Tuesday, 18 September 2018

JOBS IN IBPS

ఐబీపీఎస్ 7275 క్లరికల్ పోస్టులు...



దేశవ్యాప్తంగా ఉన్న జాతీయబ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ క్లరికల్-VIII) నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది.

-మొత్తం ఖాళీలు: 7275
-పోస్టు పేరు: క్లర్క్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేనాటికి విద్యార్హత సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలి.
-ఏదైనా సంస్థ నుంచి కంప్యూటర్ సర్టిఫికెట్/డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్) ఉండాలి.
-కేంద్రపాలిత/రాష్ట్ర స్థాయి అధికార భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం రావాలి.
-వయస్సు: 2018 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
తెలంగాణలోని బ్యాంకుల్లో ఖాళీలు: 162
(జనరల్-83, ఓబీసీ-41, ఎస్సీ-22, ఎస్టీ-16)
-బ్యాంకుల వారీగా వివరాలు.. అలహాబాద్ బ్యాంక్- 20, బ్యాంక్ ఆఫ్ బరోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-6, కెనరా బ్యాంక్- 60, కార్పొరేషన్ బ్యాంక్- 7, ఇండియన్ బ్యాంక్- 15, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-5, యూకో బ్యాంక్-8, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 20,
-విజయబ్యాంక్-8.
-ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల్లో మొత్తం 167 (జనరల్-84, ఓబీసీ-37, ఎస్సీ-31, ఎస్టీ-15)
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు రూ.100/-
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ రాతపరీక్ష, మెయిన్ రాతపరీక్ష ద్వారా.
-ప్రిలిమినరీ పరీక్ష 100, మొయిన్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు.
-ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే, మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-ఉమ్మడి రాతపరీక్ష స్కోర్ కార్డ్‌కు 2020 మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గడువు తేదీలోగా ఏదైనా బ్యాంకులో ఖాళీలు ఏర్పడితే ఈ ఉమ్మడిస్కోర్ కార్డుతోనే ఎంపిక చేస్తారు.
-ప్రిలిమినరీ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ-35, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, న్యూమరికల్ ఎబిలిటీ-35 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-మెయిన్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ -50 ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 18 నుంచి
-చివరితేదీ: అక్టోబర్ 10
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్(ప్రిలిమినరీ): నవంబర్‌లో ప్రిలిమినరీ ఆన్‌లైన్‌పరీక్ష :
-డిసెంబర్ 8,9 & 15,16
-ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్/2019 జనవరిలో
-హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ (మొయిన్): 2019 జనవరిలో
-మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2019 జనవరి 20
-మొయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2019 ఏప్రిల్‌లో
-వెబ్‌సైట్: www.ibps.in

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు