VRO ONLINE CLASS
1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
DAY 2
వర్తమానాంశాలు - ప్రాంతీయం -2
ఆరు దశాబ్దాలకు పైగా రెండు తరాల ప్రజలు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు 'బంగారు తెలంగాణ' దిశగా అడుగులు వేస్తోంది. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. రాబోయే తరాలకు రతనాల తెలంగాణను అందించాలని కోటి ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశంపై, అన్ని రకాల పథకాలపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి.
29వ రాష్ట్రం
* 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014' ప్రకారం.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 'అపాయింటెడ్ డే' గా నోటిఫై చేసిన 2014 జూన్ 2న తెలంగాణ, దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
* తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ రెండో తేదీనే తెలంగాణ నూతన ప్రభుత్వం కూడా ఏర్పా టైంది.
తెలంగాణ స్వరూపం
* తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన 'తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్-2015' పుస్తకాన్ని 2014 డిసెంబరు 31న సచివాలయంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. దీని ప్రకారం..
* భౌగోళిక వైశాల్యం - 1,14,840 చ.కి.మీ.లు
* రాష్ట్ర జనాభా - 3,51,93,978
* జిల్లాలు - 10
* రెవెన్యూ డివిజన్లు - 42
* పట్టణ స్థానిక సంస్థలు - 68
(ఇందులో మున్సిపల్ కార్పొరేషన్లు - 6, మున్సిపాలిటీలు - 37, నగరపంచాయితీలు - 25)
* జిల్లా పరిషత్తులు-9 (హైదరాబాద్‌లో జిల్లా పరిషత్ లేదు)
* మండల ప్రజా పరిషత్తులు - 438
* గ్రామ పంచాయతీలు - 8,691
* రెవెన్యూ మండలాలు - 459
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం..
* రాష్ట్రంలో మొత్తం ఓటర్లు - 2,83,15,120
* పురుషులు - 1,44,72,054
* మహిళలు - 1,38,40,715
* మూడో వర్గం - 2,350
పర్యావరణ పరిరక్షణ జోన్
* దేశంలో కొత్తగా అభయారణ్యాల కోసం రెండు ప్రాంతాలను 'పర్యావరణ పరిరక్షణ జోన్'లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఒకటి 'దాద్రానగర్ హవేలీ' కాగా రెండోది తెలంగాణ రాష్ట్రంలోని 'ప్రాణహిత ప్రాంతం'.
* ప్రాణహిత చుట్టూ 5 కి.మీ.ల పరిధి వరకు పర్యావరణ పరిరక్షణ జోన్‌గా ఏర్పాటు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ, ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ప్రధానంగా కృష్ణజింకల కోసం కేటాయిస్తున్నారు.

'రామగుండం' పునరుద్ధరణ
* రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు 3 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
* కరీంగనర్ జిల్లాలో ఇదివరకు మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం స్థానంలో గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను 'రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్' పేరుతో ప్రారంభించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) లు 2015 జనవరి 14న ఒప్పందంపై సంతకాలు చేశాయి.
* ఈ ఒప్పందంపై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి దర్మేంద్ర ప్రథాన్ సంతకాలు చేశారు.
* పునరుద్ధరణ నిర్మాణ పనులు 2016లో ప్రారంభమై, 2018 నాటికి పూర్తవుతాయని అంచనా.
* 'రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ఎరువుల కర్మాగారం పనులు 1971లో ప్రారంభమయ్యాయి. 1980లో వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. 1999 మార్చిలో ఉత్పత్తి నిలిచిపోయింది.

'గ్రేటర్'గా వరంగల్
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని 'గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)'గా మారుస్తూ 2015 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
* తెలంగాణ రాష్ట్రంలో రెండో గ్రేటర్ నగరంగా వరంగల్ ఏర్పాటైంది. మొదటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).
'అప్పా' పేరు మార్పు
* 'అప్పా'గా పేరుగాంచిన 'రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ' పేరును 2015 ఫిబ్రవరిలో ఆర్‌బీవీఆర్ఆర్ (రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి) తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ'గా తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
* రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి నిజాం సంస్థానంలో మొదటి హిందూ కొత్వాల్ (కమిషనర్ ఆఫ్ పోలీస్)గా 1920-1934 మధ్య పనిచేశారు.

