Sunday, 1 July 2018

Police Recruitment Last Date Ends around 7 Lakh Applied

ముగిసిన గడువు : పోలీస్ ఉద్యోగాలకు ఏడు లక్షల దరఖాస్తులు



తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో స్పందన లభించింది. సబ్‌ ఇన్‌ స్పెక్టర్, తత్సమాన పోస్టులతో పాటు కానిస్టేబుల్, ఆ స్థాయిలోని వివిధ విభాగాల్లోని మొత్తం 18 వేల 428 పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు శనివారం (జూన్-30)తో ముగిసింది. అయితే, శనివారం రాత్రి వరకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు. ఇంకా అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఉండటంతో మరో 10 నుంచి 15 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
దరఖాస్తుల వివరాలు

శనివారం సాయంత్రం వరకు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ సివిల్, AR, బెటాలియన్, SPF , డిప్యూటీ జైలర్, అసిస్టెంట్‌ మాట్రన్‌ పోస్టులకు 1లక్షా,82 వేల,285 దరఖాస్తులు వచ్చాయి. సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ IT విభాగం పోస్టులకు 13 వేల,241 దరఖాస్తులు, ఫింగర్‌ ప్రింట్స్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ పోస్టులకు 7 వేల 308 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది బోర్డు. సివిల్, AR, బెటాలియన్, ఫైర్‌ మెన్, వార్డర్‌ పోస్టులకు 4 లక్షల, 64 వేల,319 దరఖాస్తులు వచ్చాయి. IT కానిస్టేబుల్‌ పోస్టులకు 14 వేల284, డ్రైవర్‌ పోస్టులకు 12వేల 830, మెకానిక్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1 వేల, 782 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. అన్ని పోస్టులకు మొత్తంగా 6 లక్షల,96వేల,049 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు బోర్డు చైర్మన్‌ శ్రీనివాస్‌రావు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు