ఆగస్టు 8 నుంచి ‘క్యాట్’ దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 25న పరీక్ష
దిల్లీ: ఐఐఎమ్‌లు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్ పరీక్ష.. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 8న మొదలవుతుంది. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రుసుమును కూడా ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలి. సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అక్టోబర్ 24 నుంచి అడ్మిట్ కార్డులను అభ్యర్థులకు అందుబాటులో పెడతారు. నవంబర్ 25న రెండు విడతల్లో పరీక్షను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 147 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 17 నుంచి ‘క్యాట్’ వెబ్‌సైట్‌లో.. నమూనా పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు వివరాలను పరీక్ష సంచాలకుడు, ఐఐఎమ్-కలకత్తా ఆచార్యుడు సుమంత బసు వెల్లడించారు.
x
No comments:
Post a Comment