Wednesday, 27 June 2018

TELANGANA BUDGET ANALYSIS (telugu) 2018 - 2019

తెలంగాణ మొత్తం బడ్జెట్.. రూ.1,74,453కోట్లు
* ప్రవేశ పెట్టిన తేదీ: 15- 03 - 2018
హైదరాబాద్: పేద, బలహీన వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు.ఈరోజు శాసనసభలో ఆయన వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని.. ప్రజాకర్షక బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు.
‘మా పాలన స్వర్ణయుగం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఎన్నో మైళ్లు ప్రయాణించాం. అణిగారిన స్థితిలో నుంచి అభివృద్ధి వైపు సాగుతున్నాం. నూతన పారిశ్రామిక విధానంతో తయారీ రంగం 6.4శాతం వృద్ధి చెందుతుంది. విద్యుత్ రంగంలో వృద్ధి వల్ల వ్యవసాయం సాగు పెరిగింది. దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాంస శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ‘ఎగ్ బాస్రెట్ ఆఫ్ ఇండియా’ మారింది. కోళ్ల పరిశ్రమలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. ప్రభుత్వానికి, రైతులకు మధ్య రైతు సమన్వయ సమితి సంధానకర్తగా వ్యవహరిస్తుంది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా జల వనరులు అభివృద్ధి చేస్తున్నాం. ‘ ప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రతి ముఖంలో సంతోషం’ మా లక్ష్యం. నిస్సహాయులకు పింఛను అందిస్తున్నాం. బోదకాలు బాధితులకు రూ.వెయ్యి పింఛను ఇస్తున్నాం. నీటిపారుదల ప్రాజెక్టులకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేస్తాం’ అని ఈటల స్పష్టం చేశారు.
* రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు
* ద్రవ్యలోటు అంచనా.. రూ.29,077కోట్లు
* జీడీపీలో ద్రవ్య లోటు 3.45శాతం
* రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు
* కేంద్రం వాటా రూ.29,041కోట్లు
బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
* నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
* రెండు పడకగదుల ఇళ్లకు రూ.2,643కోట్లు
* పంటల పెట్టుబడి మద్దతుకు రూ.12వేల కోట్లు
* రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు
* వ్యవసాయ యంత్రీకరణకు రూ.522కోట్లు
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,563కోట్లు
* బిందు తుంపర సేంద్యానికి రూ.127కోట్లు
* గురుకులాలకు రూ.2,283కోట్లు
* ఆర్ అండ్ బీకి రూ.5,575కోట్లు
* విద్యుత్ రంగానికి రూ.5,650కోట్లు
* చేనేత, జౌళి రంగానికి రూ.1200 కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ.1,286కోట్లు
* ఐటీ శాఖకు రూ.289కోట్లు
* పురపాలక శాఖకు రూ.7,251కోట్లు
* గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1500కోట్లు
* పట్టణాభివృద్ధికి రూ.1000కోట్లు
* ఎస్సీ ప్రగతికి రూ.16,453కోట్లు
* ఎస్టీ ప్రగతి నిధికి రూ.9,693కోట్లు
* సాంస్కృతిక శాఖకు రూ.58కోట్లు
* యాదాద్రి అభివృద్ధికి రూ.250కోట్లు
* వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు
* భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు
* బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ.50కోట్ల చొప్పున కేటాయింపు
* దళితులకు మూడెకరాల భూ పంపిణీకి రూ.1,469కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి రూ.8,063కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.5,920కోట్లు
* ఎంబీసీ కార్పోరేషన్కు రూ.1000 కోట్లు
* విద్యా శాఖకు రూ.10,830కోట్లు
* గురుకులాలకు రూ.2,823కోట్లు
* వరంగల్ కార్పోరేషన్కు రూ.300కోట్లు
* కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.1,450కోట్లు
* మైనార్టీల సంక్షేమం కోసం రూ.2,500కోట్లు
* వైద్య, ఆరోగ్య శాఖకు రూ.7,375కోట్లు

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు