గ్రామీణ బ్యాంకుల్లో 10190 ఖాళీలు
- ఐబీపీఎస్ ద్వారా నియామకాలు
- డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అర్హులు
- డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అర్హులు
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పజ్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్-సీడబ్ల్యుఈ ఆర్ఆర్‌బీస్ VII ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీచేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ (పీవో, ఆపై స్థాయి పోస్టులకు)ల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగానికి ఆయా ప్రాంతీయ భాషలపై పరిజ్ఞానం ఉండాలి.
తెలుగు వచ్చినవారికి అవకాశం కల్పిస్తోన్న బ్యాంకులివీ...
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు
సప్తగిరి గ్రామీణ బ్యాంకు
తెలంగాణ గ్రామీణ బ్యాంకు
పడువాయ్ భారతీయార్ గ్రామీణ బ్యాంకు(పుదుచ్చెరి)

పోస్టుల సంఖ్య: 10,190
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టిపర్పస్) : 5249
ఆఫీసర్స్ (స్కేల్-I) : 3312
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టిపర్పస్) : 5249
ఆఫీసర్స్ (స్కేల్-I) : 3312
విద్యార్హత:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పజ్) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఉద్యోగాన్ని ఆశించే బ్యాంకుకు సంబంధించిన స్థానిక భాష తెలిసుండాలి. కంప్యూటర్ స్కిల్స్‌పై పరిజ్ఞానం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-1(పీవో) పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఐటీ, మేనేజ్‌మెంట్, లా...తదితర డిగ్రీలు ఉన్నవారికి ప్రాధాన్యం. ఉద్యోగాన్ని ఆశించే బ్యాంకుకు సంబంధించిన స్థానిక భాష తెలిసుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం. స్కేల్-2, స్కేల్ -3 పోస్టులకు విద్యార్హతలతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:
జూన్ 1, 2018 నాటికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉన్నవాళ్లు అర్హులు. ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసువారు అర్హులు. స్కేల్ -2 పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లలోపు, స్కేల్ -3 పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు. పై అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ప్రిలిమినరీ పరీక్ష (ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పజ్)
రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 80 మార్కులు. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.

ప్రిలిమినరీ పరీక్ష (ఆఫీసర్ స్కేల్-1)
రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 80 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.

మెయిన్ ఎగ్జామ్ (ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పజ్)
రీజరింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్/ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్‌నెస్, లాంగ్వేజ్ (ఇంగ్లిష్ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూటర్ అవేర్‌నెస్‌కు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

మెయిన్స్ ఆఫీసర్ స్కేల్-1
రీజరింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్/ హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్‌నెస్, లాంగ్వేజ్ (ఇంగ్లిష్ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూటర్ అవేర్‌నెస్‌కు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ప్రిలిమ్స్, మెయిన్స్‌లో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారినే మెయిన్స్‌కి అనుమతిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 8
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జులై 2
ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ) తేది: ఆఫీసర్ స్కేల్-1 ఆగస్టు 11,12,18; ఆఫీస్ అసిస్టెంట్- ఆగస్టు 19, 25 సెప్టెంబరు 1
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: సెప్టెంబరులో ప్రకటిస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష (మెయిన్) తేది: ఆఫీసర్స్ : సెప్టెంబరు 30, ఆఫీస్ అసిస్టెంట్ :అక‌్టోబరు 7
మెయిన్ ఫలితాలు: అక్టోబరులో
ఇంటర్వ్యూ : నవంబరు
తుది ఫలితాలు: జనవరి 2019.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
పరీక్ష ఫీజు: ఏ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. వంద. మిగిలిన అందరు అభ్యర్థులకూ రూ.600. రెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఫీజు విడిగా చెల్లించాలి.

వెబ్‌సైట్: www.ibps.in
No comments:
Post a Comment