Last Date for Applying for Group 4 & VRO posts is Extended Upto 8 July 2018
వీఆర్వో ఉద్యోగాల దరఖాస్తు గడుపు పెంపు
హైదరాబాద్: వీఆర్వో సహా పలు ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పెరిగింది. ఏఎస్ఓ, వీఆర్వో, సీసీఎల్ఏ, హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పెరిగింది. ఇవాళ చివరి రోజు కావడంతో చాలా మంది టీఎస్పీఎస్సీ సైట్‌కి లాగిన్ అయ్యారు. దీంతో టీఎస్పీఎస్సీ సర్వర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో దరఖాస్తుల గడువును ఈ నెల(july) 8 తేదీ వరకు పెంచుతున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇవాళ సెకనుకు 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సర్వీస్ ప్రొవైడర్లు తెలిపారు.
No comments:
Post a Comment