లక్ష కోట్ల బడ్జెట్
* 2015 మార్చి 7 - 27 తేదీల మధ్య తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి.
* తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టారు.
* 2015-16 సంవత్సరానికి మొత్తం బడ్టెట్ రూ.1,15,689 కోట్లు.
ప్రణాళికా వ్యయం - రూ.52,383 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - రూ.63,306 కోట్లు
రెవెన్యూ రాబడులు - రూ.94,131.51 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ.93,600.21 కోట్లు
రెవెన్యూ మిగులు - రూ.531.30 కోట్లు
* రాష్ట్రానికి అత్యధిక పన్ను ఆదాయం అమ్మకం పన్ను (వ్యాట్) నుంచి లభిస్తోంది. ఈ ఆదాయం రూ.35,463.39 కోట్లు. రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.3,916.43 కోట్లు, స్టాంపులు, రిజర్వేషన్లు ద్వారా రూ.3,700 కోట్లు సమకూరుతోంది.
* 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.12,823.25 కోట్లు వస్తాయి.

సింగరేణికి 'గోల్డెన్ పీకాక్'
* బొగ్గు గనులు కోసం తవ్వి తీసిన మట్టిని తిరిగి వినయోగించుకోవడంలో పాటించిన విధానాలకు గాను తెలంగాణలోని సింగరేణి సంస్థకు.. 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్' ప్రభుత్వానికి చెందిన 'గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ సర్వీస్ అవార్డు - 2015' లభించింది.
టీఎస్‌సీఏబీ ఏర్పాటు
* రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏపీసీవోబీ-ఆప్కాబ్) విభజన పూర్తయి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు బ్యాంకులు ఏర్పడ్డాయి.
* ఆంధ్రప్రదేశ్‌కు 'ఆప్కాబ్' కొనసాగగా, తెలంగాణకు 'తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్‌సీఏబీ)' కొత్తగా ఏర్పాటైంది.
* తొలి ఎండీగా మురళీధర్ నియమితులయ్యారు.
* తొలిఛైర్మన్‌గా 2015 మేలో కె.రవీందర్‌రావు ఎంపికయ్యారు.

'సిట్' ఏర్పాటు
* వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న వికారుద్దీన్ ముఠా(అయిదుగురు)ను 2015 ఏప్రిల్ 7న విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
* ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ఐజీ 'సందీప్ శాండిల్య' ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సౌర విద్యుత్తు విధానం
* తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్తు విధానాన్ని 2015 మే 18న ప్రకటించింది.

ముఖ్యాంశాలు
సింగిల్ విండో విధానంలో అనుమతులు.
ప్రాజెక్టులకు భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు.
ఒక మెగా వాట్‌కు 5 ఎకరాల వరకు సేకరించే వీలు ప్రాజెక్టుకు భూముల కొనుగోళ్లపై 100 శాతం స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు.
అయిదేళ్ల వరకూ ప్రభుత్వం వ్యాట్, జీఎస్‌టీ పన్నులను తిరిగి చెల్లిస్తుంది.
నివాస, వ్యాపార, పారిశ్రామిక భవనాలపై ఏర్పాటుకు చేసుకునే దరఖాస్తులకు 21 రోజుల్లో అనుమతులు.

'స్వచ్ఛ' కార్యక్రమాలు
* స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను 2015 మే 16న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నరుతో కలిసి హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ప్రారంభించారు.
* బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కలిసి 12 గ్రామాల్లో 'స్వచ్ఛ విలేజ్' పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.

దాశరథి రంగాచార్య మరణం
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత అయిన దాశరథి రంగాచార్య 2015 జూన్ 8న హైదరాబాద్‌లో మరణించారు.
* నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులకు తమ్ముడు. ఇతడు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు.
* రంగాచార్య ప్రఖ్యాత రచనలు: చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జీవన యానం(ఆత్మకథ). ఆయన తనరచనల్లో తెలంగాణ జీవన చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించారు.

జెనీవా సదస్సుకు నాయిని
* 2015 జూన్ 11-13 మధ్య జెనీవాలో జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సుకు తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.
* అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.

మండల కేంద్రంగా భద్రాచలం
* పోలవరం ముంపు ప్రాంతంలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించడంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల స్వరూపం మారింది.
* ముంపు గ్రామాల విలీనంతో భద్రాచలం, భూర్గంపాడు మండలాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భద్రాచలం మండలంగా మారింది.

పాలమూరు ఎత్తిపోతల పథకం
* భారీ నీటి పారుదల ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు.
* కృష్ణానదిపై నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. (మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలు)
* ప్రాజెక్టు మొత్తం నీటి పరిమాణం 90 టీఎంసీలు. ఇందులో 70 టీఎంసీలు సాగుకు, 20 టీఎంసీలు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు వినియోగిస్తారు.
* ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 35,200 కోట్లు.
'స్థానిక' ప్రతినిధుల వేతనాలు పెంపు
* స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 13న శాసనసభలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణ 'ఐపాస్'
* తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్ - తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)ను 2015 జూన్ 12న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ముఖ్యాంశాలు
భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 150 పారిశ్రామిక వాడలు, 28 సెజ్‌లు.
పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా లక్షా 60 వేల ఎకరాల భూమి.
కోరుకున్న చోట, కావల్సినంత భూమి.
అన్ని పరిశ్రమలుకు 24/7 విధానంలో విద్యుత్తు సరఫరా.
వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ల ద్వారా ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా నీరు.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, రెండు వారాల్లోపు అనుమతులు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్.
పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.
0 శాతం అవినీతి.. 100 శాతం పారదర్శకత
సెల్ఫ్ సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం.. పారిశ్రామికవేత్తలపై విశ్వాసం.
ప్రతి జిల్లాకేంద్రానికి హైదరాబాద్ నుంచి నాలుగు లైన్ల రోడ్లు, హైదరాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు.
* నూతన పారిశ్రామిక విధానం-2015 ప్రకారం పరిశ్రమలను 5 కేటగిరీలుగా విభజించారు. అవి..
1. మెగాప్రాజెక్టులు: రూ. 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు, 100 కంటే ఎక్కువ మందికి ఉపాధి.
2. భారీ పరిశ్రమలు: రూ. 10 కోట్ల నుంచి 200 కోట్ల వరకు పెట్టబడులు.
3. మధ్య తరహా: రూ. 5 కోట్ల నుంచి 10 కోట్ల పెట్టుబడులు.
4. చిన్న తరహా: రూ. 25 లక్షలు నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడులు.
5. సూక్ష్మతరహా: రూ. 25 లక్షలు కంటే తక్కువ స్థాయి.

ఉత్తమ విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 'ఉత్తమ విశ్వవిద్యాలయం' విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైనట్లు 2015 జనవరి 29న రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకుడిగా వ్యవహరించే రాష్ట్రపతి ఉత్తమ యూనివర్సిటీ, నవీకరణ, పరిశోధన విభాగాల్లో వాటికి 'విజిటర్స్ అవార్డులు' అందజేస్తారు.
* 2015 ఏప్రిల్‌లో హెచ్‌సీయూకి కులపతిగా ఆర్‌బీఐ మాజీ గవర్నరు డాక్టర్ సి.రంగరాజన్ నియమితులయ్యారు.

వర్తమానాంశాలు - జాతీయం - 2
టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జాతీయ వర్తమాన అంశాలపై మంచి పట్టు సాధించాలి. జనరల్ స్టడీస్‌లో వారంతా మెరుగైన విజ్ఞానం సాధించేందుకు - 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రముఖులు పొందిన అవార్డులు.. తదితర ప్రధాన అంశాల సమాహారం.
ఉక్కు ఉత్పత్తిలో నాలుగో స్థానం
ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 2014లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2014లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన దేశాల వివరాలివి..

ఆడపిల్లలకు అండగా..
బాలికల సంక్షేమం, లింగ వివక్షను అరికట్టడమే లక్ష్యాలుగా 'బేటీ బచావో బేటి పఢావో' (కుమార్తెను కాపాడండి, కుమార్తెను చదివించండి) అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న.. స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన హరియాణాలోని పానిపట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు.
* 'బేటీ బచావో బేటీ పఢావో' కార్యక్రమం కింద 'సుకన్య సమృద్ధి యోజన'ను బాలికల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికింద పదేళ్లలోపు బాలికల పేరిట కనిష్ఠంగా రూ. 1000 మొత్తాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాను తెరవొచ్చు. ఈ ఖాతాలో జమచేసే సొమ్ముపై ఏటా 9.1 శాతం వడ్డీ, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులు, వివాహ వ్యయం కోసం ఖాతాలోని సగం మొత్తాన్ని తీసుకోవచ్చు. అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చే వరకూ లేదా వివాహం జరిగే వరకూ (18 ఏళ్ల తర్వాతే) ఈ ఖాతా కొనసాగుతుంది.

పద్మ పురస్కారాలు
* విభిన్న రంగాలకు చెందిన మొత్తం 104 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ ప్రకటించింది. ఎల్‌కే అడ్వాణీ, అమితాబ్ బచ్చన్, ప్రకాశ్‌సింగ్ బాదల్, డాక్టర్ వీరేంద్ర హెగ్డే, జగద్గురు రామభద్రాచార్య, ప్రొఫెసర్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్, కొట్టాయన్ కె.వేణుగోపాల్, కరీం అల్ హుస్సేనీ ఆగాఖాన్, మహ్మద్ యూసఫ్ ఖాన్ (బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్)లు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
2 కోట్ల మరుగుదొడ్లు
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రెండు కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) దీన్ని అనుసంధానిస్తారు. 2019 నాటికి దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా చూడటం లక్ష్యం. ఈ పథకం అమలుకు ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పనిచేస్తున్న అక్షరాస్యులైన మహిళలను ప్రభుత్వం ఎంపికచేసి పారిశుద్ధ్యానికి సంబంధించి వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తుంది. వారు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించడంతోపాటు వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
వృద్ధిరేటు 6.9 శాతం
2013-14లో భారత వృద్ధిరేటును 6.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. అంతకు ముందు 4.7 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలను లెక్కకట్టేందుకు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2011-12 ఏడాదికి సవరించడంతో వృద్ధిరేటులో మార్పు వచ్చింది. ప్రస్తుత ప్రాతిపదిక సంవత్సరమైన 2004-05 స్థానంలో 2011-12ను ఎంచుకోవడంతో 2013-14 వృద్ధిలో 4.7 శాతం నుంచి 6.9 శాతానికి చేరింది. ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రాతిపదికలో మార్పు చేస్తుంటారు. 2012-13కి కూడా ఆర్థిక వృద్ధిరేటును అంతక్రితం అంచనా వేసిన 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించారు.

అగ్ని-V క్షిపణి ప్రయోగం
దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేస్తూ భారత్ అణ్వస్త్ర సామర్థ్య అగ్ని-V క్షిపణిని 2015 జనవరి 31న ఒడిశాలోని వీలర్స్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 5 వేల కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని తొలిసారిగా గొట్టపు కవచం (క్యానిస్టర్) నుంచి ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన అగ్ని-V క్షిపణి టన్నుకు పైగా 'అణు వార్‌హెడ్'ను మోసుకెళ్లగలదు. 'అగ్ని-V 'ను పరీక్షించడం ఇది మూడోసారి. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు, బరువు 50 టన్నులు. మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మ్యాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు - అంటే దాదాపు గంటకు 30 వేల కి.మీ.ల వేగం) దూసుకెళుతుంది.
దిల్లీ పీఠంపై అరవింద్ కేజ్రీవాల్
2015 ఫిబ్రవరి 7న జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలను ఈ పార్టీ గెల్చుకుంది. మిగిలిన 3 స్థానాలను భాజపా దక్కించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
* 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ దిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు 2013 డిసెంబరు 28 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకు 49 రోజుల పాటు దిల్లీ సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్ జన్ లోక్‌పాల్ బిల్లును దిల్లీ శాసనసభలో భాజపా, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఎన్నికల్లో గెలుపొంది సీఎం పదవి చేపట్టారు.

మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనం
వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు వాహనాలకు వినియోగించే పెట్రోలు, డీజిల్‌ను మరింత శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2005 ఏప్రిల్ నుంచి భారత్-3 ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 2010 ఏప్రిల్ నుంచి కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న హైదరాబాద్ సహా 13 మెట్రోనగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. తాజాగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అనిల్ బజ్జాల్ కమిటీ
కంపెనీల చట్టం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలను కంపెనీలు సరిగ్గా అమలు చేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 2015 ఫిబ్రవరిలో హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ బజ్జాల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.
బాలచంద్ర నెమడేకు జ్ఞాన్‌పీఠ్
ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమడే 2014 సంవత్సరానికి జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇది 50వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు. ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, సన్మానపత్రంతో గౌరవిస్తారు. నెమడే 1991లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సు
2015 ఫిబ్రవరిలో 15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సును దిల్లీలో నిర్వహించారు. ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి లారెంట్ ఫేబియస్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీవోపీ-21) అధ్యక్షుడిగా లారెంట్ ఫేబియస్ వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గెర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
మైనర్ ఖనిజాలు 55
మైనర్ ఖనిజాల జాబితాలో మరో 31 ఖనిజాలను చేర్చాలని 2015 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో క్యాల్సైట్, చాక్, చైనా క్లే, కోరండం, డోలమైట్, ఫెల్సైట్, జిప్సం, మైకా, క్వార్ట్జ్, క్వార్త్ట్జెట్ తదితర ఖనిజాలున్నాయి. ఇవి ఫిబ్రవరి నాటికి మేజర్ ఖనిజాల జాబితాలో ఉన్నాయి. ఈ 31 ఖనిజాల లీజులు.. మొత్తం లీజుల్లో 55 శాతం వరకు ఉన్నాయి. మొత్తం లీజు ప్రాంతంలో వీటి వాటా 60 శాతం వరకు ఉంది.
* రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వడం, దేశంలో ఖనిజాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31 ఖనిజాలను చేర్చడంతో మైనర్ ఖనిజాల జాబితాలోని ఖనిజాల సంఖ్య 55కి చేరింది.

నీతి ఆయోగ్ తొలి సమావేశం
2015 ఫిబ్రవరి 8న నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీ దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. 'సబ్ కా సాథ్.. సబ్‌కా వికాస్' (అందరితో కలిసి.. అందరి వికాసం కోసం) అనే నినాదంతో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని మోదీ పిలుపునిచ్చారు.
* నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో మూడు ఉప బృందాలను మోదీ నియమించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో అమల్లో ఉన్న 66 పథకాల్లో ఏవి కొనసాగించాలి? ఏ పథకాలను రాష్ట్రాలకు అప్పగించాలి? వేటిని పూర్తిగా రద్దు చేయవచ్చు? అనే అంశాలను 'ఉపబృందం-1' అధ్యయనం చేస్తుంది.
* రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై 'ఉపబృందం-2' అధ్యయనం చేస్తుంది.
* స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా వ్యవస్థాగతమైన కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా 'ఉపబృందం-3' పనిచేస్తుంది.

అమర్త్యసేన్‌కు జాన్ మైనార్డ్ కేన్స్ అవార్డు
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు మొదటి చార్లెస్టన్ ఈఎఫ్‌జీ 'జాన్ మైనార్డ్ కేన్స్' అవార్డు లభించింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మైనార్డ్ కేన్స్ జ్ఞాపకార్థం ఈ అవార్డును 2015లో ఏర్పాటు చేశారు.
40 శాతం జనాభాకు 'ఆహార భద్రత'
జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్ఎఫ్ఎస్ఏ) 67 శాతం జనాభాకు కాకుండా 40 శాతం జనాభాకు మాత్రమే వర్తింపజేయాలని జాతీయ ఉన్నతస్థాయి కమిటీ 2015 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది. కేవలం 40 శాతం జనాభాకు వర్తింపజేయడంతోనే దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలన్నింటికీ ఈ పథకం అందుతుందని కమిటీ ప్రకటించింది. 67 శాతం జనాభాకు కాకుండా 40 శాతానికే ఎన్ఎఫ్ఎస్ఏను వర్తింపజేయడం వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 30,000 కోట్లు ఆదా అవుతుందని కమిటీ వెల్లడించింది. కేంద్ర మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు.
గుర్తుంచుకోండి
గుర్తుంచుకోండి
* దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో పాటు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం 1954 నుంచి ప్రదానం చేస్తోంది.
* ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ గత అయిదేళ్లుగా వరుసగా నాలుగో స్థానంలోనే నిలుస్తోంది.
* మరాఠీ సాహిత్యరంగంలో జ్ఞాన్‌పీఠ్ అవార్డు గెలుచుకున్న నాలుగో రచయిత బాలచంద్ర నెమడే.
* 'బేటీ బచావో బేటి పఢావో' కార్యక్రమానికి ప్రచారకర్తగా ప్రముఖ సినీనటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు.

వర్తమానాంశాలు - అంతర్జాతీయం - 2
టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు అంతర్జాతీయ వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ద్వారా జనరల్ స్టడీస్ విభాగంలో మంచి మార్కులు సంపాదించవచ్చు. 2015లో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ఎన్నికలు.. గ్రీస్ సంక్షోభం.. ప్రముఖ దేశాల్లో మోదీ పర్యటన-కీలక ఒప్పందాలు.. నల్లధనం నియంత్రణకు ముందడుగు.. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు.. తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు అందిస్తున్న విశేషాల సమాహారం..
ఏఈవోఐ ఒప్పందం
* స్విస్ బ్యాంకుల్లో చాలా ఏళ్లుగా అక్రమ సంపద నిల్వలు పెరిగిపోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంకింగ్ రహస్యాల రక్షణ విషయమై ప్రపంచ స్థాయిలో స్విట్జర్లాండ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో 2015 మేలో తొలిసారిగా యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వయం చాలక సమాచార మార్పిడి ఒప్పందాన్ని (ఏఈవోఐ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నల్లధనాన్ని నిరోధించే ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది.
* ఈ ఒప్పందం 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఈయూ సభ్యదేశాలు.. తమ దేశీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాదారుల పేర్లు, చిరునామాలు, పన్ను గుర్తింపు సంఖ్యలు, పుట్టిన తేదీల లాంటి వివరాలను వార్షిక ప్రాతిపదికన అందుకుంటాయి. భారత్ సహా సుమారు వంద దేశాలు ప్రపంచ 'ఏఈవోఐ ఫ్రేమ్‌వర్క్'లో ఇప్పటికే భాగస్వాములయ్యాయి. ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం.

యూకే ఎన్నికలు
* యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో 56వ పార్లమెంటును ఎన్నుకోవడానికి 2015 మే 7న సాధారణ ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ తిరిగి విజయాన్ని సాధించారు.
* కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 331 స్థానాల్లో విజయం సాధించింది. 1992లో జాన్‌మేజర్ గెలుపు తర్వాత ఒక పార్టీకే పూర్తి ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. ప్రధాన విపక్షం లేబర్‌పార్టీ 232 స్థానాలు పొంది, వరుసగా రెండోసారి పరాజయం పాలైంది.
* బ్రిటన్ నుంచి స్కాట్‌లాండ్ స్వాతంత్య్రానికి అనుకూలంగా నిలిచిన స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్‌పీ) 56 స్థానాలు సాధించింది. అయిదేళ్ల కిందట డేవిడ్ కామెరూన్ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 1812 నుంచి ఆ పదవి చేపట్టినవారిలో అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కారు.

విదేశాల్లో మోదీ
* భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 మేలో చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు.

చైనా పర్యటన
తొలిరోజు నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వస్థలం షియన్ నగరానికి వెళ్లారు. రాజధాని బీజింగ్‌కు వెలుపల చైనా అధ్యక్షుడు ఒక విదేశీ నేతకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 'ప్రఖ్యాత గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్'లో చైనా ప్రధాని లీకెక్వియాంగ్‌తో సమావేశమయ్యారు.
* భారత్, చైనాల మధ్య 24 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రైల్వేలు, గనులు, అంతరిక్షం, భూకంప శాస్త్రం, ఇంజినీరింగ్, పర్యటకం, విద్యారంగాల్లో పరస్పర సహకారం, సోదర నగరాల నిర్మాణం, చెంగ్డు, చెన్నైలలో రాయబార కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించినవి ఉన్నాయి.

మంగోలియా పర్యటన
మంగోలియా రాజధాని ఉలాన్ బటార్‌లో మోదీ ఆ దేశ ప్రధాని చిమేద్ సైఖాన్ బిలెగ్‌తో, అధ్యక్షుడు సాఖియాగిన్ ఎల్బెగ్ డోర్జ్‌తోనూ విడివిడిగా సమావేశమయ్యారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం మంగోలియాకు వంద కోట్ల డాలర్ల రుణాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. రక్షణ సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. మంగోలియా పార్లమెంటు 'స్టేట్‌గ్రేట్ హురల్'ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత ప్రధాని మంగోలియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

దక్షిణ కొరియా పర్యటన
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దేశాధ్యక్షురాలు పార్క్ గుయెన్‌హైతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే తమ దేశ కంపెనీలకు 1000 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది.
* భారత్, దక్షిణ కొరియాల మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ద్వంద్వ పన్నుల నిరోధక సవరణ ఒప్పందం ముఖ్యమైంది. దృశ్య శ్రవణ సంయుక్త నిర్మాణ ఒప్పందం, విమాన రాకపోకల విస్తరణ ఒప్పందం, విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా; రోడ్డు రవాణా, నౌకాయానం, నౌకాశ్రయాల నిర్వహణ ఒప్పందాలు ఉన్నాయి.

'అనారోగ్య' ప్రపంచం
* 'ప్రపంచ వ్యాధుల పీడిత అధ్యయనం - 2013' నివేదిక ప్రకారం ప్రపంచంలో 95 శాతం కంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 33 శాతం కంటే ఎక్కువ మందిని 5 కంటే ఎక్కువ రుగ్మతలు బాధిస్తున్నట్లు తేలింది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఏ అనారోగ్యం లేకుండా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
* వెన్నునొప్పి, కుంగుబాటు, ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, మెడనొప్పి, వయసు పైబడటంతో వచ్చే వినికిడి లోపాలు తదితర సమస్యలు ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి.
* 188 దేశాల ప్రజల సమాచారాన్ని ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

భారత్-బంగ్లా చారిత్రక ఒప్పందం
* 2015 జూన్ 6, 7 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చలు జరిపారు. చారిత్రక భూ సరిహద్దు ఒప్పందం పత్రాలను వీరి సమక్షంలో అధికారులు మార్చుకున్నారు.
* భారత్, బంగ్లాదేశ్‌లు 22 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తీర ప్రాంత రక్షణ, మనుషుల అక్రమ రవాణాను అరికట్టడం, నకిలీ భారత కరెన్సీని అడ్డుకోవడం, భారత ఆర్థికమండలి ఏర్పాటు.. తదితర అంశాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి.
* బంగ్లాకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5,128 కోట్ల రుణాన్ని, రూ.1,282 కోట్ల గ్రాంటును వీలైనంత త్వరగా అందేలా చూస్తామని మోదీ ప్రకటించారు. కొత్తగా రూ.12,823 కోట్ల రుణ సాయాన్ని ప్రకటించారు.

ఇరాన్ అణు ఒప్పందం
* 2015 జులై 14న ఇరాన్, ఆరు ప్రధాన దేశాల మధ్య వియన్నాలో అణు ఒప్పందం కుదిరింది. ఇరాన్ అణుశక్తిని, కార్యక్రమాన్ని పరిమితం చేస్తూ, అణుబాంబు పొందకుండా నిరోధించాలనే లక్ష్యంతో కుదిరిన ఈ ఒప్పందంతో దశాబ్దాల కాలంగా పాశ్చాత్య దేశాలతో కొనసాగుతున్న ఇరాన్ వైరానికి తెరపడనుంది.
* అమెరికా సారథ్యంలో 'పీ5+1' గా పిలిచే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా (ఐరాస భద్రతమండలిలోని 5 శాశ్వత సభ్యదేశాలు); జర్మనీ దేశాలు.. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో ఇరాన్ అణు కార్యక్రమాలపై కనీసం దశాబ్దం పాటు కఠిన పరిమితులుంటాయి. ప్రపంచ దేశాలతో పాటు ఐరాస పరిశీలన కొనసాగుతుంది. ఐరాస అణు సంస్థను తన సైనిక స్థావరాల్లో తనిఖీకి ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ తన 'సెంట్రిఫ్యూజ్' యంత్రాలను 19 వేల నుంచి 6,104కు తగ్గించాల్సి ఉంటుంది. ఇరాన్ చమురు ఎగుమతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేస్తారు.

ఉఫాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
* 2015 జులై 9న రష్యాలోని ఉఫాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదంపై ఎలాంటి వివక్షలేని పోరాటం జరగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ఆర్థికరంగం బలంగా లేదనీ, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సంక్షోభం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు.
* బ్రిక్స్ దేశాల మధ్య బలమైన బంధాల కోసం మోదీ పది చర్యలను 'దస్ కదమ్ (భవిత కోసం పది అడుగులు)' పేరుతో ప్రతిపాదించారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు పాల్గొన్నారు.

గ్రీస్ ప్రధాని రాజీనామా
* గ్రీస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ 2015 ఆగస్టు 20న తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి వర్గాన్ని రద్దు చేశారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
* గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపాలస్.
గ్రీస్ ఆర్థిక సంక్షోభం
* ఆర్థిక సహకార (బెయిలవుట్) ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు అంగీకరించాలంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించారు. ఈ అంశానికి సంబంధించి దేశంలో జులై 6న జరిగిన రెఫరెండమ్‌లో ఉద్దీపన షరతులకు 61.31 శాతం మంది వ్యతిరేకంగా, 38.69 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
* అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ జూన్ 30న ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి డిఫాల్ట్ అయ్యింది. దీంతో ఐఎంఎఫ్ గ్రీస్‌ను 'ఎగవేతదారు'గా ప్రకటించింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో గ్రీస్ తొలి ఎగవేతదారుగా నిలిచింది.
* ఆర్థిక సహకార ఒప్పందం కోసం ఐరోపా రుణ దాతలు కఠిన షరతులను పెడుతున్నారని, వాటిని తిరస్కరించాలని దేశ ప్రజలను కోరి రెఫరెండమ్‌కు వెళ్లిన దేశ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తిరిగి వాటికే మొగ్గు చూపారు. షరతులను తిరస్కరిస్తే దేశం మరింత సంక్షోభంలోకి వెళుతుందని, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, యూరోజోన్ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిసి కూడా మెజార్టీ ప్రజలు ప్రధాని సిప్రాస్ మాటకే విలువిచ్చి, రెఫరెండమ్ ద్వారా ఐరోపా దేశాలకూ 'నో' అంటూ సమాధానమిచ్చారు. తీరా ఇది జరిగి వారం రోజులు కూడా కాకముందే ఎలాంటి సంస్కరణలనైతే గ్రీస్ వాసులు వద్దన్నారో సరిగ్గా అలాంటి సంస్కరణలకే సిప్రాస్ తలొగ్గి వార్తల్లో నిలిచారు.
* యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజమ్ నుంచి షరతులతో కూడిన 5,350 కోట్ల యూరోల రుణాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ప్రకటించారు.
* యూరో ప్రాంతం నుంచి వైదొలగకుండా ఉండేందుకు గ్రీసు మొగ్గు చూపిన నేపథ్యంలో రుణదాతల కఠిన షరతులకు అంగీకరిస్తూ మూడేళ్ల పాటు 8,600 కోట్ల యూరోల ఉద్దీపన పొందింది. దీనికి సంబంధించి జులై 13న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. 2010 నుంచి ఇప్పటి వరకు గ్రీసు పొందిన ఉద్దీపనల్లో ఇది మూడోది. చారిత్రక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జులై 15 నుంచి గ్రీసు కఠిన షరతులను అమలు చేయాల్సి వచ్చింది.

SOURCE eenadu
No comments:
Post a Comment