గ్రామీణ యువతకే ప్రాధాన్యం: ఉపాధి కల్పనలో ఫ్రీ ట్రైనింగ్
NACఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది న్యాక్ సంస్థ. ఉద్యోగంలేక నిరుత్సాహ పడుతున్న వారిని ఎంకరేజ్ చేసి…వారికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనుంది. దీనికి సంబంధించి నిరుద్యోగ యువతకు తొమ్మిది ట్రేడ్‌ల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు న్యాక్ సంస్థ డైరెక్టర్ శాంతిశ్రీ తెలిపారు. న్యాక్‌తోపాటు EGMM, DDUGKY కలిసి 3నెలలపాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ లో భాగంగా ఫ్రీగా భోజనం, వసతి కలించడంతో పాటు.. పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, హెల్మెట్ అందించనున్నారు. శిక్షణ తర్వాత న్యాక్ సర్టిఫికెట్, భారత ప్రభుత్వ సర్టిఫికెట్ ఇస్తామన్నారు సంస్థ నిర్వాహకులు.
శిక్షణ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పదో తరగతి అర్హతతో ఎలక్ట్రికల్ అండ్ హౌజ్‌వైరింగ్, ఇంటర్/ఐటీఐ అర్హతతో ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్ సూపర్‌వైజర్, డిగ్రీ అర్హతతో స్టోర్ కీపర్, 8వ తరగతి అర్హతతో వెల్డింగ్, 7వ తరగతి అర్హతతో ప్లంబింగ్, పేయింటింగ్, డ్రైవాల్ అండ్ ఫాల్‌సీలింగ్ శిక్షణ ఇవ్వనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్సులతోపాటు ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో మాదాపూర్‌లోని న్యాక్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
అడ్రస్: వివరాలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర, కొత్తగూడ పోస్ట్, సైబరాబాద్, హైదరాబాద్-84. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫొన్ నంబర్లు 7989050888, 8328622455.
No comments:
Post a Comment