Monday, 30 July 2018

Panchayat Secretary Recruitment is On Permanent Basis Only

పంచాయతీ కార్యదర్శులవి శాశ్వత ఉద్యోగాలే
అవి ఒప్పంద నియామకాలు కావు 

భగీరథతో పంచాయతీల ఖర్చులు తగ్గుదల

పండగ వాతావరణంలో 4,383  పంచాయతీల అవతరణ

ఒకేసారి ఇన్ని ఏర్పాటు దేశంలోనే ప్రథమం
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా నియమించనున్న 9,200 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికనే ఉంటాయని, ఒప్పంద ఉద్యోగాలు కావని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. నిరంతర విద్యుత్తు, భగీరథ ద్వారా మంచినీళ్ల సరఫరా వల్ల గ్రామ పంచాయతీ ఖర్చులు సగానికి తగ్గబోతున్నాయని, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.1,132 కోట్లను ఇవ్వనున్నందున వాటికి నిధులు బాగా అందుబాటులోకి వస్తాయన్నారు. కొన్ని పంచాయతీల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టదలచామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆగస్టు2న 4,383 పంచాయతీలు ఒకేసారి బ్యానర్లు, బోర్డులు, మామిడి తోరణాలు, టాంటాం, మంగళ వాయిద్యాల నడుమ పండగ వాతావరణంలో ఆవిర్భవించబోతున్నాయన్నారు. ఒకే సారి భారీ సంఖ్యలో పంచాయతీలు అవతరించటం దేశంలో ఇదే ప్రథమమని మంత్రి పేర్కొన్నారు. కొత్త పంచాయతీలు అవతరిస్తున్న సందర్భంగా మంత్రి సోమవారం సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ పద్ధతిలోనే నియమిస్తామని, అర్హులు ఉద్యోగాల్లోకి వచ్చాక మూడేళ్ల పాటు ప్రొబేషన్‌ వ్యవధి ఉంటుందని మంత్రి తెలిపారు. ఎంపిక విధానాలపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని పంచాయతీల్లోనూ త్వరలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పాత పంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోయినందున సర్పంచులను పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా కొనసాగించటం సాధ్యంకాదని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న మీదటనే.. పదవీకాలం పూర్తికాని 18 తప్ప మిగతా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామన్నారు. బీసీ గణన చేపట్టి.. ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు న్యాయపరంగా పోరాడతామన్నారు.
కొత్త పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన నిధులు
ఆర్థిక సంఘం తదితరాల ద్వారా వచ్చే నిధులను  కొత్తపంచాయతీలకు అక్కడి జనాభా ప్రాతిపదికన పంచి ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలతో ఆయన గురువారం ఇక్కడి నుంచి దూరదృశ్య సదస్సును నిర్వహించారు. పంచాయతీల అవతరణ దినోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలో దిశానిర్దేశం చేశారు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు