Saturday 8 September 2018

TEMPLES IN TELANGANA

దేవాలయాలు



1) తెలంగాణలో ఏకైక చాముండేశ్వరీ దేవి ఆలయం ఎక్కడ ఉంది ?
ఎ) నల్గొండ జిల్లా
బి) మెదక్ జిల్లా #
సి) కామారెడ్డి జిల్లా
డి) సంగారెడ్డి జిల్లా
2) కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అతిపెద్ద ఆలయం ఏది ?
ఎ) నాగోబా దేవాలయం
బి) కూసుమంచి శివాలయం #
సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
డి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం
3) రామునిచే ప్రతిష్టించబడిన శివలింగమున్న దేవాలయం ఏది ?
ఎ) కొమురవెల్లి మల్లన్న దేవాలయం
బి) కూసుమంచి శివాలయం
సి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
డి) కీసర రామలింగేశ్వరాలయం #
4) చిలుకూరు బాలాజీకి గల మరోక పేరు ఏమిటి ?
ఎ) పాస్ పార్ట్ బాలాజీ
బి) ఫారెన్ బాలాజీ
సి) వీసా బాలాజీ #
డి) ఏదీ కాదు
5) రెండవ శాతకర్ణి నిర్మించిన జైన ఆలయం ఏది ?
ఎ) నీలకంఠేశ్వరాలయం #
బి) నవనాథ సిద్ధేశ్వరాలయం
సి) రామప్ప దేవాలయం
డి) కాళేశ్వరం ఆలయం
6) ఒకే పీఠంపై రెండు శివలింగాలున్న దేవాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రామప్ప దేవాలయం
బి) నీలకంఠేశ్వరాలయం
సి) కూసుమంచి శివాలయం
డి) కాళేశ్వరం శివాలయం #
7) మహబుబ్ నగర్ జిల్లాలో పశ్చిమ చాళుక్య రాజులు నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) నవనాథ సిద్ధేశ్వరాలయం
బి) ఆలంపురం ఆలయం #
సి) శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం
డి) నీలకంఠేశ్వరాలయం
8) కాకతీయ చాళుక్య శైలిలో హన్మకొండలో రుద్రమదేవుడు నిర్మించిన ఆలయం పేరు ఏది?
ఎ) రామప్ప దేవాలయం
బి) మన్యంకొండ దేవాలయం
సి) వేయి స్తంభాల గుడి #
డి) ఆలంపూర్ దేవాలయాలు
9) కాకతీయ గణపతిదేవుడు శ్రీ శంభులింగేశ్వర ఆలయాన్ని ఎక్కడ నిర్మించారు ?
ఎ) వరంగల్ #
బి) నిజామాబాద్
సి) రంగారెడ్డి
డి) మెదక్
10) పశ్చిమ చాళుక్యరాజు రెండవ పులకేశి వేంగి, తెలంగాణలను జయించినందుకు విజయ చిహ్నంగా ఏ ఆలయాన్ని నిర్మించారు ?
ఎ) ఎల్లమ్మ దేవాలయం
బి) పెద్దమ్మ ఆలయం
సి) ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయం
డి) భద్రకాళీ ఆలయం #
11) శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు అభివృద్ధి చేసిన ఆలయం పేరు ఏమిటి ?
ఎ) బాసర
బి) ధర్మపురి #
సి) బిర్లామందిర్
డి) యాదగిరి గుట్ట
12) తెలంగాణలో అతి పెద్దదైన 2వ తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వర దేవాలయం ఏది ?
ఎ) ఆలంపూర్ దేవాలయం
బి) శ్రీ శంభులింగేశ్వర ఆలయం
సి) రామప్ప దేవాలయం
డి) మన్యంకొండ దేవాలయం #
13) 17వ శతాబ్ధంలో తెలుపు నలుపు నాపరాతితో నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) డిచ్ పల్లి రామాలయం #
బి) కీసర రామలింగేశ్వరాలయం
సి) సరస్వతి ఆలయం
డి) ఆలంపూర్ ఆలయం
14) నిర్మల్ జిల్లాలోని బిర్భలుడనే కన్నడరాజు నిర్మించిన ఆలయం ఏది ?
ఎ) భద్రకాళీ ఆలయం
బి) డిచ్ పల్లి ఆలయం
సి) సరస్వతి ఆలయం #
డి) బాలాజీ ఆలయం
15) బౌద్ధమత విశేషాలతో కూడిన మ్యూజియం ఏ కొండపై ఉంది ?
ఎ) కోయిల కొండ
బి) నాగార్జున కొండ #
సి) లింబాద్రి గుట్ట
డి) పైవేవి కావు
16) కోస్లాపూర్ లో ఉన్న గోండు ప్రజలు ఏ దేవాలయంలో జాతరను జరుపుకుంటారు ?
ఎ) వందస్తంభాల ఆలయం
బి) హనుమాన్ దేవాలయం
సి) మన్యంకొండ దేవాలయం
డి) నాగోబా దేవాలయం #
17) ఫ్రెంచివారు నిర్మించిబడిన నిర్మల్ కోటకు మరొక పేరు ఏమిటి ?
ఎ) శామ్ గాడ్ కోట #
బి) గద్వాల్ కోట
సి) మెదక్ కోట
డి) గోల్కొండ కోట
18) నామిరెడ్డి నిర్మించిన త్రికూట ఆలయం ఏది ?
ఎ) ఎలగందల్ కోట
బి) ఓరుగల్లు కోట
సి) పిల్లలమర్రి #
డి) దోమకొండ
19) మొగల్ వాస్తుశైలి ప్రతిబింబించే అద్దాలమేడ అని పిలవబడే కోట ఏది ?
ఎ) ఓరుగల్లు కోట
బి) భువనగిరి కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ #
20) దేశంలో అతిపెద్ద ఫిరంగి ఏ కోటలో ఉంది ?
ఎ) ఎలగందల్ కోట
బి) గద్వాల్ కోట #
సి) మెదక్ కోట
డి) నిర్మల్ కోట
21) రుద్రదేవుడు నిర్మించిన దేవాలయం పేరు ఏమిటి ?
ఎ) రాచకొండ కోట
బి) వందస్తంభాల ఆలయం
సి) వెయ్యి స్తంభాల గుడి #
డి) మన్యంకొండ దేవాలయం
22) శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గండభేరుండ ముద్ర ఏ కోటలో కన్పిస్తుంది ?
ఎ) మెదక్ కోట #
బి) నిర్మల్ కోట
సి) గద్వాల్ కోట
డి) భువనగిరి కోట
23) త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరు మీద వచ్చిన కోట ఏది ?
ఎ) గద్వాల్ కోట
బి) రాచకొండ కోట
సి) భువనగిరి కోట #
డి) ఇవేవి కావు
24) కరీంనగర్ పూర్వ నామంగా నిర్మించిబడిన కోట పేరు ఏమిటి ?
ఎ) దోమకొండ
బి) ఎలగందల్ కోట #
సి) మెదక్ కోట
డి) నిర్మల్ కోట
25) మొదట కాకతీయులు నిర్మించిన గోల్కొండ పూర్వనామం ఏది ?
ఎ) మంకాల్ #
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు