పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ...
హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని రైజీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆశ్రిత ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్-4, ఆర్‌పీఎఫ్, వీఆర్వో అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు సొసైటీ చైర్మన్ ఎస్.ప్రదీప్ సల్వాడి తెలిపారు. అభ్యర్థులు ఫౌండేషన్ నిర్వహించే అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసి, ఓసి కులాలకు చెందిన తెల్లకార్డు కలిగి ఉన్న పేద అభ్యర్థులు శిక్షణకు అర్హులని ఆయన పేర్కొన్నారు. కానిస్టేబుల్, వీఆర్వో అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ప్రత్యేక బ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని, పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఇతర వివరాలకు 9032848484, 9989848484 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment