Press Release
పోలీసు ఉద్యోగాలకు ఆగస్టులో ప్రాథమిక రాతపరీక్ష | |
ఈనాడు, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాలకు ప్రాథమిక రాతపరీక్ష ఆగస్టులో నిర్వహిస్తామని తెలంగాణ
రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మొత్తం 22 రోజులపాటు దరఖాస్తులు స్వీకరించగా, ఈ వివరాలను ఆదివారం(జులై 1) ఒక ప్రకటనలో విడుదల చేశారు. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ జూన్ 30తో ముగిసింది. ఎంపిక ప్రక్రియ సకాలంలో నిర్వహించాలనే ఉద్దేశంతో గడువు పెంచలేదని అధికారులు చెబుతున్నారు. * మొత్తం దరఖాస్తులు: 7,19,840 * 22 రెండు రోజులపాటు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంచారు. మొత్తం 21,201 ఫిర్యాదులు వచ్చాయి. * డ్రైవర్లు, మెకానిక్‌ల పోస్టులకు రంగారెడ్డి జిల్లా నుంచి, మిగతా వాటన్నింటికీ నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. * నాలుగు పోస్టులకు 1,41,420 మంది, రెండు పోస్టులకు 11,565, మూడు పోస్టులకు 4,294, ఐదు పోస్టులకు 1,525, ఆరు పోస్టులకు 149, ఏడు పోస్టులకు 88 మంది దరఖాస్తు చేసుకున్నారు. * గడువుకు ఒక్కరోజు ముందు అంటే జూన్ 29న అత్యధికంగా 75,516 దరఖాస్తులు వచ్చాయి. * ఆప్టిట్యూడ్ పరీక్ష కోసం 78% అభ్యర్థులు తెలుగు భాషను ఎంచుకున్నారు. 21% ఇంగ్లిష్. 0.22% ఉర్దూ ఎంచుకున్నారు. * దరఖాస్తు చేసుకున్న వారిలో 9.5% ఓసీ, 21% ఎస్సీ, 17% ఎస్టీ, 52% బీసీ తరగతుల వారు ఉన్నారు. * 10,527 మంది మాజీ సైనికులు దరఖాస్తు చేసుకున్నారు. |
---|
No comments:
Post a Comment