Tuesday, 4 September 2018

FREE COACHING FOR PANCHAYAT SECRETARY




 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరీక్షకు ఉచిత శిక్షణకై అర్హులైన బీసీ, ఇబీసీ, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడానికి tsbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం, పూర్తి నోటిపికేషన్ లభిస్తాయని పేర్కొన్నారు. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్‌లో 5-9-2018 నుంచి 12-9-2018లోగా రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు మించకూడదని తెలిపారు. పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఆదాయం రూ. 2 లక్షలు మించవద్దన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లాలైన హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేటలలో పది బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు