పాలిటెక్నిక్ కళాశాలల్లో 248 కొత్త కొలువులు
వాటిలో 158 అధ్యాపక ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన ఏడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో బోధన, బోధనేతర కొలువుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 55 ప్రభుత్వ కళాశాలలు ఉండగా వాటిలో 14 కళాశాలల్లో 686 ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏడాది క్రితమే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. వాటిలో ఏడు కళాశాలల్లో 248 బోధన, బోధనేతరతోపాటు ఒప్పంద ఉద్యోగాల భర్తీకి సీఎం కొద్ది రోజుల క్రితం ఆమోదం తెలుపగా, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపాల్సి ఉంది. అనంతరమే ఆర్థికశాఖ జీఓ జారీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

No comments:
Post a Comment