Showing posts with label FREE COACHING. Show all posts
Showing posts with label FREE COACHING. Show all posts

Tuesday, 4 September 2018

FREE COACHING FOR PANCHAYAT SECRETARY




 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరీక్షకు ఉచిత శిక్షణకై అర్హులైన బీసీ, ఇబీసీ, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడానికి tsbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం, పూర్తి నోటిపికేషన్ లభిస్తాయని పేర్కొన్నారు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్‌లో 5-9-2018 నుంచి 12-9-2018లోగా రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు మించకూడదని తెలిపారు. పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఆదాయం రూ. 2 లక్షలు మించవద్దన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలైన హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేటలలో పది బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

Friday, 27 July 2018

FREE CIVILS COACHING IN TELANGANA

500 మందికి సివిల్స్‌ శిక్షణ

ఈ నెల జులై 30 2018 నుంచి దరఖాస్తులు

ఆగస్టు 12 2018 చివరి తేదీ

 రాష్ట్రంలో 500 మంది నిరుద్యోగ యువతకు సివిల్స్‌లో శిక్షణ ఇవ్వాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 30 నుంచి ఆగస్టు 12 వరకు వెబ్‌సైట్‌   http://tsbcstudycircles.cgg.gov.in   ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్స్‌ శిక్షణకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ జి.సుజాత తెలిపారు. ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించి 500 మందిని ఎంపిక చేస్తామని, వీరికి హైదరాబాద్‌, వరంగల్‌ జిల్ల్లాల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ ప్రారంభమైన రెండునెలల తరువాత మరోసారి పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభచూపిన 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కు శిక్షణ ఇస్తామని, ఉపకారవేతనం చెల్లిస్తామని వివరించారు. మిగతా 400 మందికి ప్రిలిమ్స్‌ శిక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు.

Notification: https://drive.google.com/file/d/1wTYKRJ89m39qddjeiLhQoRXRt7UoygnO/view?usp=drivesdk

Sunday, 24 June 2018

Free police training camp for SI, Constable aspirants in Hyderabad

Free police training camp for SI, Constable aspirants in Hyderabad

While the camp is aimed at helping aspirants from the minority community, organiser and sponsor Syed Amjad of Hotel Crystal Banjara said the camp is free and open to all, irrespective of community background, so long as they are eligible candidates.

Hyderabad: In light of the Telangana government inviting applications for 18,428 Police Constable and Sub-Inspector posts, free training camp is being organised at Nizam College grounds from July 1.

While the camp is aimed at helping aspirants from the minority community, organiser and sponsor Syed Amjad of Hotel Crystal Banjara said the camp is free and open to all, irrespective of community background, so long as they are eligible candidates.


A similar free training camp is being organised by the same sponsors, including the NGO called Minority Rights Protection Committee, in Karimnagar. Amjad appealed to youngsters from the minority community to take  advantage of the opportunity and enroll for the free training camp, where coach Ali will be available  from 6.30 am every day for about three months beginning July 1.

The coach can be contacted on the mobile number 9010834134, but interested aspirants can just walk in as well

Saturday, 23 June 2018

Free Coaching For PC & VRO

పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ...

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని రైజీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆశ్రిత ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్-4, ఆర్‌పీఎఫ్, వీఆర్వో అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు సొసైటీ చైర్మన్ ఎస్.ప్రదీప్ సల్వాడి తెలిపారు. అభ్యర్థులు ఫౌండేషన్ నిర్వహించే అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసి, ఓసి కులాలకు చెందిన తెల్లకార్డు కలిగి ఉన్న పేద అభ్యర్థులు శిక్షణకు అర్హులని ఆయన పేర్కొన్నారు. కానిస్టేబుల్, వీఆర్వో అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ప్రత్యేక బ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని, పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 

ఇతర వివరాలకు 9032848484, 9989848484 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

గ్రామీణ యువతకే ప్రాధాన్యం: ఉపాధి కల్పనలో ఫ్రీ ట్రైనింగ్

గ్రామీణ యువతకే ప్రాధాన్యం: ఉపాధి కల్పనలో ఫ్రీ ట్రైనింగ్


NACఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది న్యాక్ సంస్థ. ఉద్యోగంలేక నిరుత్సాహ పడుతున్న వారిని ఎంకరేజ్ చేసి…వారికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి  నిరుద్యోగ యువతకు తొమ్మిది ట్రేడ్‌ల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు న్యాక్ సంస్థ డైరెక్టర్ శాంతిశ్రీ తెలిపారు. న్యాక్‌తోపాటు EGMM, DDUGKY కలిసి 3నెలలపాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ లో భాగంగా ఫ్రీగా భోజనం, వసతి కలించడంతో పాటు.. పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, హెల్మెట్ అందించనున్నారు. శిక్షణ తర్వాత న్యాక్ సర్టిఫికెట్, భారత ప్రభుత్వ సర్టిఫికెట్ ఇస్తామన్నారు సంస్థ నిర్వాహకులు.
శిక్షణ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పదో తరగతి అర్హతతో ఎలక్ట్రికల్ అండ్ హౌజ్‌వైరింగ్, ఇంటర్/ఐటీఐ అర్హతతో ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్, డిగ్రీ అర్హతతో స్టోర్ కీపర్, 8వ తరగతి అర్హతతో వెల్డింగ్, 7వ తరగతి అర్హతతో ప్లంబింగ్, పేయింటింగ్, డ్రైవాల్ అండ్ ఫాల్‌సీలింగ్ శిక్షణ ఇవ్వనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్సులతోపాటు ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో మాదాపూర్‌లోని న్యాక్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

అడ్రస్: వివరాలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర, కొత్తగూడ పోస్ట్, సైబరాబాద్, హైదరాబాద్-84. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫొన్ నంబర్లు 7989050888, 8328622455.

Friday, 22 June 2018

నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్...


నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్...

నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చింది టెక్ మహేంద్ర ఫౌండేషన్. హైదరాబాద్ జంట నగరాల్లో బీ.కామ్ పూర్తి చేసిన 20-27 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులకు నాలుగు నెలల పాటు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి కల్పించనున్నాట్లు ఆ సంస్థ తెలిపింది. ట్యాలీ, ఈఆర్‌పీ 9, జీఎస్టీ, బేసిక్ అకౌంట్స్, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యునికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఆన్‌జాబ్ ట్రైనింగ్ వంటి కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ప్రముఖ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఈ కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 21లోపు శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9515665095.

Source V6

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు