GVK-EMRIలో వెటర్నరీ ఉద్యోగాలు
పారా వెటర్నరీ, డిప్లొమా ఇన్ వెటర్నరీ కోర్సు పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ అందించింది GVK. జీవీకే – ఈఎంఆర్‌ఐలో పశు ఆరోగ్య సేవలనందు పనిచేయడానికి అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది సంస్థ. అభ్యర్థులకు జూన్ 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిప్లొమా ఇన్ వెటర్నరీ విద్యార్హతలు కలిగి 30 ఏండ్ల లోపు వయసు ఉన్నవారు, 5.4 అంగులాల ఎత్తు కలిగిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించింది.
హైదరాబాద్ కింగ్ కోఠిలోని జిల్లా దవాఖానలో గల GVK-EMRI 108 ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతాయని.. ఇతర వివరాల కోసం 91007 99259, 91007 99264 నెంబర్లను సంప్రదించాలని వెల్లడించింది. సెలక్ట్ అయినవారికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థానికత ఆధారంగా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment