Thursday, 2 August 2018

Loco Pilot Posts Increased to 60000

60,000 రైల్వే ఉద్యోగాలు 
రెట్టింపునకు పైగా పోస్టుల పెంపు 
అసిస్టెంట్‌ లోకో పైలెట్‌, టెక్నీషియన్‌ ఉద్యోగార్థులకు తీపి కబురు
దిల్లీ: రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది అభ్యర్థులకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ఆయా ఖాళీలను రెట్టింపునకు పైగా పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వేశాఖ ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలో 26,502 ఖాళీలున్నట్లు వెల్లడించగా.. ఆ సంఖ్యను తాజాగా 60,000కు పెంచినట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు గాను తొలిదశగా ఆగస్టు 9న నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు దేశవ్యాప్తంగా 47.56 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రైల్వేమంత్రి తాజా ప్రకటనతో వారికి ఉద్యోగావకాశాలు చాలామేర మెరుగవుతాయి. ఉద్యోగ ప్రకటన వెలువరించిన తర్వాత వివిధ రైల్వేజోన్లలో మరిన్ని ఖాళీలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కేంద్రాల కేటాయింపునకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కొన్నిచోట్ల దూర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించినట్లు అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈమేరకు వివరణ ఇచ్చింది. అభ్యర్థులకు రైల్వేశాఖ జులై 26నే ఆన్‌లైన్‌ లింక్‌ను అందుబాటులో ఉంచింది. పరీక్షకు 4రోజుల ముందు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు