Saturday, 4 August 2018

1610 New Jobs In GHMC

జోన్ల పెంపుతో GHMCలో మరో 1,610 ఉద్యోగాలు




నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. GHMCలో 1,610 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం (ఆగస్టు-4) ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. GHMCలో 30 సర్కిళ్లను 48 సర్కిళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరు జోన్ల నుంచి 12 జోన్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ప్రతి రెండు అసెంబ్లీ స్థానాలకు ఒక జోన్ ఉండే విధంగా నిర్ణయించారు. ప్రతి జోన్ పరిధిలో నాలుగు సర్కిళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. సర్కిళ్లు, జోన్ల పెంపుతో 1,610 అదనపు పోస్టులకు అవకాశం కలిగిందని తెలిపారు GHMC అధికారులు. హైదరాబాద్ లో మరింత వేగవంతం, సమర్థవంతంగా, పారదర్శకంగా పౌరసేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి GO నెం.149ను ప్రభుత్వం పురపాలక పరిపాలన నగరాభివృద్ధి శాఖ విడుదల చేసింది.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు