సహకార బ్యాంకుల్లో 1,106 ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB)ల్లో ఖాళీగా ఉన్న 1,106 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార బ్యాంకుల్లో పరిస్థితిపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం బుధవారం(జూన్-20) జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నలిచ్చింది. పోస్టుల్లో 6 DCCBలకు సీఈవో పోస్టులున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు. టెస్కాబ్, డీసీసీబీల్లో మరో 600 క్లరికల్, ఆఫీసర్ స్థాయి పోస్టులను.. 500 డ్రైవర్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లేదా మరేదైన నియామకాల సంస్థ ద్వారా భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. అటెంటర్ పోస్టులకు కనీసం 7వ తరగతి చదివిన వారి నుంచే దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. డిగ్రీ లేదా అంత కన్నా ఎక్కువ చదివిన వారి నుంచి దరఖాస్తు చేసుకోడానికి అనర్హులుగా ప్రకటిస్తామన్నారు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు ఎండీ నేతి మురళీధర్ చెప్పారు. పోస్టుల భర్తీకి త్వరలో వాటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడతాయన్నారు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి.
No comments:
Post a Comment