Wednesday, 12 September 2018

11 Lakhs Applied FOR VRO

వీఆర్వో పోస్టులకు 11లక్షలమంది దరఖాస్తు.. 16న పరీక్షకు అంతా సిద్ధం


 ఈనెల (సెప్టెంబర్) 16న వీఆర్వో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు TSPSC సెక్రటరీ వాణి ప్రసాద్. జూన్2 వ తేదీన విడుదల చేసిన‌ వీఆర్వో పోస్టులకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందన్నారు. పదహారున పొద్దున పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష ఉంటుందన్నారు. దాదాపు 11 లక్షల మంది  దరఖాస్తు చేసుకున్నారని… ఇప్పటి వరకు ఇన్ని లక్షల మంది ఏ పరీక్షకు దరఖాస్తు  చేసుకోలేదని చెప్పారామె.
11 లక్షల మంది అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ల సహకారంతో అన్ని జిల్లాలో సెంటర్స్ ఏర్పాటు చేశామని వాణిప్రసాద్ చెప్పారు. రాష్ట్రమంతటా 2వేల 945 సెంటర్స్ సిద్ధం చేశామన్నారు. HMDA పరిధిలో 3 లక్షల మంది పరీక్ష రాస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో‌ అత్యధిక మంది పరీక్ష రాయడానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారని చెప్పిన వాణి ప్రసాద్… పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండటంతో అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామన్నారు.

ఇప్పటి వరకు 7 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. పరీక్ష రాసిన తరువాత స్కానింగ్ కాపీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్ ను ముందే డౌన్ లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు