Thursday 6 September 2018

అసెంబ్లీ రద్దుతో నోటిఫికేషన్లు ఆగుతాయా ?

రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆపద్దర్మ ప్రభుత్వం కొనసాగుతోంది... ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నడుస్తున్న నోటిఫికేషన్ల సంగతేంటి ... ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొనసాగుతాయా... వాటిని రద్దు చేస్తారా... రిజల్ట్స్ ఇస్తారా... కొత్త వాటి పరిస్థితి ఏంటి... ఇది నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్న ప్రశ్నలు. రాబోయే ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న చాలామంది నిరుద్యోగులకు చదవాలో... వద్దా... అర్థం కాని సందిగ్దంలో పడ్డారు. ఈ డౌట్స్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తోంది... తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్.
అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్దర్మ ప్రభుత్వం నడుస్తోంది. కొత్త నోటిఫికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉండదు కాబట్టి ... కొత్త కొలువులకు ప్రకటనలు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజ్ చేసి... ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించినవి కొనసాగే అవకాశాలున్నాయి. వీటిని రద్దు చేయరు.
అంటే ప్రస్తుతం ఈ కింది నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి
1) ఈనెలలో వీఆర్వో ఎగ్జామ్
2) నెలాఖరులో జరిగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు
3) వచ్చే నెలలో జరిగే గ్రూప్ - 4 పరీక్షలు
4) ఇప్పటికే టైం టేబుల్ ప్రకటించిన గురుకుల పరీక్షలు
5) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శుల పోస్టులు
ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ యధావిధిగా జరిగే అవకాశాలున్నాయి. అయితే ఫైనల్ రిజల్ట్స్ మాత్రం పెండింగ్ లో పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఎన్నికలు నవంబర్ 2018 లో జరిగితే డిసెంబర్ లో రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. అప్పటి వరకూ ఉద్యోగాలపై తుది నియామకాలు గానీ, ఫలితాల ప్రకటన కానీ ఉండే అవకాశం లేదు. గతంలో గ్రూప్ - 2 విషయంలోనూ ఇదే జరిగిందని అప్పట్లో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వారు చెబుతున్నారు.
ఇప్పటికే పూర్తయిన సబ్ ఇన్సెపెక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు కూడా వెల్లడించే అవకాశముంది. అభ్యర్థుల శారీరక దారుఢ్య పరీక్షలు, ఫైనల్ ఎగ్జామ్ కి కూడా ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. కానీ తుది ఫలితాలు, నియామకాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పెండింగ్ లో పెట్టే అవకాశముంది.
ఇక ఆర్థిక శాఖ అనుమతించిన గ్రూప్ - 1 తో పాటు ఇతర పోస్టులపై మాత్రం నోటిఫికేషన్లు కొత్తగా వెలువడే ఛాన్స్ లేదు. ఆర్థికశాఖ అనుమతించినా... TSPSC వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని అంటున్నారు.
సో ... ప్రస్తుతం VRO/PC/GR.IV/ SI Mains / Gurukula Exams/ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రిపేర్ అయ్యేవారు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని మనవి. ఎగ్జామ్స్ యధావిధిగా జరుగుతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు