Thursday, 2 August 2018

306 Jobs Approved in Telangana Fire Department

అగ్నిమాపక శాఖకు 306 పోస్టులు మంజూరు


హైదరాబాద్‌: అగ్నిమాపక శాఖకు వివిధ కేటగిరిల్లో 306 పోస్టులను మంజూరు చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న 18 అగ్నిమాపక కేంద్రాలకు వీటిని కేటాయించనున్నారు. చెన్నూరు, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ, నిజామాబాద్‌ (గ్రామీణ), పాలకుర్తి, భూపాలపల్లి, వర్దన్నపేట, పాలేరు, వైరా, దేవరకద్ర, కొడంగల్‌, ఆలేరు, ఖానాపూర్‌, మోత్కూరు, జడ్చర్ల, యాకూత్‌పుర, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లలో కొత్త అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా మంజూరైన పోస్టుల్లో ఫైర్‌మన్‌ -180; డ్రైవర్‌, ఆపరేటర్‌ - 54, లీడింగ్‌ ఫైర్‌మన్‌- 36, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌- 18, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 18 ఉన్నాయి. రాష్ట్ర హోంశాఖ ప్రతిపాదనల మేరకు ఈ పోస్టులు మంజూరు చేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు