మధ్య ఒప్పందం కుదిరింది.
* దీనిలో భాగంగా తెలంగాణ 'పేరిణీ నృత్యం'ను ఇజ్రాయిల్‌లో ప్రదర్శించేందుకు, ఇజ్రాయిల్ 'గాగా డాన్స్ ఫామ్‌'ను తెలంగాణలో ప్రదర్శించేందుకు ఒప్పందాలు కుదిరాయి.
* అక్టోబరు, నవంబరు నెలల్లో 'గాగా డాన్స్ ఫామ్' నృత్య ప్రదర్శనలు తెలంగాణలో ఇవ్వనున్నారు.


పురస్కారాలు

* తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రదానం చేస్తున్న దాశరథి కృష్ణమార్యులు అవార్డును ప్రముఖ సాహితీవేత్త 'తిరుమల శ్రీనివాసాచార్యులు'కు దాశరథి జయంతి అయిన జులై 22న అందజేశారు.
* ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమురం భీమ్ మనుమడు సోనేరావుకు కొమురం భీమ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
* ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన 'ఆచార్య దేవోభవ' పురస్కారాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అందుకున్నారు.
ఆగస్టు 17న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన జయశంకర్ జయంతి ఉత్సవాల్లో కోదండరామ్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
'గివ్ ఇట్ అప్‌'లో తెలంగాణ
* ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని, వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ప్రారంభించిన 'గివ్ ఇట్ అప్' కార్యక్రమంలో భాగంగా
దేశ వ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు.
* కేంద్ర పెట్రోలియం శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.
* 'గివ్ ఇట్ అప్‌'లో దేశంలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది.
* ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
'బోవెరా' పురస్కారం
* ప్రముఖ కవి, జానపద గాయకుడు అయిన గోరేటి వెంకన్నకు ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, గాంధేయవాది అయిన బోయినపల్లి వెంకట రామారావు పేరిట ఏర్పాటు చేసిన
'బోవెరా కవితా పురస్కారం' లభించింది.
* బోవెరా జయంతి సందర్భంగా కరింనగర్‌లోని బోవెరాభవన్‌లో 2015 సెప్టెంబరు 2న పురస్కారం ప్రదానం చేశారు.


గ్రామాల అభివృద్ధి 

* గ్రామాల సమ్మిళిత-సమీకృత అభివృద్ధి సాధన లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టు 17న వరంగల్ జిల్లా, గంగదేవిపల్లిలో ప్రారంభించారు.
* రానున్న అయిదేళ్లలో ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
* ఈ కార్యక్రమం కింద జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి 2 నుంచి 6 కోట్ల రూపాయలు అందిస్తారు.


లక్ష్యాలు 

* గ్రామాల్లో సమ్మిళిత-సమీకృత అభివృద్ధి సాధించడం.
* పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం.
* గ్రామ పంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం.
* గ్రామస్థాయిలోనే 'గ్రామసభ'ల ఆమోదంతో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు..


తెలంగాణ పల్లెప్రగతి

* తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 'తెలంగాణ పల్లెప్రగతి' కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు 2015,
 ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించారు.
* ఈ కార్యక్రమం మొత్తం వ్యయం రూ. 642 కోట్లు.. (ఇందులో ప్రపంచ బ్యాంకు రూ. 450 కోట్ల ఆర్థికసాయం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు వెచ్చిస్తుంది.)
* తెలంగాణలో 37.5 లక్షల మంది పేద గ్రామీణులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
* ఎంపిక చేసిన 150 మండలాల్లో అయిదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.


ముఖ్యాంశాలు: గ్రామస్థాయిలో 2.5 లక్షల పేదల ఉత్పత్తిదారుల సంఘాలు, కృషి మార్ట్‌ల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంపు.
* వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలవకులపై శిక్షణ. గొర్రెలు, మేకల పెంపకంతోపాటు వరి, తృణ ధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో వారికి చేయూత..
* 2.5 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడం.
* 1,000 గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు.
* తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమాన్ని 'తెలంగాణ రూరల్ ఇన్‌క్లూ జివ్ గ్రోత్ ప్రాజెక్ట్ (టీఆర్ఐజీపీ)' అని కూడా అంటారు.


బోనాలు

* తెలంగాణ రాష్ట్ర పండ‌గ అయిన బోనాల‌ను 2015, ఆగ‌స్టు 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ‌రరావు సికింద్రాబాద్ మ‌హంకాళీ అమ్మవారికి బోనం స‌మ‌ర్పించి ప్రారంభించారు.
* తెలంగాణ జాన‌ప‌ద సంస్కృతికి ప్రతిబింబ‌మైన బోనాల కోసం రూ. 10 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ భాషాదినోత్సవంగా కాళోజీ జయంతి 

కాళోజీ స్మారక పురస్కారం : * ప్రజాకవి కాళోజీ నారాయణరావు విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజును (సెప్టెంబరు 9) తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తిస్తున్నట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కాళోజీ 101వ జయంతిని రాష్ట్రస్థాయిలో అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర పర్యటక,
సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో 2015 సెప్టెంబరు 9న తెలంగాణ భాషాదినోత్సవాన్ని నిర్వహించారు.
* రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల్లో.. కాళోజీ జీవితం, సాహిత్యం, కవిత్వంపై చర్చలు, ఉపన్యాసాలు, కవి సమ్మేళనాలు, నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంత్యుత్సవాలతో పాటు, కాళోజీ స్మారక పురస్కారం-2015 ప్రదాననోత్సవం కూడా సెప్టెంబరు 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించారు.
* మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి, విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి
నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు
* కాళోజీ నారాయణరావు కుటుంబం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండ గ్రామంలో స్థిరపడింది.
* కాళోజీ 1914, సెప్టెంబరు 9న జన్మించారు.
* కాళోజీ తల్లిదండ్రులు రంగారావు, రమాబాయమ్మ.
* ప్రాథమిక విద్య అనంతరం పాతబస్తీలోని 'చౌమొహల్లా' పాఠశాలలో కొంత కాలం కాళోజీ చదివారు. ఆ తర్వాత సిటీకాలేజీలోనూ చదివారు.
* 1939లో హైదరాబాద్‌లోని హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.
* స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర మరువలేనిది.
* రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. 'నా గొడవ' పేరిట సమకాలిన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా పాలకులపై అక్షరాస్త్రాలు సంధించారు.
 ఈ గ్రంథం అత్యంత ప్రజాదరణ పొందింది.
* విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు.
* వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకే ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు.
* ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు.
* విశాలాంధ్ర కావాలని ఆశించిన కాళోజీ, విశాలాంధ్ర వల్ల ఎదురయ్యే సమస్యలను గుర్తించి 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
* కాళోజీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ పురస్కారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ప్రజాకవి' బిరుదుతో సత్కరించాయి.
* కాకతీయ యూనివర్సిటీ 1992లో కాళోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
* కాళోజీ తన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసీ) పేరును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంగా
 ప్రభుత్వం మార్చింది.
* కాళోజీ నారాయణరావుని 'కాళోజీ, కళన్న, ప్రజాకవి(బిరుదు)' అని పిలుస్తారు.
* కాళోజీ 2002, నవంబరు 13న మరణించారు.

రచనలు : 
* అణాకథలు - 1941, పార్థివ వ్యయం - 1946, కాళోజీ కథలు - 1943, జీవనగీత - 1968 (అనువాద గ్రంథం), నాగొడవ - 1953, నా భారతదేశ యాత్ర - 1941 (అనువాదం), తెలంగాణ ఉద్యమ కవితలు - 1969-70.
* కాళోజీ గ్రంథం 'నాగొడవ' తొలిసారిగా 1953 జనవరి 12న ముద్రితమైంది. తర్వాత చాలాసార్లు పునర్‌ముద్రించారు.
* కాళోజీ ఆత్మకథ పేరు - ఇది నాగొడవ (1995)
కాళోజీకి స్ఫూర్తినిచ్చే సూక్తులు.. 1.'ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక', 2. 'పుటక నీది - చావు నీది - బతుకంతా దేశానిది'. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజీ అన్న మాటలు.



వర్తమానాంశాలు - జాతీయం  - 3

* ప్రణాళిక సంఘం రద్దు
* నీతిఆయోగ్ ఏర్పాటు

ఏ దేశంలో అయినా.. ఏ వ్యవస్థలో అయినా మార్పు అనివార్యం. సమాజ, మానవ జీవన పరిణామక్రమం చెబుతున్న సత్యమిది. ఒకప్పుడు గొప్పగా పనిచేసే వ్యవస్థలు.. సంస్థలు..
ఏవైనా అనంతర కాలంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పు చెందడమో.. కొత్తరూపును సంతరించుకోవడమో తప్పనిసరి. భారతదేశంలో ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన
ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతిఆయోగ్ కూడా ఇలాంటిదే. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి అప్పటి భారతదేశ అవసరాల దృష్ట్యా తొలి ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం
దేశాభివృద్ధి దిశగా అనేక విజయాలు సాధించింది. క్రమేపీ కొన్ని విమర్శలకు కూడా గురైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ హయాంలో ప్రణాళిక సంఘం రద్దయి
కొత్త వ్యవస్థగా నీతిఆయోగ్ ఏర్పాటైంది. ప్రణాళిక సంఘం ఎలా పనిచేసింది? నీతిఆయోగ్ ఎలా పనిచేయనుంది? విశేషాల సమాహారమిది..
స్వాతంత్య్రం సాధించిన తర్వాత భారతదేశంలో.. వివిధ రంగాల్లో పెద్దఎత్తున జరగాల్సిన అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న రోజులవి.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సోషలిస్ట్ భావాలకు, రష్యా సాధించిన పురోగతికి ప్రభావితమై.. దేశం ప్రగతిబాటలో పయనించాలంటే అది ప్రణాళికబద్ధమైన వ్యూహాలతోనే సాధ్యమని విశ్వసించారు.
ఈ మేరకు 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దూరదృష్టితో దేశ అవసరాలకు సరిపోయేలా విధి విధానాలను రూపొందించడం.. వివిధ రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను
సూచించడం.. దేశ ఆర్థిక వనరులను రాష్ట్రాలకు కేటాయించడం.. లాంటి ప్రధాన లక్ష్యాలతో ప్రణాళిక సంఘం ముందుకు సాగింది. ఏర్పడిన నాటి నుంచి మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది.
ప్రధాని నేతృత్వంలో పనిచేసే ప్రణాళిక సంఘంలో క్యాబినెట్ హోదా కలిగిన ఒక ఉపాధ్యక్షుడు, సెక్రటరీతోపాటు కొంతమంది మేధావులు సభ్యులుగా ఉంటారు.

విజయాలు.. విమర్శలు 

ఆరు దశాబ్ధాలకు పైగా ప్రణాళిక సంఘం ద్వారా అమలైన 12 పంచవర్ష ప్రణాళికలు దేశంలో అనేక విజయాలు సాధించాయి. కొన్ని చేదు అనుభవాలనూ మిగిల్చాయి. స్వాతంత్య్రం సాధించిన
తొలినాళ్లలో దేశాభివృద్ధిలో పంచవర్ష ప్రణాళికల పాత్ర అమోఘమని చెప్పవచ్చు. పంచవర్ష ప్రణాళికలే లేకపోతే ప్రభుత్వాలకు దిశా నిర్దేశం ఉండేది కాదన్నంతగా ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే క్రమంగా ప్రణాళిక సంఘం పాత్రపై విమర్శలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం సాధించిన దశాబ్దాల తర్వాత కూడా అసమానతలు, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యాలను సాధించడంలో
ప్రణాళిక సంఘం విఫలమయ్యిందనే భావన నెలకొంది. ఆర్థిక వనరుల పంపిణీపై ఆదేశాలు జారీచేసే స్థాయిలో పనిచేసే ప్రణాళిక సంఘం కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు అడ్డంకిగా మారిందని,
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉందన్న అభిప్రాయం బలపడుతూ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం కూడా సరికాదని
ఆర్థిక నిపుణులు వాదిస్తూ వచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల వైపు దేశం ప్రయాణిస్తున్న తరుణంలో ప్రపంచ స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడు స్పందించాల్సిన
ఈ సందర్భంలో ప్రణాళిక సంఘం ఔచిత్యం ప్రశ్నార్థకం అయ్యింది.


నీతిఆయోగ్ వ్యవస్థ 

ప్రణాళిక సంఘం ఔచిత్యం ప్రశ్నార్థకమైన నేపథ్యంలో.. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.
ప్రణాళిక సంఘంలోని లోటుపాట్లను సరిదిద్దే విధంగా దాని స్థానంలో 2015 జనవరి 1న నీతిఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా)ను ప్రవేశపెట్టింది.
భిన్న సంస్కృతులు, భాషలు, భావాలు, ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, జాతులు, వనరులతో.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే అభివృద్ధి మంత్రం పని
చేయదనే విషయాన్ని గుర్తించి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలయినా అనుకున్న ఫలితాలను సాధించలేవని,
దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే ఆర్థిక సంస్కరణలతో పాటు పరిపాలన విధానాల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.


స్వరూపం

ప్రధానమంత్రి నేతృత్వంలోని నీతిఆయోగ్‌లో ఒక ఉపాధ్యక్షుడు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులు.
ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా అరవింద్ పణగారియా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై నిర్ణయాల కోసం ముఖ్యమంత్రులతో కూడిన ఉప సంఘాల
రూపంలో నీతిఆయోగ్ పని చేస్తుంది. ఉదాహరణకు స్వచ్ఛభారత్‌కు సంబంధించిన బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణకు సంబంధించిన బృందానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ విధంగా నీతి ఆయోగ్ ప్రభుత్వానికి ఒక మేధోమథన బృందంగా, ఒక సలహా మండలిగా, కేంద్ర రాష్ట్రాల కౌన్సిల్‌గా, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా
పలురకాల పాత్రలను పోషిస్తుంది. రాష్ట్రాల మధ్య వైవిధ్యాలను, వివిధ ప్రాంతాల బలాలను, బలహీనతలను గుర్తిస్తుంది. ఆభివృద్ధి పథంలో వివిధ దశల్లో ఉన్న
రాష్ట్రాల అవసరాలను గుర్తించి చర్యలను సూచించే విధంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. దీనివల్ల విధానాలు మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
నీతి ఆయోగ్ వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలు నెలకొనకుండా ఉంటాయి. దీని వల్ల రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి నీతిఆయోగ్‌ను మారిన
అవసరాలకు తగిందిగా, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్థగా భావంచవచ్చు. నీతి ఆయోగ్ మొదటి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నీతి ఆయోగ్ భారతదేశం
తలరాతను మార్చే టీమ్ ఇండియాగా అభివర్ణించారు.


ప్రణాళికలు.. లక్ష్యాలు 

* 1951లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయంతో పాటు, నీటి పారుదల, ఇంధన శక్తి, రవాణా, సామాజిక అభివృద్ధి లాంటి అంశాలపై దృష్టి సారించారు.
మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా యూజీసీ, అయిదు ఐఐటీలు లాంటి సంస్థలు ప్రారంభమయ్యాయి.
* 1956-61 మధ్య కాలంలో అమలైన రెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
* 1961-66 మధ్య కార్యరూపంలోకి వచ్చిన మూడో పంచవర్ష ప్రణాళిక చైనాతో జరిగిన యుద్ధం, దేశంలో ఏర్పడిన కరవు దృష్ట్యా రక్షణ, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
* మూడో పంచవర్ష ప్రణాళిక వైఫల్యం, వనరుల లేమి, ద్రవ్యోల్బణం పెరుగుదల లాంటి కారణాల వల్ల 1966-69 మధ్యకాలంలో కేవలం వార్షిక ప్రణాళికలకే పరిమితం అయ్యారు.
* 1969-74 మధ్య అమలైన నాలుగో పంచవర్ష ప్రణాళిక బ్యాంకులను ప్రభుత్వపరం చేయడం, హరిత విప్లవం, పేదరిక నిర్మూలన లాంటి చర్యలకు నాంది పలికింది.
* 1974-79 మధ్య ప్రవేశపెట్టిన 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టింది.ఇదే సమయంలో జాతీయ రహదారుల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
1978-80లో నిరంతర ప్రణాళికను అమలు చేశారు.
* 1980-85 మధ్య సాగిన ఆరో పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక సరళీకరణలపై దృష్టి పెట్టారు.
* 1985-90 మధ్య కాలంలో కార్యరూపం దాల్చిన ఏడో పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తుల్లో ప్రగతి, ఉపాధికల్పన అంశాల్లో క్రియాశీలం అయింది.
* 1990-92 మధ్య నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభాల కారణంగా పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు. కేవలం వార్షిక ప్రణాళికల ఆధారంగా నిర్ణయాలు జరిగాయి.
* 1992-97 మధ్య అమలైన 8వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా తయారుచేసే విధంగా సంస్కరణలు చేపట్టడం.. పరిశ్రమలను ఆధునికీకరించడం
లాంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు.
* 1997-2002 మధ్య అమలైన 9వ పంచవర్ష ప్రణాళిక ఆర్థిక, సామాజిక, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టింది.
* 2002-07 సంవత్సరాల్లో 10వ పంచవర్ష ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* 2007-12 మధ్య సాగిన 11వ పంచవర్ష ప్రణాళిక ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక రంగాలపై దృష్టి సారించారు.
* పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 2012-17 మధ్య పనిచేయాల్సిన 12వ పంచవర్ష ప్రణాళిక 2014లో మోదీ ప్రభుత్వం నిర్ణయంతో మధ్యలోనే ఆగింది.


వర్తమానాంశాలు - అంతర్జాతీయం  -  3

విశ్వసుందరి కీరీటాన్ని దక్కించుకున్నదెవరు? భారత్ వద్దంటున్నా చైనా ఏ విషయంలో ముందుకెళుతోంది? విద్యుదుత్పత్తిలో ప్రపంచ రికార్డు స్థాపించిన ప్రాజెక్టు ఏది?
బ్రిటన్ ప్రవాస జనాభాలో ఎక్కువ మంది ఏ దేశస్థులు? అత్యంత ఉష్ణంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంవత్సరం ఏది? చైనా ఎలాంటి పాఠ్యపుస్తకాలను నిషేధించింది?
ఫ్రాన్స్‌కు చెందిన ఏ వారపత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు? - పోటీ పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు ఉపకరించే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశ్వవ్యాప్త విశేషాల సమాహారం..

'త్రీ గోర్జెస్' ప్రపంచ రికార్డు

చైనాలోని త్రీ గోర్జెస్ పవర్ ప్రాజెక్టు 2014లో 98.8 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అంతవరకు బ్రెజిల్‌లోని ఇటాయిపు జల విద్యుత్తు కర్మాగారం నెలకొల్పిన
ప్రపంచ రికార్డును త్రీ గోర్జెస్ అధిగమించింది. 2013లో బ్రెజిల్ ప్రాజెక్టు 98.6 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. స్థాపక సామర్థ్యం అంశంలో త్రీ గోర్జెస్ ప్రపంచంలోనే
అతిపెద్ద విద్యుత్తు కర్మాగారం. దీని స్థాపక సామర్థ్యం 22.5 మిలియన్ కిలోవాట్లు కాగా, బ్రెజిల్ ప్రాజెక్టు సామర్థ్యం 14 మిలియన్ కిలోవాట్లు. యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ ప్రాజెక్టు విద్యుత్తును
ఉత్పత్తి చేయడంతో పాటు వరదలను నియంత్రిస్తుంది. నౌకాయానానికి వీలు కల్పిస్తుంది.

బ్రిటన్‌లో భారతీయులు

బ్రిటన్ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రవాసీయులుగా భారత సంతతికి చెందినవారు నిలిచారు. వారి సంఖ్య 2013లో 7.34 లక్షలకు చేరుకున్నట్లు బ్రిటన్ జాతీయ
గణాంక విభాగ కార్యాలయం 2015లో ప్రకటించింది. బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తుల సంఖ్య 2004లో 2.32 లక్షలు ఉండగా 2013 నాటికి అది 7 లక్షలను దాటడం విశేషం.
దీంతో ఇప్పటివరకూ బ్రిటన్‌లో అత్యధిక సంఖ్యాక ప్రవాసీయులుగా ఐర్లాండ్ జాతీయుల పేరిట ఉన్న రికార్డు భారతీయ సంతతి వ్యక్తుల సొంతమైంది.
భారత మామిడిపళ్లపై నిషేధం ఎత్తివేత

భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడిపళ్లపై 8 నెలలుగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని 2015 జనవరిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది.
మామిడిపళ్లపై పురుగు మందుల అవశేషాల దృష్ట్యా 2014 మే ఒకటో తేదీ నుంచి 2015 డిసెంబరు వరకు నిషేధం విధిస్తున్నట్లు ఈయూ గతంలో ప్రకటించింది.
భారత్ నుంచి ఎగుమతయ్యే పళ్లు, కూరగాయల్లో 50 శాతం ఈయూ దేశాలకే వెళ్తున్నాయి. భారత్‌లో ఏటా 15-16 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా వాటిలో
70 వేల టన్నులను ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2013-14లో రూ.304 కోట్ల విలువైన మామిడిని భారత్ ఎగుమతి చేసింది.

పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం

విద్యార్థులపై పాశ్చాత్య భావనల ప్రభావం లేకుండా చూసేందుకు చైనా ప్రభుత్వం ఆ దేశ యూనివర్సిటీల్లో పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం విధించింది.
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని నిందించే విధంగా ఉండే ఏ పుస్తకమూ వర్సిటీల్లో కనిపించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. చైనాలో యూనివర్సిటీలు అధికార
కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలో నడుస్తాయి. చరిత్ర, పార్టీ అధికారానికి ముప్పు తెచ్చే ఇతర సున్నితమైన అంశాలను పార్టీ ఆదేశానుసారమే వర్సిటీల్లో చర్చించాల్సి ఉంటుంది.

తేమ లెక్కలను తేల్చే రాకెట్

నేలలోని తేమకు సంబంధించిన కచ్చితమైన లెక్కలను సేకరించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) 2015 జనవరిలో ఎస్ఎంఏపీ
(సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ పాసివ్) ఉపగ్రహాన్ని డెల్టా-2 రాకెట్ ద్వారా వాండెన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి ప్రయోగించింది. భూమి మీదున్న మొత్తం తేమలో ఒక్క శాతమే నేలపై ఉంటుంది.
97 శాతం సముద్రాల్లోనూ, మిగతాది మంచులోనూ నిక్షిప్తమై ఉంటుంది. స్వల్ప మొత్తంలో నేలలో ఉన్న తేమకు, భూమిపై ఉన్న వాతావరణ వ్యవస్థల (నీరు, శక్తి, కర్బన సైకిళ్లు)తో సంబంధం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో వరదలు లేదా కరవు తలెత్తడం వెనుక ఈ తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో దీని తీరుతెన్నులను పరిశీలించడానికి నాసా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

వీగిపోయిన 'పాలస్తీనా' తీర్మానం

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానాన్ని 2014 డిసెంబరు 31న భద్రతామండలిలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించలేదు.
2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయిల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 8 దేశాలు,
వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది.

భారత్ అభ్యంతరాలను చెబుతున్నా..

భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ సిల్క్ మార్గం ప్రాజెక్టుపై ముందుకే వెళ్తున్న చైనా ఆ ప్రాజెక్టుపై మిగిలిన దేశాల్లో అపనమ్మకాలు నెలకొన్నాయని
ఇటీవల వెల్లడించింది. ఆ అపనమ్మకాలను తాము తొలగిస్తామని పేర్కొంది.
* నూతన సిల్క్ మార్గం ప్రాజెక్టులో చైనాను మధ్య ఆసియా ద్వారా యారప్‌తో కలిపే పురాతన మార్గం కూడా ఉంది. బంగ్లాదేశ్-చైనా -ఇండియా-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్ చైనా,
పాకిస్థాన్‌లను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా కలుపుతుంది. సముద్ర సిల్క్ మార్గం చైనాను పలు నౌకాశ్రయాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పెద్దమొత్తంలో చైనా నిధులను కేటాయించింది.

బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), సహ వ్యవస్థాపకుడు లారీపేజ్‌ను 2014 సంవత్సరానికి 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి 20 మంది కార్పొరేట్ ప్రముఖుల్లో లారీపేజ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇ-కామర్స్ పోర్టల్ 'అలీబాబా' సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్,
యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫాస్ట్‌ఫుడ్ గొలుసుకట్టు సంస్థ చిపోటిల్ సహ సీఈవోలు మోరన్, స్టీవ్ ఎల్స్; ఫెడెక్స్ ఛైర్మన్ ఫ్రెడ్ స్మిత్ కంటే లారీపేజ్ ముందు నిలిచారు.
విశ్వసుందరి.. పౌలినా వెగా

మిస్ యూనివర్స్ - 2014గా కొలంబియాకు చెందిన పౌలినా వెగా (22) కిరీటాన్ని గెల్చుకుంది. 2015 జనవరి 25న అమెరికాలోని మియామీలో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచం
నలుమూలల నుంచి వచ్చిన 88 మంది అందగత్తెలను పక్కకునెట్టి వెగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా నియా శాంచెజ్ (అమెరికా),
రెండో రన్నరప్‌గా డయానా హర్కుషా (ఉక్రెయిన్) నిలిచారు.
* ఇవి 63వ మిస్ యూనివర్స్ పోటీలు. భారత్‌కు చెందిన నొయోనితా లోథ్ టాప్ 15లో నిలిచింది.
* మొదటి మిస్ యూనివర్స్ పోటీలను కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో 1952లో నిర్వహించారు. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన అర్మి కూసెలా విజేతగా నిలిచింది.
'కాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్' అనేది మిస్ యూనివర్స్ పోటీల నినాదం. 1998లో మిస్ యూనివర్స్ పోటీల లోగోను 'ది ఉమెన్ విత్ స్టార్స్' పేరిట రూపొందించారు.
న్యూయార్క్‌లోని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఏటా ఈ అందాల పోటీలను నిర్వహిస్తోంది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్తా భారత్‌కు ఈ టైటిల్‌ను సాధించి పెట్టారు.

ఇటలీ నూతన అధ్యక్షుడు మట్టరెళ్ల

ఇటలీ 12వ అధ్యక్షుడిగా సెర్గియో మట్టరెళ్ల 2015 జనవరి 31న ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో
ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మట్టరెళ్ల ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు గాను 665 ఓట్లు గెలుచుకుని మట్టరెళ్ల విజయం సాధించారు.
సిసిలీ మాఫియా చేతిలో తన సోదరుడి హత్యానంతరం మట్టరెళ్ల క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లో ప్రవేశించారు.

11 ఏళ్లకు కనిపించిన 'బీగిల్-2'

2003 డిసెంబరు 19న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ప్రయోగించిన 'బీగిల్-2' స్పేస్‌క్రాఫ్ట్ 11 ఏళ్ల తర్వాత 2015లో తిరిగి కనబడింది.
వాస్తవంగా 2003 డిసెంబరు 25 నాటికి అంగారకుడిపైకి చేరుకుని సంకేతాలు పంపాల్సిన ఈ వ్యోమనౌక నుంచి అప్పట్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో
2004 ఫిబ్రవరిలో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఈఎస్ఏ ప్రకటించింది. తాజాగా అంగారకుడిపై అన్వేషణకు నాసా పంపిన 'మార్స్ రికన్నైజాన్స్ ఆర్బిటర్' స్పేస్‌క్రాఫ్ట్‌లోని
హై రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల్లో కుజుడి ఉపరితలంపై బీగిల్-2 కనిపించింది. దాని సౌర ఫలకాల్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల యాంటెన్నా పని చేయలేదని,
 అందుకే ఇన్నాళ్లూ అది సంకేతాలు పంపలేక పోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వేడెక్కి పోయింది

అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 రికార్డుల్లోకి ఎక్కింది. 1880తో పోలిస్తే గతేడాది ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెల్సియస్ మేర
పెరిగిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) శాస్త్రవేత్తలు తేల్చారు. నాసాకు చెందిన
గొడార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ (జీఐఎస్ఎస్) పరిశోధకులు భూతలంపై 6300 వాతావరణ కేంద్రాల సాయంతోనూ, నౌకల ద్వారా సముద్రంలోనూ,
అంటార్కిటికా పరిశోధన కేంద్రాల సాయంతోనూ పరిశీలనలు జరిపి ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రామాణిక ప్రాతిపదికగా తీసుకున్న 1951 నుంచి 1980 మధ్య కాలంతో పోలిస్తే
ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలో వచ్చిన వైరుధ్యం ఆధారంగా దీన్ని నిర్ధారించారు. ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఎక్కువ భాగం గత మూడు, నాలుగు దశాబ్దాల్లోనే చోటు చేసుకుంది.
10 అత్యంత ఉష్ణ సంవత్సరాల్లో తొమ్మిది 2000 సంవత్సరం తర్వాతే నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సౌదీ రాజు మరణం

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ అల్‌సౌద్ దేశ రాజధాని రియాద్‌లో 2015, జనవరి 23న మృతి చెందారు.
అబ్దుల్లా మృతదేహాన్ని నిరాడంబరంగా ఇమామ్ తుర్కిబిన్ అబ్దుల్లా మసీదు వద్ద ఖననం చేశారు. సౌదీ అరేబియా రాజుగా 2005
ఆగస్టు 1న సింహాసనాన్ని అధిష్ఠించినా.. అంతకు ముందు నుంచే అబ్దుల్లా (దాదాపు రెండు దశాబ్దాల పాటు) పరిపాలన సాగించారు.
2005లో సౌదీ రాజుగా అధికారికంగా నియమితుడైనప్పటికీ 1996 నుంచే అబ్దుల్లా దేశ పాలనా బాధ్యతలు నిర్వర్తించారు.
1996లో నాటి రాజు ఫాద్ గుండెపోటుకు గురవడంతో అబ్దుల్లా పాలనా పగ్గాలు చేపట్టారు.
* అగ్రరాజ్యం అమెరికాకు మధ్య ప్రాచ్యంలో విశ్వసనీయ నేస్తంగా.. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు.
 ఆయనకు భారత్ అంటే అభిమానం. 2006లో భారత గణతంత్ర ఉత్సవాలకు అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సౌదీని సంస్కరణల పథంలో నడిపించిన అబ్దుల్లా మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా వారికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాధినేతల్లో అబ్దుల్లాది మూడో స్థానం. ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
* అబ్దుల్లా మరణించిన నేపథ్యంలో బ్రిటన్ సామ్రాజ్ఞి ఎలిజబెత్-2 ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వయోవృద్ధురాలైన పాలకురాలిగా నిలిచారు.

'ఛార్లీహెబ్డో'పై దాడి

ఫ్రాన్స్‌కు చెందిన వ్యంగ్య రచనల వారపత్రిక 'ఛార్లీహెబ్డో' కార్యాలయంపై 2015 జనవరి 7న అల్‌ఖైదా గ్రూపునకు చెందిన దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దుశ్చర్యలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యారిస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో పత్రిక ప్రధాన సంపాదకుడు, కాలమిస్ట్ స్టీఫెన్ ఛార్బొనైర్,
వ్యంగ్య చిత్రకారులు కాబు, టిగ్నస్, వోలిన్‌స్కీ తదితరులున్నారు. 1970లో ఈ పత్రికను స్థాపించారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు
2006లో ఈ పత్రికపై విమర్శలు వెల్లువెత్తాయి. 2011లోనూ ఇలాంటి ప్రచురణ చేసినందుకు పత్రికపై దాడులు జరిగాయి. ఫ్రాన్స్‌ను సమీప భవిష్యత్తులో ఇస్లామిక్ ప్రభుత్వం పాలిస్తుందని
చెప్పే ఊహాచిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించిన నేపథ్యంలో.. 2015లో దాడి ఘటన చోటు చేసుకుంది. ఛార్లీహెబ్డో వెలువరించిన 1177వ సంచిక వివాదాస్పద రీతిలో ఈ దాడి ఘటనకు కారణమైంది.

మాదిరి ప్రశ్నలు

1. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఖుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్ ఏ దేశంలో ఉంది?
జ: పాకిస్థాన్
2. 'రెటీనైటిస్ పిగ్మెంటోసా' అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది?
జ: కళ్లు
3. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలను ఏటా జనవరిలో ఎక్కడ నిర్వహిస్తారు?
జ: దావోస్
4. 2014 డిసెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య ఎంత?
జ: 139 కోట్లు
5. వన్డే క్రికెట్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ఇటీవల ఎవరు రికార్డులకెక్కారు?
జ: కుమార సంగక్కర
6. ఆఫ్రికన్ యూనియన్ వార్షిక సదస్సును 2015 జనవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: అడీస్ అబాబా
7. రెల్ బ్యాంక్స్ సంస్థ రూపొందించిన.. 2014 సంవత్సరానికి గాను ప్రపంచంలోని అత్యంత విలువైన 50 బ్యాంకుల జాబితాలో చోటు పొందిన (45వ స్థానం) ఏకైక భారతీయ బ్యాంకు ఏది?
జ: హెచ్‌డీఎఫ్‌సీ

Friday, 22 June 2018

VRO ONLINE CLASS 2

VRO ONLINE CLASS
1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
DAY 2
వర్తమానాంశాలు - ప్రాంతీయం -2
ఆరు దశాబ్దాలకు పైగా రెండు తరాల ప్రజలు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు 'బంగారు తెలంగాణ' దిశగా అడుగులు వేస్తోంది. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. రాబోయే తరాలకు రతనాల తెలంగాణను అందించాలని కోటి ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశంపై, అన్ని రకాల పథకాలపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి.
29వ రాష్ట్రం
* 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014' ప్రకారం.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 'అపాయింటెడ్ డే' గా నోటిఫై చేసిన 2014 జూన్ 2న తెలంగాణ, దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
* తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ రెండో తేదీనే తెలంగాణ నూతన ప్రభుత్వం కూడా ఏర్పా టైంది.
తెలంగాణ స్వరూపం
* తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన 'తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్-2015' పుస్తకాన్ని 2014 డిసెంబరు 31న సచివాలయంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. దీని ప్రకారం..
* భౌగోళిక వైశాల్యం - 1,14,840 చ.కి.మీ.లు
* రాష్ట్ర జనాభా - 3,51,93,978
* జిల్లాలు - 10
* రెవెన్యూ డివిజన్లు - 42
* పట్టణ స్థానిక సంస్థలు - 68
(ఇందులో మున్సిపల్ కార్పొరేషన్లు - 6, మున్సిపాలిటీలు - 37, నగరపంచాయితీలు - 25)
* జిల్లా పరిషత్తులు-9 (హైదరాబాద్‌లో జిల్లా పరిషత్ లేదు)
* మండల ప్రజా పరిషత్తులు - 438
* గ్రామ పంచాయతీలు - 8,691
* రెవెన్యూ మండలాలు - 459
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం..
* రాష్ట్రంలో మొత్తం ఓటర్లు - 2,83,15,120
* పురుషులు - 1,44,72,054
* మహిళలు - 1,38,40,715
* మూడో వర్గం - 2,350
పర్యావరణ పరిరక్షణ జోన్
* దేశంలో కొత్తగా అభయారణ్యాల కోసం రెండు ప్రాంతాలను 'పర్యావరణ పరిరక్షణ జోన్'లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఒకటి 'దాద్రానగర్ హవేలీ' కాగా రెండోది తెలంగాణ రాష్ట్రంలోని 'ప్రాణహిత ప్రాంతం'.
* ప్రాణహిత చుట్టూ 5 కి.మీ.ల పరిధి వరకు పర్యావరణ పరిరక్షణ జోన్‌గా ఏర్పాటు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ, ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ప్రధానంగా కృష్ణజింకల కోసం కేటాయిస్తున్నారు.
'రామగుండం' పునరుద్ధరణ
* రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు 3 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
* కరీంగనర్ జిల్లాలో ఇదివరకు మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం స్థానంలో గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను 'రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్' పేరుతో ప్రారంభించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) లు 2015 జనవరి 14న ఒప్పందంపై సంతకాలు చేశాయి.
* ఈ ఒప్పందంపై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి దర్మేంద్ర ప్రథాన్ సంతకాలు చేశారు.
* పునరుద్ధరణ నిర్మాణ పనులు 2016లో ప్రారంభమై, 2018 నాటికి పూర్తవుతాయని అంచనా.
* 'రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ఎరువుల కర్మాగారం పనులు 1971లో ప్రారంభమయ్యాయి. 1980లో వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. 1999 మార్చిలో ఉత్పత్తి నిలిచిపోయింది.
'గ్రేటర్'గా వరంగల్
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని 'గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)'గా మారుస్తూ 2015 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
* తెలంగాణ రాష్ట్రంలో రెండో గ్రేటర్ నగరంగా వరంగల్ ఏర్పాటైంది. మొదటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).
'అప్పా' పేరు మార్పు
* 'అప్పా'గా పేరుగాంచిన 'రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ' పేరును 2015 ఫిబ్రవరిలో ఆర్‌బీవీఆర్ఆర్ (రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి) తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ'గా తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
* రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి నిజాం సంస్థానంలో మొదటి హిందూ కొత్వాల్ (కమిషనర్ ఆఫ్ పోలీస్)గా 1920-1934 మధ్య పనిచేశారు.
లక్ష కోట్ల బడ్జెట్
* 2015 మార్చి 7 - 27 తేదీల మధ్య తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి.
* తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టారు.
* 2015-16 సంవత్సరానికి మొత్తం బడ్టెట్ రూ.1,15,689 కోట్లు.
ప్రణాళికా వ్యయం - రూ.52,383 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - రూ.63,306 కోట్లు
రెవెన్యూ రాబడులు - రూ.94,131.51 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ.93,600.21 కోట్లు
రెవెన్యూ మిగులు - రూ.531.30 కోట్లు
* రాష్ట్రానికి అత్యధిక పన్ను ఆదాయం అమ్మకం పన్ను (వ్యాట్) నుంచి లభిస్తోంది. ఈ ఆదాయం రూ.35,463.39 కోట్లు. రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.3,916.43 కోట్లు, స్టాంపులు, రిజర్వేషన్లు ద్వారా రూ.3,700 కోట్లు సమకూరుతోంది.
* 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.12,823.25 కోట్లు వస్తాయి.
సింగరేణికి 'గోల్డెన్ పీకాక్'
* బొగ్గు గనులు కోసం తవ్వి తీసిన మట్టిని తిరిగి వినయోగించుకోవడంలో పాటించిన విధానాలకు గాను తెలంగాణలోని సింగరేణి సంస్థకు.. 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' ప్రభుత్వానికి చెందిన 'గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ సర్వీస్ అవార్డు - 2015' లభించింది.
టీఎస్‌సీఏబీ ఏర్పాటు
* రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏపీసీవోబీ-ఆప్కాబ్) విభజన పూర్తయి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు బ్యాంకులు ఏర్పడ్డాయి.
* ఆంధ్రప్రదేశ్‌కు 'ఆప్కాబ్' కొనసాగగా, తెలంగాణకు 'తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్‌సీఏబీ)' కొత్తగా ఏర్పాటైంది.
* తొలి ఎండీగా మురళీధర్ నియమితులయ్యారు.
* తొలిఛైర్మన్‌గా 2015 మేలో కె.రవీందర్‌రావు ఎంపికయ్యారు.
'సిట్' ఏర్పాటు
* వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న వికారుద్దీన్ ముఠా(అయిదుగురు)ను 2015 ఏప్రిల్ 7న విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
* ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ఐజీ 'సందీప్ శాండిల్య' ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సౌర విద్యుత్తు విధానం
* తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్తు విధానాన్ని 2015 మే 18న ప్రకటించింది.
ముఖ్యాంశాలు
సింగిల్ విండో విధానంలో అనుమతులు.
ప్రాజెక్టులకు భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు.
ఒక మెగా వాట్‌కు 5 ఎకరాల వరకు సేకరించే వీలు ప్రాజెక్టుకు భూముల కొనుగోళ్లపై 100 శాతం స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు.
అయిదేళ్ల వరకూ ప్రభుత్వం వ్యాట్, జీఎస్‌టీ పన్నులను తిరిగి చెల్లిస్తుంది.
నివాస, వ్యాపార, పారిశ్రామిక భవనాలపై ఏర్పాటుకు చేసుకునే దరఖాస్తులకు 21 రోజుల్లో అనుమతులు.
'స్వచ్ఛ' కార్యక్రమాలు
* స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను 2015 మే 16న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నరుతో కలిసి హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ప్రారంభించారు.
* బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కలిసి 12 గ్రామాల్లో 'స్వచ్ఛ విలేజ్' పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.
దాశరథి రంగాచార్య మరణం
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత అయిన దాశరథి రంగాచార్య 2015 జూన్ 8న హైదరాబాద్‌లో మరణించారు.
* నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులకు తమ్ముడు. ఇతడు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు.
* రంగాచార్య ప్రఖ్యాత రచనలు: చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జీవన యానం(ఆత్మకథ). ఆయన తనరచనల్లో తెలంగాణ జీవన చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించారు.
జెనీవా సదస్సుకు నాయిని
* 2015 జూన్ 11-13 మధ్య జెనీవాలో జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సుకు తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.
* అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
మండల కేంద్రంగా భద్రాచలం
* పోలవరం ముంపు ప్రాంతంలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించడంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల స్వరూపం మారింది.
* ముంపు గ్రామాల విలీనంతో భద్రాచలం, భూర్గంపాడు మండలాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భద్రాచలం మండలంగా మారింది.
పాలమూరు ఎత్తిపోతల పథకం
* భారీ నీటి పారుదల ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు.
* కృష్ణానదిపై నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. (మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలు)
* ప్రాజెక్టు మొత్తం నీటి పరిమాణం 90 టీఎంసీలు. ఇందులో 70 టీఎంసీలు సాగుకు, 20 టీఎంసీలు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు వినియోగిస్తారు.
* ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 35,200 కోట్లు.
'స్థానిక' ప్రతినిధుల వేతనాలు పెంపు
* స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 13న శాసనసభలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణ 'ఐపాస్'
* తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్ - తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)ను 2015 జూన్ 12న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ముఖ్యాంశాలు
భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 150 పారిశ్రామిక వాడలు, 28 సెజ్‌లు.
పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా లక్షా 60 వేల ఎకరాల భూమి.
కోరుకున్న చోట, కావల్సినంత భూమి.
అన్ని పరిశ్రమలుకు 24/7 విధానంలో విద్యుత్తు సరఫరా.
వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ల ద్వారా ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా నీరు.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, రెండు వారాల్లోపు అనుమతులు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్.
పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.
0 శాతం అవినీతి.. 100 శాతం పారదర్శకత
సెల్ఫ్ సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం.. పారిశ్రామికవేత్తలపై విశ్వాసం.
ప్రతి జిల్లాకేంద్రానికి హైదరాబాద్ నుంచి నాలుగు లైన్ల రోడ్లు, హైదరాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు.
* నూతన పారిశ్రామిక విధానం-2015 ప్రకారం పరిశ్రమలను 5 కేటగిరీలుగా విభజించారు. అవి..
1. మెగాప్రాజెక్టులు: రూ. 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు, 100 కంటే ఎక్కువ మందికి ఉపాధి.
2. భారీ పరిశ్రమలు: రూ. 10 కోట్ల నుంచి 200 కోట్ల వరకు పెట్టబడులు.
3. మధ్య తరహా: రూ. 5 కోట్ల నుంచి 10 కోట్ల పెట్టుబడులు.
4. చిన్న తరహా: రూ. 25 లక్షలు నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడులు.
5. సూక్ష్మతరహా: రూ. 25 లక్షలు కంటే తక్కువ స్థాయి.
ఉత్తమ విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 'ఉత్తమ విశ్వవిద్యాలయం' విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైనట్లు 2015 జనవరి 29న రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకుడిగా వ్యవహరించే రాష్ట్రపతి ఉత్తమ యూనివర్సిటీ, నవీకరణ, పరిశోధన విభాగాల్లో వాటికి 'విజిటర్స్ అవార్డులు' అందజేస్తారు.
* 2015 ఏప్రిల్‌లో హెచ్‌సీయూకి కులపతిగా ఆర్‌బీఐ మాజీ గవర్నరు డాక్టర్ సి.రంగరాజన్ నియమితులయ్యారు.
వర్తమానాంశాలు - జాతీయం - 2
టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జాతీయ వర్తమాన అంశాలపై మంచి పట్టు సాధించాలి. జనరల్ స్టడీస్‌లో వారంతా మెరుగైన విజ్ఞానం సాధించేందుకు - 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రముఖులు పొందిన అవార్డులు.. తదితర ప్రధాన అంశాల సమాహారం.
ఉక్కు ఉత్పత్తిలో నాలుగో స్థానం
ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 2014లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2014లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన దేశాల వివరాలివి..
ఆడపిల్లలకు అండగా..
బాలికల సంక్షేమం, లింగ వివక్షను అరికట్టడమే లక్ష్యాలుగా 'బేటీ బచావో బేటి పఢావో' (కుమార్తెను కాపాడండి, కుమార్తెను చదివించండి) అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న.. స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన హరియాణాలోని పానిపట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు.
* 'బేటీ బచావో బేటీ పఢావో' కార్యక్రమం కింద 'సుకన్య సమృద్ధి యోజన'ను బాలికల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికింద పదేళ్లలోపు బాలికల పేరిట కనిష్ఠంగా రూ. 1000 మొత్తాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాను తెరవొచ్చు. ఈ ఖాతాలో జమచేసే సొమ్ముపై ఏటా 9.1 శాతం వడ్డీ, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులు, వివాహ వ్యయం కోసం ఖాతాలోని సగం మొత్తాన్ని తీసుకోవచ్చు. అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చే వరకూ లేదా వివాహం జరిగే వరకూ (18 ఏళ్ల తర్వాతే) ఈ ఖాతా కొనసాగుతుంది.
పద్మ పురస్కారాలు
* విభిన్న రంగాలకు చెందిన మొత్తం 104 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ ప్రకటించింది. ఎల్‌కే అడ్వాణీ, అమితాబ్ బచ్చన్, ప్రకాశ్‌సింగ్ బాదల్, డాక్టర్ వీరేంద్ర హెగ్డే, జగద్గురు రామభద్రాచార్య, ప్రొఫెసర్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్, కొట్టాయన్ కె.వేణుగోపాల్, కరీం అల్ హుస్సేనీ ఆగాఖాన్, మహ్మద్ యూసఫ్ ఖాన్ (బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్)లు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
2 కోట్ల మరుగుదొడ్లు
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రెండు కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) దీన్ని అనుసంధానిస్తారు. 2019 నాటికి దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా చూడటం లక్ష్యం. ఈ పథకం అమలుకు ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పనిచేస్తున్న అక్షరాస్యులైన మహిళలను ప్రభుత్వం ఎంపికచేసి పారిశుద్ధ్యానికి సంబంధించి వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తుంది. వారు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించడంతోపాటు వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
వృద్ధిరేటు 6.9 శాతం
2013-14లో భారత వృద్ధిరేటును 6.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. అంతకు ముందు 4.7 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలను లెక్కకట్టేందుకు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2011-12 ఏడాదికి సవరించడంతో వృద్ధిరేటులో మార్పు వచ్చింది. ప్రస్తుత ప్రాతిపదిక సంవత్సరమైన 2004-05 స్థానంలో 2011-12ను ఎంచుకోవడంతో 2013-14 వృద్ధిలో 4.7 శాతం నుంచి 6.9 శాతానికి చేరింది. ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రాతిపదికలో మార్పు చేస్తుంటారు. 2012-13కి కూడా ఆర్థిక వృద్ధిరేటును అంతక్రితం అంచనా వేసిన 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించారు.
అగ్ని-V క్షిపణి ప్రయోగం
దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేస్తూ భారత్ అణ్వస్త్ర సామర్థ్య అగ్ని-V క్షిపణిని 2015 జనవరి 31న ఒడిశాలోని వీలర్స్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 5 వేల కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని తొలిసారిగా గొట్టపు కవచం (క్యానిస్టర్) నుంచి ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన అగ్ని-V క్షిపణి టన్నుకు పైగా 'అణు వార్‌హెడ్'ను మోసుకెళ్లగలదు. 'అగ్ని-V 'ను పరీక్షించడం ఇది మూడోసారి. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు, బరువు 50 టన్నులు. మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మ్యాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు - అంటే దాదాపు గంటకు 30 వేల కి.మీ.ల వేగం) దూసుకెళుతుంది.
దిల్లీ పీఠంపై అరవింద్ కేజ్రీవాల్
2015 ఫిబ్రవరి 7న జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలను ఈ పార్టీ గెల్చుకుంది. మిగిలిన 3 స్థానాలను భాజపా దక్కించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
* 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ దిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు 2013 డిసెంబరు 28 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకు 49 రోజుల పాటు దిల్లీ సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్ జన్ లోక్‌పాల్ బిల్లును దిల్లీ శాసనసభలో భాజపా, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఎన్నికల్లో గెలుపొంది సీఎం పదవి చేపట్టారు.
మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనం
వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు వాహనాలకు వినియోగించే పెట్రోలు, డీజిల్‌ను మరింత శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2005 ఏప్రిల్ నుంచి భారత్-3 ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 2010 ఏప్రిల్ నుంచి కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న హైదరాబాద్ సహా 13 మెట్రోనగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. తాజాగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అనిల్ బజ్జాల్ కమిటీ
కంపెనీల చట్టం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలను కంపెనీలు సరిగ్గా అమలు చేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 2015 ఫిబ్రవరిలో హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ బజ్జాల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.
బాలచంద్ర నెమడేకు జ్ఞాన్‌పీఠ్
ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమడే 2014 సంవత్సరానికి జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇది 50వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు. ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, సన్మానపత్రంతో గౌరవిస్తారు. నెమడే 1991లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సు
2015 ఫిబ్రవరిలో 15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సును దిల్లీలో నిర్వహించారు. ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి లారెంట్ ఫేబియస్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీవోపీ-21) అధ్యక్షుడిగా లారెంట్ ఫేబియస్ వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గెర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
మైనర్ ఖనిజాలు 55
మైనర్ ఖనిజాల జాబితాలో మరో 31 ఖనిజాలను చేర్చాలని 2015 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో క్యాల్సైట్, చాక్, చైనా క్లే, కోరండం, డోలమైట్, ఫెల్సైట్, జిప్సం, మైకా, క్వార్ట్జ్, క్వార్త్ట్జెట్ తదితర ఖనిజాలున్నాయి. ఇవి ఫిబ్రవరి నాటికి మేజర్ ఖనిజాల జాబితాలో ఉన్నాయి. ఈ 31 ఖనిజాల లీజులు.. మొత్తం లీజుల్లో 55 శాతం వరకు ఉన్నాయి. మొత్తం లీజు ప్రాంతంలో వీటి వాటా 60 శాతం వరకు ఉంది.
* రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వడం, దేశంలో ఖనిజాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31 ఖనిజాలను చేర్చడంతో మైనర్ ఖనిజాల జాబితాలోని ఖనిజాల సంఖ్య 55కి చేరింది.
నీతి ఆయోగ్ తొలి సమావేశం
2015 ఫిబ్రవరి 8న నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీ దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. 'సబ్ కా సాథ్.. సబ్‌కా వికాస్' (అందరితో కలిసి.. అందరి వికాసం కోసం) అనే నినాదంతో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని మోదీ పిలుపునిచ్చారు.
* నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో మూడు ఉప బృందాలను మోదీ నియమించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో అమల్లో ఉన్న 66 పథకాల్లో ఏవి కొనసాగించాలి? ఏ పథకాలను రాష్ట్రాలకు అప్పగించాలి? వేటిని పూర్తిగా రద్దు చేయవచ్చు? అనే అంశాలను 'ఉపబృందం-1' అధ్యయనం చేస్తుంది.
* రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై 'ఉపబృందం-2' అధ్యయనం చేస్తుంది.
* స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా వ్యవస్థాగతమైన కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా 'ఉపబృందం-3' పనిచేస్తుంది.
అమర్త్యసేన్‌కు జాన్ మైనార్డ్ కేన్స్ అవార్డు
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు మొదటి చార్లెస్టన్ ఈఎఫ్‌జీ 'జాన్ మైనార్డ్ కేన్స్' అవార్డు లభించింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మైనార్డ్ కేన్స్ జ్ఞాపకార్థం ఈ అవార్డును 2015లో ఏర్పాటు చేశారు.
40 శాతం జనాభాకు 'ఆహార భద్రత'
జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్ఎఫ్ఎస్ఏ) 67 శాతం జనాభాకు కాకుండా 40 శాతం జనాభాకు మాత్రమే వర్తింపజేయాలని జాతీయ ఉన్నతస్థాయి కమిటీ 2015 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది. కేవలం 40 శాతం జనాభాకు వర్తింపజేయడంతోనే దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలన్నింటికీ ఈ పథకం అందుతుందని కమిటీ ప్రకటించింది. 67 శాతం జనాభాకు కాకుండా 40 శాతానికే ఎన్ఎఫ్ఎస్ఏను వర్తింపజేయడం వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 30,000 కోట్లు ఆదా అవుతుందని కమిటీ వెల్లడించింది. కేంద్ర మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు.
గుర్తుంచుకోండి
* దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో పాటు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం 1954 నుంచి ప్రదానం చేస్తోంది.
* ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ గత అయిదేళ్లుగా వరుసగా నాలుగో స్థానంలోనే నిలుస్తోంది.
* మరాఠీ సాహిత్యరంగంలో జ్ఞాన్‌పీఠ్ అవార్డు గెలుచుకున్న నాలుగో రచయిత బాలచంద్ర నెమడే.
* 'బేటీ బచావో బేటి పఢావో' కార్యక్రమానికి ప్రచారకర్తగా ప్రముఖ సినీనటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు.
వర్తమానాంశాలు - అంతర్జాతీయం - 2
టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు అంతర్జాతీయ వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ద్వారా జనరల్ స్టడీస్ విభాగంలో మంచి మార్కులు సంపాదించవచ్చు. 2015లో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ఎన్నికలు.. గ్రీస్ సంక్షోభం.. ప్రముఖ దేశాల్లో మోదీ పర్యటన-కీలక ఒప్పందాలు.. నల్లధనం నియంత్రణకు ముందడుగు.. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు.. తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు అందిస్తున్న విశేషాల సమాహారం..
ఏఈవోఐ ఒప్పందం
* స్విస్ బ్యాంకుల్లో చాలా ఏళ్లుగా అక్రమ సంపద నిల్వలు పెరిగిపోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంకింగ్ రహస్యాల రక్షణ విషయమై ప్రపంచ స్థాయిలో స్విట్జర్లాండ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో 2015 మేలో తొలిసారిగా యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వయం చాలక సమాచార మార్పిడి ఒప్పందాన్ని (ఏఈవోఐ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నల్లధనాన్ని నిరోధించే ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది.
* ఈ ఒప్పందం 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఈయూ సభ్యదేశాలు.. తమ దేశీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాదారుల పేర్లు, చిరునామాలు, పన్ను గుర్తింపు సంఖ్యలు, పుట్టిన తేదీల లాంటి వివరాలను వార్షిక ప్రాతిపదికన అందుకుంటాయి. భారత్ సహా సుమారు వంద దేశాలు ప్రపంచ 'ఏఈవోఐ ఫ్రేమ్‌వర్క్‌'లో ఇప్పటికే భాగస్వాములయ్యాయి. ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం.
యూకే ఎన్నికలు
* యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో 56వ పార్లమెంటును ఎన్నుకోవడానికి 2015 మే 7న సాధారణ ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ తిరిగి విజయాన్ని సాధించారు.
* కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 331 స్థానాల్లో విజయం సాధించింది. 1992లో జాన్‌మేజర్ గెలుపు తర్వాత ఒక పార్టీకే పూర్తి ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. ప్రధాన విపక్షం లేబర్‌పార్టీ 232 స్థానాలు పొంది, వరుసగా రెండోసారి పరాజయం పాలైంది.
* బ్రిటన్ నుంచి స్కాట్‌లాండ్ స్వాతంత్య్రానికి అనుకూలంగా నిలిచిన స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్‌పీ) 56 స్థానాలు సాధించింది. అయిదేళ్ల కిందట డేవిడ్ కామెరూన్ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 1812 నుంచి ఆ పదవి చేపట్టినవారిలో అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కారు.
విదేశాల్లో మోదీ
* భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 మేలో చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు.
చైనా పర్యటన
తొలిరోజు నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వస్థలం షియన్ నగరానికి వెళ్లారు. రాజధాని బీజింగ్‌కు వెలుపల చైనా అధ్యక్షుడు ఒక విదేశీ నేతకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 'ప్రఖ్యాత గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్‌'లో చైనా ప్రధాని లీకెక్వియాంగ్‌తో సమావేశమయ్యారు.
* భారత్, చైనాల మధ్య 24 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రైల్వేలు, గనులు, అంతరిక్షం, భూకంప శాస్త్రం, ఇంజినీరింగ్, పర్యటకం, విద్యారంగాల్లో పరస్పర సహకారం, సోదర నగరాల నిర్మాణం, చెంగ్డు, చెన్నైలలో రాయబార కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించినవి ఉన్నాయి.
మంగోలియా పర్యటన
మంగోలియా రాజధాని ఉలాన్ బటార్‌లో మోదీ ఆ దేశ ప్రధాని చిమేద్ సైఖాన్ బిలెగ్‌తో, అధ్యక్షుడు సాఖియాగిన్ ఎల్బెగ్ డోర్జ్‌తోనూ విడివిడిగా సమావేశమయ్యారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం మంగోలియాకు వంద కోట్ల డాలర్ల రుణాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. రక్షణ సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. మంగోలియా పార్లమెంటు 'స్టేట్‌గ్రేట్ హురల్‌'ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత ప్రధాని మంగోలియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
దక్షిణ కొరియా పర్యటన
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దేశాధ్యక్షురాలు పార్క్ గుయెన్‌హైతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే తమ దేశ కంపెనీలకు 1000 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది.
* భారత్, దక్షిణ కొరియాల మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ద్వంద్వ పన్నుల నిరోధక సవరణ ఒప్పందం ముఖ్యమైంది. దృశ్య శ్రవణ సంయుక్త నిర్మాణ ఒప్పందం, విమాన రాకపోకల విస్తరణ ఒప్పందం, విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా; రోడ్డు రవాణా, నౌకాయానం, నౌకాశ్రయాల నిర్వహణ ఒప్పందాలు ఉన్నాయి.
'అనారోగ్య' ప్రపంచం
* 'ప్రపంచ వ్యాధుల పీడిత అధ్యయనం - 2013' నివేదిక ప్రకారం ప్రపంచంలో 95 శాతం కంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 33 శాతం కంటే ఎక్కువ మందిని 5 కంటే ఎక్కువ రుగ్మతలు బాధిస్తున్నట్లు తేలింది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఏ అనారోగ్యం లేకుండా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
* వెన్నునొప్పి, కుంగుబాటు, ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, మెడనొప్పి, వయసు పైబడటంతో వచ్చే వినికిడి లోపాలు తదితర సమస్యలు ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి.
* 188 దేశాల ప్రజల సమాచారాన్ని ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
భారత్-బంగ్లా చారిత్రక ఒప్పందం
* 2015 జూన్ 6, 7 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చలు జరిపారు. చారిత్రక భూ సరిహద్దు ఒప్పందం పత్రాలను వీరి సమక్షంలో అధికారులు మార్చుకున్నారు.
* భారత్, బంగ్లాదేశ్‌లు 22 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తీర ప్రాంత రక్షణ, మనుషుల అక్రమ రవాణాను అరికట్టడం, నకిలీ భారత కరెన్సీని అడ్డుకోవడం, భారత ఆర్థికమండలి ఏర్పాటు.. తదితర అంశాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి.
* బంగ్లాకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5,128 కోట్ల రుణాన్ని, రూ.1,282 కోట్ల గ్రాంటును వీలైనంత త్వరగా అందేలా చూస్తామని మోదీ ప్రకటించారు. కొత్తగా రూ.12,823 కోట్ల రుణ సాయాన్ని ప్రకటించారు.
ఇరాన్ అణు ఒప్పందం
* 2015 జులై 14న ఇరాన్, ఆరు ప్రధాన దేశాల మధ్య వియన్నాలో అణు ఒప్పందం కుదిరింది. ఇరాన్ అణుశక్తిని, కార్యక్రమాన్ని పరిమితం చేస్తూ, అణుబాంబు పొందకుండా నిరోధించాలనే లక్ష్యంతో కుదిరిన ఈ ఒప్పందంతో దశాబ్దాల కాలంగా పాశ్చాత్య దేశాలతో కొనసాగుతున్న ఇరాన్ వైరానికి తెరపడనుంది.
* అమెరికా సారథ్యంలో 'పీ5+1' గా పిలిచే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా (ఐరాస భద్రతమండలిలోని 5 శాశ్వత సభ్యదేశాలు); జర్మనీ దేశాలు.. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో ఇరాన్ అణు కార్యక్రమాలపై కనీసం దశాబ్దం పాటు కఠిన పరిమితులుంటాయి. ప్రపంచ దేశాలతో పాటు ఐరాస పరిశీలన కొనసాగుతుంది. ఐరాస అణు సంస్థను తన సైనిక స్థావరాల్లో తనిఖీకి ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ తన 'సెంట్రిఫ్యూజ్' యంత్రాలను 19 వేల నుంచి 6,104కు తగ్గించాల్సి ఉంటుంది. ఇరాన్ చమురు ఎగుమతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేస్తారు.
ఉఫాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
* 2015 జులై 9న రష్యాలోని ఉఫాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదంపై ఎలాంటి వివక్షలేని పోరాటం జరగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ఆర్థికరంగం బలంగా లేదనీ, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సంక్షోభం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు.
* బ్రిక్స్ దేశాల మధ్య బలమైన బంధాల కోసం మోదీ పది చర్యలను 'దస్ కదమ్ (భవిత కోసం పది అడుగులు)' పేరుతో ప్రతిపాదించారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు పాల్గొన్నారు.
గ్రీస్ ప్రధాని రాజీనామా
* గ్రీస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ 2015 ఆగస్టు 20న తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి వర్గాన్ని రద్దు చేశారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
* గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపాలస్.
గ్రీస్ ఆర్థిక సంక్షోభం
* ఆర్థిక సహకార (బెయిలవుట్) ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు అంగీకరించాలంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించారు. ఈ అంశానికి సంబంధించి దేశంలో జులై 6న జరిగిన రెఫరెండమ్‌లో ఉద్దీపన షరతులకు 61.31 శాతం మంది వ్యతిరేకంగా, 38.69 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
* అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ జూన్ 30న ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి డిఫాల్ట్ అయ్యింది. దీంతో ఐఎంఎఫ్ గ్రీస్‌ను 'ఎగవేతదారు'గా ప్రకటించింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో గ్రీస్ తొలి ఎగవేతదారుగా నిలిచింది.
* ఆర్థిక సహకార ఒప్పందం కోసం ఐరోపా రుణ దాతలు కఠిన షరతులను పెడుతున్నారని, వాటిని తిరస్కరించాలని దేశ ప్రజలను కోరి రెఫరెండమ్‌కు వెళ్లిన దేశ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తిరిగి వాటికే మొగ్గు చూపారు. షరతులను తిరస్కరిస్తే దేశం మరింత సంక్షోభంలోకి వెళుతుందని, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, యూరోజోన్ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిసి కూడా మెజార్టీ ప్రజలు ప్రధాని సిప్రాస్ మాటకే విలువిచ్చి, రెఫరెండమ్ ద్వారా ఐరోపా దేశాలకూ 'నో' అంటూ సమాధానమిచ్చారు. తీరా ఇది జరిగి వారం రోజులు కూడా కాకముందే ఎలాంటి సంస్కరణలనైతే గ్రీస్ వాసులు వద్దన్నారో సరిగ్గా అలాంటి సంస్కరణలకే సిప్రాస్ తలొగ్గి వార్తల్లో నిలిచారు.
* యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజమ్ నుంచి షరతులతో కూడిన 5,350 కోట్ల యూరోల రుణాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ప్రకటించారు.
* యూరో ప్రాంతం నుంచి వైదొలగకుండా ఉండేందుకు గ్రీసు మొగ్గు చూపిన నేపథ్యంలో రుణదాతల కఠిన షరతులకు అంగీకరిస్తూ మూడేళ్ల పాటు 8,600 కోట్ల యూరోల ఉద్దీపన పొందింది. దీనికి సంబంధించి జులై 13న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. 2010 నుంచి ఇప్పటి వరకు గ్రీసు పొందిన ఉద్దీపనల్లో ఇది మూడోది. చారిత్రక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జులై 15 నుంచి గ్రీసు కఠిన షరతులను అమలు చేయాల్సి వచ్చింది.
SOURCE eenadu

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు