తెలంగాణ మాండలికాలు (వ్యవసాయం & రెవెన్యూ పదాలు)
(నోట్: ఇటీవల కాలంలో జరిగిన అన్ని TSPSC ఎగ్జామ్స్ లోనూ తెలంగాణ మాండలికాలు, తెలంగాణలో వాడుకలో ఉన్న పదాల మీద ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ముఖ్యమైన పదాలను మీకు పరిచయం చేస్తున్నాం. మన తెలంగాణకి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 24 కిలోమీటర్లకు మాండలికం మారిపోతుంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన మాండలికం ఉన్నట్టు భాషా నిపుణులు చెబుతున్నారు. )
ఈ చాప్టర్ లో మీకు వ్యవసాయం, రెవెన్యూ సంబంధిత పదాలను పరిచయం చేస్తున్నాం... TSPSC గ్రూప్ పరీక్షలు, పోలీస్ ఉద్యోగాలతో పాటు VRO ఉద్యోగాలకు తప్సనిసరిగా పనికొస్తాయి.
1) వ్యవసాయం - ఎవుసం
2) యాసంగి - రబీ పంట
3) ఖరీఫ్ - వర్షా కాలం పంట
4) తరి - సాగు భూమి ( వెట్ )
5) ఖుష్కీ - డ్రై ( మెట్ట ప్రాంతం)
6) తైబందీ - రెండో పంట
7) గెట్టు - పొలం హద్దులు
8) మొగులు - ఆకాశం మబ్బులు పట్టడం
9 ) అరక - నాగలి
10) పొక్కు/పార - మట్టి తీసేది
11) గరిశె - వడ్లు నిల్వ చేసేది
12) అంగ - అడుగు
13) అగ్గువ - రేటు తక్కువ లేదా చౌక అయినది
14) ప్రియం - రేటు ఎక్కువ
15) జడ్డిగం - జొన్న సాలులో విత్తనాలు నాటేందుకు నాగలికి కట్టేది
16) కాణి - రెండు ఎడ్ల మెడల వేసే చెక్క కొయ్య
17 ) కౌల్దార్ - భూమిని కౌలుకి తీసుకునేవాడు
18) ముల్లుగర్ర - దాదాపు నాలుగైదు మూరలు ఉండే పొడవాటి కర్ర. దీనికి చివర ఇనుప మొల (మేకు) ఉంటుంది. ఎడ్లను అదిలించడానికి ఉపయోగిస్తారు.
19) వడిశెల - పొలాల్లో పిట్టలు రాకుండా తాడులో రాయి ఉంచి విసిరేది
20) కొట్టం - పశువులను ఉంచేది
21) అల్పటి - దాపటి = ఎడమ, కుడి (సాధారణంగా బండికి కట్టే ఎడ్లను ఉదహరిస్తారు )
22) శేర్ దార్ - పెద్ద జీతగాడు
23) కమతం - భూమి విస్తీర్ణం
24) ఫౌతి - చనిపోయిన వారి వివరాలు నమోద
25) ఇలాకా - ప్రాంతం
26) తూము - చెరువుల నుంచి కాలువలకు నీటిని వదిలేది
27) మత్తడి - చెరువు నిండిన తర్వాత బయటకు వచ్చే నీరు
28) అలుగు - మత్తడి నుంచి పైకి వచ్చే నీరు
29) మడువ - చిన్న కాలువ నుంచి పొలాల్లోకి నీటిని వదిలేది
30) మాల్గుజారీ - భూమిశిస్తు వసూళ్ళు
31) పోరంబోకు - సాగుకు పనికిరాని భూమి
32) బంచరాయి - పశువుల ఆహారం కోసం వదిలిన ప్రభుత్వ భూమి
33) ఇనాం - ప్రభుత్వం సేవలు గుర్తించి ఇచ్చే భూమి
34) వేవళ్ ఇనాం - దేవుడి గుడిలో ధూప దీప నైవేద్యాలు చేసేందుకు ఇచ్చేది
35) బలోతా ఇనాం - భూమిలేని నిరుపేదలైన దళిత వర్గాలకు ఇచ్చేది (ఈ భూమిని అమ్మకూడదు, కొనకూడదు)
36) సర్ఫేఖాస్ - నిజాం నవాబు సొంత భూమి
37) సీలింగ్ - భూ గరిష్ట పరిమితి
38) ఏక్ ఫసల్ - ఒక పంట
39) రెవెన్యూ ఫిర్కా - ఒక నిర్ధేశిత రెవెన్యూ ప్రాతం
40) గిర్దావర్ హల్కా - నిర్దేశిత మండల ప్రాంతం
41) ట్రెజరీ - రాష్ట్ర ఖజానా
42) టంకశాల - నాణేలు ముద్రించే కేంద్రం
43) అర్జీ - దరఖాస్తు
44) శిస్తు - ట్యాక్స్
45) ఫసలీ - ఉర్దూ కేలండర్ సంవత్సరం (ఇది క్రీస్తుకు 590 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఇప్పటికీ రెవెన్యూలో ఏడాదికేడాది ఫసలీ సంవత్సరాన్ని గుర్తిస్తారు )
46) పుల్లర - ప్రభుత్వ భూముల్లో పశువులను మేపితే చెల్లించాల్సిన పన్ను (ఫారెస్ట్ వాళ్ళకి ఉండేది)
47) సర్వే నెంబర్ - భూములను గుర్తించే నెంబర్
48) అడంగల్ - పహణీ
49) పావుతీ - రశీదు పుస్తకం
50) నక్షా - భూముల వివరాలు తెలిపే చిత్ర పటం (మ్యాప్ )
51) కబ్జాదార్ - భూమిని తన ఆధీనంలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి
52) చౌఫస్లా - రైతుకి గ్రామంలో వేర్వేరు పంట భూములుంటే వాటిని ఒకే దగ్గర రాసే పుస్తకం ( రెవెన్యూ లెక్కల్లో గ్రామ లెక్క నెంబర్.4)
53) పైసల్ పట్టీ - భూమికి శిస్తు నిర్ణయించిన పుస్తకం
54) గోష్వారా - భూముల స్వభావం బట్టి పన్ను వసూలు కోసం, రైతుల పట్టా మార్పు వివరాలు నమోదు చేసే రిజిష్టర్
55) సేత్వార్ - సర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ ( చివరిసారిగా 1964లో)
56) పాస్ బుక్ - రైతుకి భూమిపై యాజమాన్య హక్కులు గుర్తిస్తూ నమోదు చేసే పుస్తకం
( ROR కింద రెవెన్యూ శాఖ రిజిస్టర్లలో నమోదు చేయించుకున్న వారికి వీటిని ఇస్తారు )
57) గెజిట్ - రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే అధికారిక పత్రం
58) చలానా - ప్రభుత్వానికి చెల్లించేందుకు ఉపయోగించే ఫాం
59) ఖాస్రా పహణీ - 1954-55 సెటిల్ మెంట్ తర్వాత జారీ అయిన భూమి హక్కుల రికార్డు
60) జమాబందీ - ఏడాదికి ఒకసారి భూమి శిస్తు ఆదాయ వ్యయాలను లెక్కపెట్టేది
61) తాలూక్ దార్ - జిల్లా కలెక్టర్
62) తహసిల్దార్ - మండల రెవెన్యూ అధికారి ( MRO)
63) నాయబ్ సాబ్ - డిప్యూటీ తహసిల్దార్
64) గిర్దావర్ - రెవెన్యూ ఇన్సెపెక్టర్ ( RI)
65) పటేల్ - గ్రామాధికారి ( VRO )
66) పట్వారీ - ప్రభుత్వం తరపున గ్రామంలో భూమి కొలతలు, పట్టాలు, శిస్తు రికార్డులు నిర్వహించే వ్యక్తి (కరణం )
67) మాలీ పటేల్ - గ్రామంలో రెవెన్యూ శిస్తులు వసూలు చేసేవారు
68) పోలీస్ పటేల్ - గ్రామంలో లా అండ్ ఆర్డర్ చూసేవారు
69) షేక్ సింధీ - సుంకరి, ఎలోడు ( రెవెన్యూ అసిస్టెంట్ - VRA)
70) నీరడి - గ్రామంలో సాగునీటిని విడుదల చేయడం, చెరువులు, ఇతర కాలువల నీటి యాజమాన్యం నిర్వహించేవాడు
71) పట్టాదారు - భూమి మీద యాజమాన్య హక్కుల కలవాడు
72) ఖాస్తు దారు - భూమిని అనుభవించే వారు

No comments:
Post a Comment