Friday, 3 August 2018

Panchayati Secretaries are Recruited by Written Test Decides Cabinet Sub Committee

రాత పరీక్షతోనే పంచాయతీ కార్యదర్శుల ఎంపిక


కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చింది. కొత్తగా 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక గైడ్ లైన్స్పై సమీక్ష జరిపారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ రిక్రూట్ మెంట్ ఉండబోతోంది. రాత పరీక్ష ద్వారానే పంచాయతీ కార్యదర్శులను నియమించాలని నిర్ణయించారు. అలాగే రిక్రూట్ అయిన కార్యదర్శులు గ్రామంలోనే ఖచ్చితంగా నివాసం ఉండాలని నిబంధన విధించబోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల పాటు రూ.15 వేల వేతనం ఇస్తారు. పనితీరు సరిగా ఉంటేనే రెగ్యులరైజ్ చేయాలని మంత్రి వర్గ ఉపసంఘంలో నిర్ణయించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదోన్నతుల విషయంలో సీనియారిటీతో పాటు, పనితీరును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన ఏ గ్రామానికి ఎంత మంది ఉద్యోగులు అవసరమో అంచనా వేయాలని కేబినెట్ సబ్ కమిటీ.. అధికారులను ఆదేశించింది.

Source :- Eenadu

3 comments:

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు