Tuesday 18 September 2018

JOBS IN VIJAYA BANK

విజయాబ్యాంకులో 330 పోస్టులు...



భారత ప్రభుత్వ పరిధిలోని విజయాబ్యాంకులో ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-పోస్టు: ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) (జేఎంజీ-1 స్కేల్)
-మొత్తం ఖాళీలు: 330 వీటిలో జనరల్-167, ఓబీసీ-89, ఎస్సీ-49, ఎస్టీ-25)
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్‌ఎల్‌సీ)లకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీఎం లేదా పీజీబీఎం లేదా తత్సమాన కోర్సులో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఫుల్‌టైం కోర్సు ఉత్తీర్ణత. లేదా పీజీలో కామర్స్/సైన్స్ లేదా ఎకనామిక్స్/లా లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ (సీఎస్) ఉండాలి.
-పేస్కేల్: రూ. 23,700-42,020/- వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ తదితర అలవెన్సులు ఇస్తారు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ ఎగ్జామ్: ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ స్పెషల్), ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ల నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి:120 నిమిషాలు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్‌లవారీగా (ఎస్సీ/ఎస్టీ,ఓబీసీ, జనరల్)
ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/- , ఇతరులకు రూ. 600/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.vijayabank.com

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు