Monday, 9 July 2018

Tech Mahindra, Genpact JOB MELA / SPECIAL DRIVE IN OSMANIA UNIVERSITY

Tech Mahindra , Genpact Job Mela / Special Drive in Osmania University College of Science, Saifabad on 10 July 2018 from 9.30 am with minimum 10th Qualification




Job Mela in Mancherial District

Job Mela in Mancherial District



Police Recruitment Exam Dates Announced

Police Recruitment Exam Dates Announced

SCT SI AND / OR EQUIVALENT POSTS

26 AUGUST 2018 -- 10AM - 1 PM

SCT SI IT & C

2 SEPTEMBER 2018 -- 10 AM - 1PM

SCT ASI FFB

2nd SEPTEMBER 2018 . 2:30 PM - 5:30 PM

SCT PC AND / OR EQUIVALENT POSTS

30 SEPTEMBER 2018 10 AM - 1 PM

ఆగస్టు 26 నుంచి పోలీసు పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) తేదీలు ప్రకటించింది. ఆగస్టు 26 నుంచి రాత పరీక్షలను నిర్వహించనుంది. పోలీసుతోపాటు అగ్నిమాపక, ప్రత్యేక భద్రతాదళ, జైళ్లశాఖల్లో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు ఇది వరకే ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 30న దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. తొలుత ప్రాథమిక పరీక్ష నిర్వహించి, ఇందులో ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు జరుపుతారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే తుదిపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
 ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సోమవారం (జులై 9) ఒక ప్రకటన జారీ చేశారు.
పోస్టుల సంఖ్య
* ఎస్సై సివిల్, తత్సమాన - 1,271
* ఎస్సై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ - 29
* అసిస్టెంట్ ఎస్సై, వేలిముద్రల విభాగం - 26
* సివిల్ కానిస్టేబుల్, తత్సమాన - 16,925

పరీక్ష తేదీలు







Friday, 6 July 2018

FACULTY Jobs In Warangal NIT

వరంగల్ నిట్‌లో ఫ్యాకల్టీలు...

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అడ్‌హక్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-పోస్టు: అడ్‌హక్ ఫ్యాకల్టీ
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-పేస్కేల్: పీహెచ్‌డీ చేసినవారికి నెలకు రూ. 60,000/-
-ఎంటెక్/బీటెక్+ ఎంబీఏ చేసిన వారికి నెలకు రూ. 50,000/-
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.nitw.ac.in

Monday, 2 July 2018

Last Date For Applying Group 4 and VRO EXTENDED

Last Date for Applying for Group 4 & VRO posts is Extended Upto 8 July 2018


వీఆర్‌వో ఉద్యోగాల దరఖాస్తు గడుపు పెంపు








Police Recruitment Premilanary Tests likely to be held in August

Press Release

పోలీసు ఉద్యోగాలకు ఆగస్టులో ప్రాథమిక రాతపరీక్ష
ఈనాడు, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాలకు ప్రాథమిక రాతపరీక్ష ఆగస్టులో నిర్వహిస్తామని తెలంగాణ
రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మొత్తం 22 రోజులపాటు దరఖాస్తులు స్వీకరించగా, ఈ వివరాలను ఆదివారం(జులై 1) ఒక ప్రకటనలో విడుదల చేశారు. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ జూన్ 30తో ముగిసింది. ఎంపిక ప్రక్రియ సకాలంలో నిర్వహించాలనే ఉద్దేశంతో గడువు పెంచలేదని అధికారులు చెబుతున్నారు. 
* మొత్తం దరఖాస్తులు: 7,19,840 
* 22 రెండు రోజులపాటు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంచారు. మొత్తం 21,201
ఫిర్యాదులు వచ్చాయి.
* డ్రైవర్లు, మెకానిక్‌ల పోస్టులకు రంగారెడ్డి జిల్లా నుంచి, మిగతా వాటన్నింటికీ నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
* నాలుగు పోస్టులకు 1,41,420 మంది, రెండు పోస్టులకు 11,565, మూడు పోస్టులకు 4,294, ఐదు పోస్టులకు 1,525, ఆరు పోస్టులకు 149, ఏడు పోస్టులకు 88 మంది దరఖాస్తు చేసుకున్నారు.
* గడువుకు ఒక్కరోజు ముందు అంటే జూన్ 29న అత్యధికంగా 75,516 దరఖాస్తులు వచ్చాయి.
* ఆప్టిట్యూడ్ పరీక్ష కోసం 78% అభ్యర్థులు తెలుగు భాషను ఎంచుకున్నారు. 21% ఇంగ్లిష్. 0.22% ఉర్దూ ఎంచుకున్నారు.
* దరఖాస్తు చేసుకున్న వారిలో 9.5% ఓసీ, 21% ఎస్సీ, 17% ఎస్టీ, 52% బీసీ తరగతుల వారు ఉన్నారు.
* 10,527 మంది మాజీ సైనికులు దరఖాస్తు చేసుకున్నారు.


Sunday, 1 July 2018

Police Recruitment Last Date Ends around 7 Lakh Applied

ముగిసిన గడువు : పోలీస్ ఉద్యోగాలకు ఏడు లక్షల దరఖాస్తులు



తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో స్పందన లభించింది. సబ్‌ ఇన్‌ స్పెక్టర్, తత్సమాన పోస్టులతో పాటు కానిస్టేబుల్, ఆ స్థాయిలోని వివిధ విభాగాల్లోని మొత్తం 18 వేల 428 పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు శనివారం (జూన్-30)తో ముగిసింది. అయితే, శనివారం రాత్రి వరకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు. ఇంకా అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఉండటంతో మరో 10 నుంచి 15 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
దరఖాస్తుల వివరాలు

శనివారం సాయంత్రం వరకు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ సివిల్, AR, బెటాలియన్, SPF , డిప్యూటీ జైలర్, అసిస్టెంట్‌ మాట్రన్‌ పోస్టులకు 1లక్షా,82 వేల,285 దరఖాస్తులు వచ్చాయి. సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ IT విభాగం పోస్టులకు 13 వేల,241 దరఖాస్తులు, ఫింగర్‌ ప్రింట్స్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ పోస్టులకు 7 వేల 308 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది బోర్డు. సివిల్, AR, బెటాలియన్, ఫైర్‌ మెన్, వార్డర్‌ పోస్టులకు 4 లక్షల, 64 వేల,319 దరఖాస్తులు వచ్చాయి. IT కానిస్టేబుల్‌ పోస్టులకు 14 వేల284, డ్రైవర్‌ పోస్టులకు 12వేల 830, మెకానిక్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1 వేల, 782 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. అన్ని పోస్టులకు మొత్తంగా 6 లక్షల,96వేల,049 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు బోర్డు చైర్మన్‌ శ్రీనివాస్‌రావు.

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు