ఓపెన్ స్కూల్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : ఓపెన్ స్కూల్ విధానంలో అడ్మిషన్ పొంది అక్టోబర్ 2018లో నిర్వహించబోయే పదోతరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజును మీ సేవ, టీఎస్‌ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో అడ్మిషన్ పొంది పరీక్షలకు హాజరుకాని వారు, పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన వారు కూడా ఈ పరీక్షలు రాయడానికి అర్హులని అన్నారు. పదోతరగతిలో ప్రతి సబ్జెక్టుకు రూ.100(థియరీ), రూ.50(ప్రాక్టికల్), ఇంటర్మీడియేట్‌లో ప్రతి సబ్జెక్టుకు రూ.150(థియరీ), రూ.100(ప్రాక్టికల్)కు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చెల్లించాలని తెలిపారు. ఆగస్టు 14 నుంచి 20వ తేదీ వరకు రూ.25 చొప్పున అపరాద రుసుంతో, ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రూ.50చొప్పున అపరాద రుసుంతో చెల్లించాలని తెలిపారు. కావున అధ్యాయన కేంద్రాల కో ఆర్డినేటర్లు, సిబ్బంది ఈ విషయమై విస్తృత ప్రచారం చేసి ఎక్కువ మంది విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
No comments:
Post a Comment