Saturday 8 September 2018

PROJECTS IN TELANGANA

 తెలంగాణ ప్రాజెక్టులు – QUICK REVISION



1) నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ :

ఈ ప్రాజెక్టుని నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం దగ్గర నిర్మించారు.
1955, డిసెంబర్ 10న ప్రారంభమైంది.
నాగార్జున సాగర్ డ్యామ్ పొడవు 1500 మీ ఉండగా ఎత్తు 124 మీ.
ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం 2.15 లక్షల చదరపు కిలోమీటర్లు
దీనికి కింద 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుంది.

2) శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు

దీన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు దగ్గర గోదావరి నదిపై నిర్మించారు.
ఈ ప్రాజెక్టుకి 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
1978లో నిర్మాణం పూర్తయింది. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు కింద 16.5 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి.

3) ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఇది
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రావులపల్లి దగ్గర నిర్మించారు. 11 టీఎంసీల సామర్థ్యంతో 1984లో ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.
ఈ ప్రాజెక్టు ఎడమ కాలుని ఎన్టీఆర్ కాలువ అంటారు. దీని కింద 26,103 హెక్టార్లు సాగవుతుంది
కుడి కాలువని నల్ల సోమాద్రి కాలువ అంటారు. దీని కింద 15,257 హెక్టార్లు సాగవుతున్నాయి.
ప్రియదర్శిన జూరాల ప్రాజెక్టు ద్వారా 221.40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

4) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం

ఈ ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం దగ్గర నిర్మాణం జరుగుతోంది.
కాళేశ్వరం కింద 45వేల ఎకరాల ఆయకట్టు ఉంది

5) నిజాం సాగర్

నిజాం సాగర్ ను మంజీర నదిపై నిర్మిస్తున్నారు
సంగారెడ్డి జిల్లాలోని బంజపల్లి దగ్గర నిర్మాణం జరుగుతోంది.
1923లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
1931లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. నవాబ్ అలీ నవాజ్జంగ్ బహదూర్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ( ఈయన పేరుతోనే తెలంగాణ ఇంజనీర్స్ డే ని నిర్వహిస్తున్నారు )
58 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 2.31 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.

6) రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)

RDS ప్రాజెక్టును తుంగభద్రా నదిపై నిర్మించారు.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మన్ని తాలూకాలోని రాజోలిబండ దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.
ప్రాజెక్టును నిజాం కాలంలో 1946లో ప్రారంభించారు. 1958లో పూర్తయింది.
ప్రాజెక్టు నీటిని గద్వాల, అలంపూర్ మండలాల్లో 75 గ్రామాలకు అందిస్తున్నారు.

7) లోయర్ మానేర్ డ్యామ్

LMD కరీంనగర్ జిల్లాలోని గోదావరి నది ఉపనది అయిన మానేరు నదిపై నిర్మించారు.
1985లో ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయింది.

8) సింగూరు ప్రాజెక్టు

సింగూరు ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం దగ్గర నిర్మించారు.
30 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుతో 40వేల ఎకరాలు సాగవుతున్నాయి
సింగూరు ప్రాజెక్టు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

9) దేవాదుల ఎత్తిపోతల పథకం

దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేట దగ్గర నిర్మించారు.
దేవాదుల ఆయకట్టు 6.21 లక్షల ఎకరాలు

10) సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్

-ఈ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండంలోని రాళ్లపాడు దగ్గర నిర్మిస్తున్నారు.
-2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
-50 టీఎంసీల గోదావరి నీటిని ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోస్తారు.

11) మూసీ ప్రాజెక్టు

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో మూసీ నదిపై నిర్మించారు.
ప్రాజెక్టు 1954లో ప్రారంభమైంది. 1961లో పూర్తయింది.
మూసీ ప్రధాన కాలువ 64 కి.మీ.
ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

12) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం

జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని ఉప్పేరు దగ్గర ఉంది.
ఈ పథకానికి 2005లో శంకుస్థాపన జరిగింది. ఆయకట్టు 2 లక్షల ఎకరాలు.

13) మరికొన్ని ప్రాజెక్టులు

1) కంతానపల్లి సుజల స్రవంతిని గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఇది జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఉంది
2) అలీసాగర్ ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఉంది.
3) గుత్ప ఎత్తిపోతల పథకం (ఆర్గు రాజారామ్) ను గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ దగ్గర ఉంది.
4) కడెం రిజర్వాయర్ నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్దూరు గ్రామం దగ్గర నిర్మించారు.
5) కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుపై 1954లో నిర్మించారు. దేవరకద్ర మండలం బొల్లారం దగ్గర ఉంది. దీంతో 50వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయి

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు