యథావిధిగా పోలీస్ కొలువుల భర్తీ
-టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
-నేడు కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష
-ఏర్పాట్లు పూర్తిచేసిన నియామక బోర్డు
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చేపట్టిన పోలీస్ కొలువుల భర్తీప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షను పూర్తిచేశామని చెప్పారు. ఆదివారం కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లుచేశామని ఆయన శనివారం నమస్తే తెలంగాణకు తెలిపారు. పోలీస్‌శాఖలోని 18,428 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి మే 31న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినందున పోస్టుల భర్తీ ప్రక్రియకు ఎలాంటి అవరోధం ఉండబోదని భావిస్తున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. ఫిజికల్ టెస్ట్‌లను అక్టోబర్, నవంబర్‌లో నిర్వహించాలనుకుంటున్నామని, ప్రాథమిక రాత పరీక్షల అనంతరం తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ నెల 30న కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు.
నేటి ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఆదివారం నిర్వహించనున్న కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. 29 కమ్యూనికేషన్ ఎస్సై (ఎస్సై ఐటీ అండ్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్న పరీక్షకు 14 వేలమంది అభ్యర్థులు హాజరుకానున్నారని, మొత్తం 20 కేంద్రాలను ఏర్పాటుచేశామని చెప్పారు. 26 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుల కోసం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షకు 7,700 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. వీరికోసం బంజారాహిల్స్‌లో రెండు, ఆసిఫ్‌నగర్‌లో 3, మొయినాబాద్‌లో ఆరు కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లుచేసినట్టు ఆయన వివరించారు.

No comments:
Post a Comment