Saturday, 28 July 2018

281 Junior Lecturer Post's in TS Gurukulam

గురుకులాల్లో 281 జేఎల్‌ పోస్టులు

హైదరాబాద్
గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 281 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను తెలంగాణ గురుకుల నియామక బోర్డు భర్తీ చేయనుంది. ఈనెల 31న అధికారికంగా ప్రకటన వెలువరించేందుకు సమాయత్తమైంది. వీటికి ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 8 వరకూ ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. అత్యధికంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 149 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పేపర్‌-1,2,3తో పాటు డెమో ఉంటుంది. గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 600 డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల ప్రకటన వెంట‌నే వెలువరించాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతోంది. త్వరలోనే యూజీసీ నెట్‌ ఫలితాలు వెల్లడవ్వనున్న నేపథ్యంలో మరికొందరికి పరీక్ష రాసేందుకు అవకాశమివ్వాలని భావిస్తోంది. ప్రకటన ఇప్పుడే వెలువరిస్తే.. తాజాగా నిర్వహించే పరీక్షలో అర్హత పొందే అవకాశాలున్న అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో అందరికీ అవకాశమిచ్చేందుకు డిగ్రీ లెక్చరర్‌ ప్రకటన తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపింది. గురుకుల బోర్డు ఇప్పటికే పీజీటీ, టీజీటీ పోస్టులకు రెండు ప్రకటనలు జారీ చేసింది. వీటికి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గురుకుల బోర్డుకు అప్పగించిన నియామకాలు అక్టోబరు నాటికి పూర్తిచేయాలని బోర్డు వర్గాలు లక్ష్యంతో ఉన్నాయి.


No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు