తెలంగాణ గురుకులాల్లో 281 జేఎల్ పోస్టులు
తెలంగాణలోని వివిధ గురుకుల విద్యాలయ సంస్థల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రకటనను విడుదల చేసింది. పీజీ, బీఎడ్ ఉన్నవారు వీటికి పోటీ పడవచ్చు.
జూనియర్ లెక్చరర్ల పోస్టుల సంఖ్య: 281
సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45) శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) లేదా బీఏ, బీఎడ్/ బీఎస్సీ, బీఎడ్ ఉండాలి.
వయసు: జులై 1, 2018 నాటికి 18 - 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక: రాతపరీక్ష, డెమాన్‌స్ట్రేషన్ ఆధారంగా.
రాత పరీక్ష విధానం
రాతపరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. లాంగ్వేజీలు మినహా మిగతా సబ్జెక్టులకు మూడు పేపర్లూ ఇంగ్లిష్ మీడియంలో ఇస్తారు. అన్ని సబ్జెక్టుల వారికీ పేపర్-1, 2 కామన్‌గా ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతీ సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు తగ్గిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. మూడు పేపర్లలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానిస్తారు.
* పేపర్ - 1: ఇందులో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ బేసిక్ ప్రొఫిషియన్సీ నుంచి వంద ప్రశ్నలు వస్తాయి. వీటికి వంద మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
* పేపర్-2: పెడగోజీ అంశాలపై వంద ప్రశ్నలు వంద మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
* పేపర్-3: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు. వంద ప్రశ్నలకు వంద మార్కులు. రెండు గంటల వ్యవధి ఉంటుంది. డెమాన్‌స్ట్రేషన్‌కి 25 మార్కులు కేటాయించారు. మొత్తం 325 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 8 వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు.
https://treirb.telangana.gov.in/notification.html
No comments:
Post a Comment